టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి విషయంలో లోకం భయపడ్డట్టే జరుగుతోంది. బాబు రాజకీయ స్వార్థం కోసం ఆమెను మరింతగా నవ్వులపాలు చేసే దిశగా టీడీపీ పొలిట్‌బ్యూరో పనికి మాలిన నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భువనేశ్వరి విషయంలో చంద్రబాబు చర్య… మహాభారత కాలంలో ధర్మరాజు జూద వ్యసనానికి భార్య ద్రౌపదిని పందెం కాయడాన్ని గుర్తు చేస్తోందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతుండడం గమనార్హం.
భువనేశ్వరి వ్యక్తిగతాన్ని వీధుల్లోకి తెచ్చేందుకు… అందమైన పేరుతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం ఏపీ రాజకీ యాల్లో సరికొత్త అధ్యాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. ప్రజా స్వామ్య సౌధమైన శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని నిర్ణయించడం విశేషం.
ప్రజాస్వామ్యమనేది స్త్రీ మూర్తి అనుకుంటే, పార్టీ ఫిరాయింపులతో ఆమె వలువలు లేకుండా చేసిన మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబే అని పౌర సమాజం మండిపడుతోంది. అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టిన దివంగత ఎన్టీఆర్‌ను మెడపట్టి సీఎం పీఠంపై నుంచి దించడం మొదలుకుని, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకోవడం వరకూ చంద్రబాబు చర్యలు… ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేయడం కాదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
చివరికి తన భార్యకు .జరగరాని అవమానం ఏదో జరిగిపోయిందంటూ …రాజకీయ ప్రయోజనాలను ఆశించి అవాంఛనీయ కార్యక్రమాలకు సిద్ధం కావడం చంద్రబాబుకే చెల్లిందని పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమలో చైతన్యం లేకుండానే చంద్రబాబును గద్దె దింపామా? అని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. తనకు భార్య గౌరవ మర్యాదల కంటే… రాజకీయం, అధికారమే ముఖ్యమని చంద్రబాబు మరోసారి భువనేశ్వరి సాక్షిగా నిరూపించారనే విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు…డిసెంబర్ ఒకటి నుంచి భువనేశ్వరి- మరో మాజీ మంత్రి మధ్య సంబంధాల గురించి ఆ పార్టీ ఊరూరా ప్రచారం చేస్తుందన్న మాట. ఇదేనా ఆడపడుచుల ఆత్మగౌరవం కాపాడ్డం? ఇదేనా మహిళలకు టీడీపీ ఇచ్చే గౌరవం? అని ప్రశ్నించే వాళ్లకు ఆ పార్టీ ఏం సమాధానం చెబుతుంది?