బ‌న్నీ జైత్ర‌యాత్ర‌లో హింస‌

దేవ‌ర‌గ‌ట్టు మాళ మ‌ల్లేశ్వ‌ర‌స్వామి ద‌స‌రా వేడుక‌లో అంద‌రూ ఊహించిన‌ట్టుగా హింస చోటు చేసుకుంది. 100 మంది గాయ‌పడ‌గా, వీరిలో 9 మంది ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉన్న‌ట్టుగా స‌మాచారం.  Advertisement కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో సుమారు…

దేవ‌ర‌గ‌ట్టు మాళ మ‌ల్లేశ్వ‌ర‌స్వామి ద‌స‌రా వేడుక‌లో అంద‌రూ ఊహించిన‌ట్టుగా హింస చోటు చేసుకుంది. 100 మంది గాయ‌పడ‌గా, వీరిలో 9 మంది ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉన్న‌ట్టుగా స‌మాచారం. 

కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండ‌పై మాళ మ‌ల్లేశ్వ‌ర‌స్వామి ద‌స‌రా బ‌న్నీ జైత్ర‌యాత్ర ఉత్స‌వానికి ప్ర‌త్యేకత‌ ఉంది.  శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఉత్స‌వం ప్రారంభ‌మైంది.

ఉత్స‌వం సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలప‌డ్డారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయాలు అయ్యాయి. అలాగే 9 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. క‌రోనా కార‌ణంగా పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఒక్కో గ్రామం నుంచి 150 మందికి అనుమ‌తి ఇచ్చారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో పోలీసుల పర్యవేక్షణ చేప‌ట్టారు. 

ఇదిలా వుండ‌గా ఈ ఉత్స‌వంలో ప్ర‌తి ఏడాది హింస చోటు చేసుకుంటున్నా సంప్ర‌దాయం పేరుతో కొన‌సాగిస్తుండ‌డం గ‌మ‌నార్హం.