హిందీ మార్కెట్ కోసం.. ప‌ది కోట్ల రెమ్యూనిరేష‌న్ తో ద‌త్!

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కు హిందీ మార్కెట్ పై గాలి మ‌ళ్లింది. త‌మిళంలో స్టార్లుగా వెలిగిన‌, వెలుగుతున్న వారికి హిందీలో కాస్తో కూస్తో మార్కెట్ ఉంటూనే వ‌స్తోంది. ర‌జనీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ లు…

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కు హిందీ మార్కెట్ పై గాలి మ‌ళ్లింది. త‌మిళంలో స్టార్లుగా వెలిగిన‌, వెలుగుతున్న వారికి హిందీలో కాస్తో కూస్తో మార్కెట్ ఉంటూనే వ‌స్తోంది. ర‌జనీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ లు హిందీలో భారీ మార్కెట్ నే చూశారు. ఇక ప్ర‌స్తుత త‌రం హీరోల్లో ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ కే హిందీలో ఎక్కువ గుర్తింపు ఉంది. 

విజ‌య్ అనువాద సినిమాలు హిందీ టీవీల్లో, యూట్యూబ్ లో వ్యూస్ పొందాయేమో కానీ, డైరెక్టు ప్ర‌య‌త్నాలు అంత లేవు. ఇలాంటి క్ర‌మంలో లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ హీరోగా రూపొందుతున్న సినిమాను హిందీ మార్కెట్ లో కూడా క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ ను విజ‌య్ సినిమాలోకి తీసుకున్నారట‌. ఈ సినిమాలో ద‌త్ విల‌న్ పాత్ర‌ను పోషిస్తున్న‌ట్టుగా స‌మాచారం. దీనికి గానూ ఆ న‌టుడికి ప‌ది కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ కు సై అన్నార‌ట విజ‌య్ సినిమా రూప‌క‌ర్త‌లు. భారీ రెమ్యూనిరేష‌న్ల నేప‌థ్యంలో ద‌త్  సౌత్ సినిమాల‌కు సై అంటున్నాడు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ సినిమాలో చేస్తున్న‌ట్టుగా ఉన్నాడు.

మ‌రో విశేషం ఏమిటంటే విజ‌య్ సినిమాలో మ‌రో విల‌న్ పాత్ర కోసం మ‌ల‌యాళ న‌టుడు పృథ్విరాజ్ ను సంప్ర‌దిస్తున్నార‌ట‌. లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాల్లో.. విల‌న్ల పాత్ర‌లు హీరోల పాత్ర‌కు ధీటుగా ఉంటున్నాయి. విక్ర‌మ్ లో మూడు స‌మ‌ప్రాధాన్యత ఉన్న ర‌చ‌న‌తో లోకేష్ ఆక‌ట్టుకున్నాడు. మ‌రి విజ‌య్ సినిమాలో సంజ‌య్ ద‌త్ కు తోడు పృథ్విరాజ్ ను కూడా న‌టింప‌జేస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న ఆస‌క్తిని రేపుతోంది.