హృతిక్‌ను క‌ల‌వ‌రిస్తున్న‌ టాప్ హీరోయిన్‌

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నెమ్మ‌దిగా మొద‌లైన ఆమె ప్ర‌స్థానం ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ పొజీషన్‌కు చేరుకోవ‌డం వెనుక పూజా కృషిని అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే ఊరికే ఎవ‌రూ కూడా…

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నెమ్మ‌దిగా మొద‌లైన ఆమె ప్ర‌స్థానం ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ పొజీషన్‌కు చేరుకోవ‌డం వెనుక పూజా కృషిని అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే ఊరికే ఎవ‌రూ కూడా అంద‌లాలు ఎక్క‌లేరు. టాలీ వుడ్‌లో ఆమె క‌న‌బ‌రిచిన అద్భుత న‌ట‌నే…బాలీవుడ్‌లో కూడా అవ‌కాశాలు ద‌క్కేలా చేసిందంటే అతిశ‌యోక్తి కాదు.

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాల్లో పూజా హెగ్డే ఛాన్సులు కొట్టింది. దీంతో ఆమె బాలీవుడ్ హీరో యిన్‌గా ప్ర‌మోష‌న్ పొందింది. లాక్‌డౌన్ వేళ‌లో తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పూజ త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

“మీతో క‌లిసి న‌టించిన హీరోల్లో ప్ర‌స్తుత లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఎవ‌రితో స్వీయ నిర్బంధంలో ఉండాల‌నుకుంటారు? వారి నుంచి ఏమి నేర్చుకుంటారు?” అని ఓ నెటిజ‌న్ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ను పూజా హెగ్డేకు సంధించాడు. దానికి ఆ టాప్ హీరోయిన్ ఏం స‌మా ధానం చెప్పిందో తెలుసుకోండి మ‌రి.

“నేనిప్పటి వరకు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీయార్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి పని చేశా. అవకాశమొస్తే అందరినీ స్వీయనిర్బంధంలోకి తీసుకుని, వారి నుంచి అనేక విషయాలు తెలుసుకుంటా. ఒక‌వేళ  ఒక్కరి తోనే అయితే.. నేను హృతిక్ రోషన్‌ను మాత్ర‌మే ఎంచుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హృతిక్‌ నా కలల హీరో. బాలీ వుడ్‌లో నా తొలి సినిమా కూడా అత‌నితోనే. ఆయన అనేక విషయాల్లో నాకు స్ఫూర్తి. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చు కుంటా” అని పూజ చెప్పు కొచ్చారు. రెండు రోజుల క్రితం హృతిక్‌పై ఒక‌ప్ప‌టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ మీనా కూడా త‌న ప్రేమ‌ను వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు పూజాహెగ్డే కూడా హృతిక్‌ను క‌ల‌వ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం