ఇండియాలో ఆ నాలుగు రాష్ట్రాల్లోనే 60 శాతం పై కేసులు!

ఇండియాలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 90 వేల‌కు రీచ్ అయ్యింది. రోజువారీ కొత్త కేసుల విష‌యంలో ఏ రోజుకారోజు హెచ్చు స్థాయిలో నంబ‌ర్లు వినిపిస్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లోనే ఏకంగా ఐదు వేల…

ఇండియాలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 90 వేల‌కు రీచ్ అయ్యింది. రోజువారీ కొత్త కేసుల విష‌యంలో ఏ రోజుకారోజు హెచ్చు స్థాయిలో నంబ‌ర్లు వినిపిస్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లోనే ఏకంగా ఐదు వేల స్థాయిలో కొత్త‌గా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వ‌ల‌స కార్మికులు ఎక్క‌డివారు అక్క‌డ‌కు చేరుకుంటూ ఉండ‌టం, ఇదే స‌మ‌యంలో లాక్ డౌన్ నుంచి మిన‌హాయింపుల నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య బాగా పెరుగుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. 

అయితే గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌లో 50 శాతం పై స్థాయి కేసులు కేవ‌లం మూడు రాష్ట్రాల్లోనే చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, త‌మిళ‌నాడు.. ఈ మూడు రాష్ట్రాల్లోనే ఏకంగా 50 వేల‌కు పైగా కేసులున్నాయి. మొత్తం కేసులు 90 వేలు అయితే, 50 వేల కేసులు ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిల్లో కూడా 30 వేల కేసులు కేవ‌లం మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌య్యాయి.

దేశం మొత్తం మీది కేసుల్లో 30 శాతానికి పైగా కేసులు మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌య్యాయి. గుజ‌రాత్, త‌మిళ‌నాడు రాష్ట్రాలు చెరో ప‌ది వేల కేసుల‌తో ఆ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆ త‌ర్వాత ఢిల్లీలో కూడా 10 వేల స్థాయి కేసులు న‌మోద‌య్యాయి. ఇలా నాలుగు  రాష్ట్రాల్లో 60 శాతానికిపైగా కేసులున్నాయి. రాజ‌స్తాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లు నాలుగు వేల‌కు పైగా కేసుల స్థాయిలో ఉన్నాయి. ఇలా 75 శాతం కేసులు 7 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

స్థూలంగా రిక‌వ‌రీల విష‌యానికి వ‌స్తే.. దాదాపు 34 వేల మంది డిశ్చార్జి అయ్యారు. మూడో వంతుకు పైగా కేసులు ఇప్ప‌టి వ‌ర‌కూ డిశ్చార్జి కావ‌డం కాస్త ఊర‌ట‌ను ఇస్తున్న అంశం.