వరల్డ్ కప్: బంగ్లాదేశ్.. బెబ్బులిలా విరుచుకుపడింది!

ఇక నుంచి తాము గెలిస్తే దాన్ని 'సంచలనం' అంటూ రాయొద్దు అని స్పోర్ట్స్ జర్నలిస్టులకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇటీవలే చెప్పాడు. బహుశా అతడి మాటల్లోనే కాదు.. బంగ్లాదేశ్ చేతల్లో కూడా ఆ…

ఇక నుంచి తాము గెలిస్తే దాన్ని 'సంచలనం' అంటూ రాయొద్దు అని స్పోర్ట్స్ జర్నలిస్టులకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇటీవలే చెప్పాడు. బహుశా అతడి మాటల్లోనే కాదు.. బంగ్లాదేశ్ చేతల్లో కూడా ఆ దూకుడు కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నా ఇంకా 'బంగ్లా బేబీలు' అనిపించుకుంటున్న ఆటగాళ్లు ఇప్పుడు విరుచుకుపడ్డారు. వెస్టిండీస్ ను ఒక ఆట ఆడుకున్నారు బంగ్లాదేశీయులు.

నంబర్ల ప్రకారం చూస్తే వెస్టిండీస్ కూడా మ్యాచ్ లో బాగానే ఆడింది. బంగ్లాదేశ్ కు వెస్టిండీస్ జట్టు 322 పరుగుల భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని అందుకోవడం అంత సులభం ఏమీ కాదు. వెస్టిండీస్ జట్టు బౌలింగ్ విభాగం మరీ అంత బలహీనంగా ఏమీ లేదు. అయినా బంగ్లా బ్యాట్స్ మన్ మాత్రం తమ  దూకుడు ఏమిటో చూపించారు. 

ఆ పరుగుల లక్ష్యాన్ని బంగ్లా చేధించడం కూడా అంత ఆశ్చర్యం ఏమీ కాదు. అయితే ఎటొచ్చీ కేవలం 41 ఓవర్ లోనే 322 రెండు పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా బ్యాట్స్ మన్ చేధించడం మాత్రమే నిజమైన ఆశ్చర్యం! సంచలనం. బంగ్లా ఈ విజయం సాధించడం సంచలనం కాదు, ఆ భారీ స్కోరును ఇంకా ఎనిమిది ఓవర్లకు పైనే మిగిలి ఉండగా చేధించేయడం మాత్రం సంచలనమే. 

ఈ దూకుడు చూస్తే ఒకవేళ వెస్టిండీస్ నాలుగు వందలకు పైగా స్కోరును నిర్దేశించి ఉన్నా బంగ్లా బ్యాట్స్  ఆ స్కోర్ ను ఊదేసే వాళ్లేమో అని క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. బంగ్లా బ్యాట్స్ మన్లలో షకీబ్ సెంచరీతో చెలరేగాడు. మిగిలిన బ్యాట్స్ మన్ కూడా రాణించడం తో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆ జట్టు  విజయాన్ని సొంతం చేసుకుంది.