అందరం ఒక్కటిగా ఉందాం

అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం అంశంపై మద్రాసు హైకోర్టు ఈరోజు కీలక తీర్పునిచ్చింది. అన్నాడీఎంకేలో జూన్‌ 23న జనరల్‌ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది.  Advertisement తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకం…

అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం అంశంపై మద్రాసు హైకోర్టు ఈరోజు కీలక తీర్పునిచ్చింది. అన్నాడీఎంకేలో జూన్‌ 23న జనరల్‌ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. 

తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా జూన్‌ 23న నిర్వహించిన జనరల్‌ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్‌ సెక్రెటరీగా ఈపీఎస్‌ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్‌ తరఫు న్యాయవాది.

తీర్పు వెలువడిన తర్వాత ఓపీఎస్ మద్దతుదారులు మిఠాయిలు పంచి, పటాకులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ ఈ మేరకు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేశారు. 

ఆ ప్రకటనలో, “నేను ధర్మాన్ని నమ్మాను, కోర్టులను నమ్మాను, సత్యం, ధర్మం నా పక్షాన ఉన్నాయని నమ్మి… నేను తమిళనాడు ప్రజలను నమ్మాను. తమిళనాడు ప్రజల కోసం తమ జీవితాలను కోసం త్యాగాలు చేసిన‌ ఉద్యమ నాయకురాలు ఎంజీఆర్, నాయకురాలు అమ్మ కోరికలను నేను నమ్మాను. ఈ నమ్మకం నేటికీ నిజం అని అన్నారు.ఇప్ప‌టి అయిన అంద‌రం క‌లిసి ముందుకు వెళ్దాం అంటూ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశిస్తూ ప్ర‌క‌ట‌నలో వెలువ‌డించారు.