షాకింగ్.. మళ్లీ డుమ్మాకొట్టిన అల్లుఅర్జున్

అల్లుఅర్జున్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఎక్కడో వ్యవహారం తేడా కొడుతోందనే విషయం ఎప్పటికప్పుడు బయటకొస్తూనే ఉంది. ఫస్ట్ షెడ్యూల్ కే యూనిట్ లో లుకలుకలు బయటపడ్డాయి. బన్నీ-త్రివిక్రమ్ మధ్య కంటెంట్ పరంగా చర్చలు సరిగ్గా…

అల్లుఅర్జున్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఎక్కడో వ్యవహారం తేడా కొడుతోందనే విషయం ఎప్పటికప్పుడు బయటకొస్తూనే ఉంది. ఫస్ట్ షెడ్యూల్ కే యూనిట్ లో లుకలుకలు బయటపడ్డాయి. బన్నీ-త్రివిక్రమ్ మధ్య కంటెంట్ పరంగా చర్చలు సరిగ్గా సాగలేదని.. మరోవైపు బన్నీ, హారిక-హాసిని నిర్మాతల మధ్య కూడా సంబంధాలు పెద్దగా లేనట్టు కథనాలు వచ్చాయి అప్పట్లో.

ఇప్పుడు వీటికి మరింత బలం చేకూరుస్తూ మరో ఘటన జరిగింది. లెక్కప్రకారం నిన్నట్నుంచి బన్నీ-త్రివిక్రమ్ సినిమా రెండో షెడ్యూల్ మొదలుకావాలి. ఒకరోజు లేట్ అయినా ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాలి. కానీ అలాంటి హంగామా ఏం కనిపించలేదు. కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ లో ఉన్న బన్నీ.. పర్యటనను తనకుతానుగా పొడిగించుకున్నాడట. ఈ విషయంపై నిర్మాతలు హీరోపై కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.

హారిక-హాసిని, గీతాఆర్ట్స్ సంస్థలు కలిసి సంయక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం యూనిట్ లో అల్లు అరవింద్, బన్నీ, మరికొంతమంది ఓ గ్రూప్ గా.. నిర్మాతలు, త్రివిక్రమ్, ఇంకొంతమంది వేరే గ్రూప్ గా ఏర్పడినట్టు తెలుస్తోంది. కలిసి సినిమా చేయాల్సిన ఒకే యూనిట్ లో ఇలా రెండు గ్రూపులు కట్టారన్నమాట.

మరోవైపు ఈ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం నివేత థామస్ ను తీసుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. అంటే సినిమాలో అల్లుఅర్జున్ కు సిస్టర్ గా నివేత నటించబోతోందన్నమాట. ఇది ఎంతవరకు నిజమనేది తేలాల్సి ఉంది. 

ప్రజల్లో మేరానామ్ జోకర్?!

ఎమ్బీయస్‌: బెదురు బాబు