విశాఖలో సరికొత్త పాలనా ప్రయోగం…?

ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా చేశారు.  Advertisement మరి రాజధానికి ప్రధమ పౌరుడుగా మేయర్ ఉంటారు. దాంతో విశాఖలో పాలన ఎలా…

ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా చేశారు. 

మరి రాజధానికి ప్రధమ పౌరుడుగా మేయర్ ఉంటారు. దాంతో విశాఖలో పాలన ఎలా ఉండాలి. ఎవరికి ఏమేం ఇవ్వాలి అన్న దాని మీద వైసీపీ హైకమాండ్ పెద్ద కసరత్తునే సాగిస్తోందని సమాచారం.

జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కాగానే ప్రాంతాలు సామాజిక వర్గాలు దృష్టిలో పెట్టుకుని అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

ఇపుడు కూడా ఏపీకి గుండె కాయ వంటి విశాఖ కార్పోరేషన్ విషయంలోనూ జగన్ ఇలాంటి సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంటారు అని అంటున్నారు.

అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే విశాఖకు ఒక మేయర్ ఉంటారు. కానీ డిప్యూటీ మేయర్లు మాత్రం ఆరుగురు ఉంటారని ప్రచారం అయితే సాగుతోంది. విశాఖ కార్పొరేషన్ లో ఆరు జోన్లు ఉన్నాయి. 

ప్రతీ జోన్ కి ఒక డిప్యూటీ మేయర్ ని నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారు అంటున్నారు.అదే విధంగా సామాజికవర్గం కోణం నుంచే కాకుండా పాలనాపరంగా కూడా ఇది కొత్త విధానం అవుతుందని భావిస్తున్నారు. 

చదువుకున్న వారు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని కూడా భోగట్టా. అదే జరిగితే విశాఖ కార్పొరేషన్ దేశంలోనే మరో మారు మార్మోగడం ఖాయమని అంటున్నారు.

ఇంత మాస్ క్యారెక్ట‌ర్ నా కెరియ‌ర్ లో ఎప్పుడు చేయ‌లేదు

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు