వైల్డ్ డాగ్ సినిమా ట్రయిలర్ చూసి మహేష్ సూపర్ గా ఉందంటూ నాగార్జునకు మెసేజ్ పెట్టాడు. చిరంజీవి కూడా ట్రయిలర్ బాగుందంటూ మెసేజ్ చేశారు. ఈ రెండు స్క్రీన్ షాట్స్ ను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మరి వైల్డ్ డాగ్ ట్రయిలర్ చూసిన తర్వాత అమల రియాక్షన్ ఏంటి?
“వైల్డ్ డాగ్ ట్రయిలర్ చూసిన తర్వాత అమల నాకు మెసేజ్ చేసింది. అందులో 10 ముద్దుల ఎమోజీలు, 10 హార్ట్ ఎమోజీలు, మరో 10 స్టార్ ఎమోజీలు పెట్టింది.”
ఇలా వైల్డ్ డాగ్ ట్రయిలర్ చూసిన తర్వాత అమల రియాక్షన్ ఏంటనే విషయాన్ని బయటపెట్టాడు నాగ్. ఈ సినిమాకు ఇద్దరు యాక్షన్ డైరక్టర్లు వర్క్ చేశారని తెలిపిన నాగ్.. అలా ఇద్దర్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో రీజన్ బయటపెట్టాడు.
“వైల్డ్ డాగ్ కు ఇద్దరు యాక్షన్ డైరక్టర్లు వర్క్ చేశారు. విదేశాల నుంచి డేవిడ్ ను తీసుకొచ్చాం. కొన్నాళ్లు వర్క్ చేశాడు. కానీ కరోనా వల్ల తిరిగి జాయిన్ అవ్వలేకపోయాడు. అప్పుడు బాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ శ్యామ్ కౌశిక్ ను తీసుకున్నాం. ఇద్దరూ చాలా బాగా చేశారు. ఎన్ఐఏ ఏజెంట్ ట్రైయినింగ్ అంతా డేవిడ్ ఇచ్చాడు. షూటింగ్ టైమ్ లో ప్రతి రోజు 3 గంటల పాటు గన్స్ తో ప్రాక్టీస్ చేశాం.”
ఏప్రిల్ 2న థియేటర్లలోకి రానుంది వైల్డ్ డాగ్ మూవీ. నాగ్ సరసన దియా మీర్జా హీరోయిన్ గా నటించింది. అహితోష్ సోలమన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.