పండక్కి గట్టిగా నవ్వించేలా వున్నారుగా?

వెంకీ-వరుణ్ తేజ మల్టీ స్టారర్, అనిల్ రావిపూడి డైరక్షన్ లో ముస్తాబయిన ఎఫ్ 2 సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే.…

వెంకీ-వరుణ్ తేజ మల్టీ స్టారర్, అనిల్ రావిపూడి డైరక్షన్ లో ముస్తాబయిన ఎఫ్ 2 సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. వెంకీ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ ఫస్ట్ టైమ్ ఫన్ పండించడం, ట్రయిలర్ లో కనిపించిన ప్రతి క్యారెక్టర్ పక్కా కామెడీ మీదే రన్ కావడంతో, టోటల్ గా ట్రయిలర్ పూర్తి ఎంటర్ టైన్మెంట్ భరోసాగా కనిపించింది.

పెళ్లాలతో విసిగిన మొగుళ్లు, వాళ్లను హింసించే పెళ్లాలు, కచ్చితంగా ఫ్యామిలీలకు  హండ్రెడ్ పర్సంట్ ఫన్ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే ఒకటే కండిషన్. ఈ కామెడీ సీన్లంటినీ చుడుతూ కాస్త థిన్ లేయర్ అయినా సరైన కథ, దానికి తగినట్ల బోర్ కొట్టినట్లు అనిపించని కథనం వుండాలి. 

అనిల్ రావిపూడి సినిమాలు అన్నీ కథ సెంట్రిక్ గా కన్నా కామెడీ, కామెడీ సీన్లు కీలకంగా నడుస్తాయి. అలాగే అవన్నీ విజయం సాధించాయి. ఇప్పడు ఈ ఎఫ్ 2 ట్రయిలర్ చూస్తుంటే ఈ సినిమా కూడా అదే దారిలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. జస్ట్ భార్యా బాధితులు అన్న పాయింట్ చుట్టూ కామెడీ సీన్లు అల్లి పండగకు నవ్వించే పని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.