టాలీవుడ్ లో తలెత్తిన థియేటర్ల రగడపై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు వివరణ ఇచ్చారు. చాలా క్లారిటీగా మొత్తం వ్యవహారాన్ని వివరించారు. ఆరు నెలల క్రితమే మూడు పెద్ద తెలుగు సినిమాలు షెడ్యూలు అయ్యాయని ఆయన గుర్తు చేసారు. ఈ మూడు సినిమాలు, ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ, ఎఫ్2 వీటికే థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలా? అని తామంతా కిందా మీదా అవుతున్నామని వెల్లడించారు.
ఇలాంటి నేపథ్యంలో జస్ట్ రెండు వారాల క్రితమో, మూడువారాల క్రితమో, చెన్నయ్ వెళ్లి సినిమా కొనుక్కు వచ్చి, థియేటర్లు ఇమ్మంటే ఎలా ఇస్తామని దిల్ రాజు సూటిగా ప్రశ్నించారు. మన సినిమాలు, మన పెద్ద సినిమాలు కాదని, పక్క రాష్ట్రం సినిమాకు థియేటర్లు ఇవ్వడం సరైన నిర్ణయమా అన్న రీతిలో ఆయన ప్రశ్నించారు.
ఇదే నిర్మాత కొద్ది నెలల క్రితం రెండు డబ్బింగ్ సినిమాలు కొన్నారు. విడుదల చేసారు. అప్పుడు ఎక్కడన్నా థియేటర్ల సమస్య వచ్చిందా? అని దిల్ రాజు గుర్తు చేసారు. మొత్తం మీద సూటిగా, క్లుప్తంగా దిల్ రాజు వివరణ ఇవ్వడం బాగుంది.