బ్రేకప్ అబద్ధం.. హీరోహీరోయిన్ల పబ్లిక్ రొమాన్స్!

రణ్ వీర్ సింగ్ , దీపికా పదుకునే.. వీళ్లిద్దరూ విడిపోయారని చాలా వార్తలే వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలే అని వీళ్లు అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. బహిరంగ ప్రదేశంలో చాలా సన్నిహితంగా మెలుగుతూ, ఇంకొంచెం…

రణ్ వీర్ సింగ్ , దీపికా పదుకునే.. వీళ్లిద్దరూ విడిపోయారని చాలా వార్తలే వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలే అని వీళ్లు అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. బహిరంగ ప్రదేశంలో చాలా సన్నిహితంగా మెలుగుతూ, ఇంకొంచెం ముందుకు వెళ్లి ముద్దు పెట్టుకుని మరీ తామిద్దరం ఇంకా ప్రేమలో ఉన్నామని వీరు స్పష్టత ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా ఒక కార్ల షోరూంలో జరగడం గమనార్హం. 

ముంబైలో దీపిక ఇంటికీ సమీపంలోనే ఉన్న ఒక కార్ షోరూంకు ఈ జంట వెళ్లినట్టుగా తెలుస్తోంది. జంటగా ఏ కారును ఎంపిక చేసుకోవాలో చాలాసేపు పరిశీలించిన వీళ్లు.. ఉన్నట్టుండి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయారట. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని.. రణ్ బీర్ క్లోజ్ గా వెళ్లాడట. అక్కడ సీసీ కెమెరాలేవీ లేవనే అంశంపై క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్లిద్దరూ రెచ్చిపోయారని సమాచారం.

వచ్చింది కారు కొనడానికి అయినా.. ప్రైవసీ దొరకడంతో ఆ అవకాశాన్ని మిస్ కాకుండా రణ్ వీర్ దీపికను చుంభించినట్టుగా తెలుస్తోంది. వీళ్లు ఎంత రొమాంటిక్ గా గడపడం ఆ షోరూం నుంచి ఆ నోటా ఈనోటా పడి మీడియా వరకూ వచ్చింది. దీంతో దీపిక.. రణ్ వీర్ లు ప్రేమలోనే ఉన్నారని స్పష్టం అవుతోందని బాలీవుడ్ పత్రికలు టీవీలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

వీళ్లిద్దరి ముద్దు ముచ్చట్లు ఇకపై కూడా కొనసాగనున్నాయి. ఎలాగంటే.. ‘పద్మావతి’ సినిమాలో నటించడానికి వీళ్లిద్దరూ ఓకే చెప్పారు. భన్సాలీ దర్వకత్వంలో రూపొందే ఆ సినిమా వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూడో పిక్చర్ కానుంది.