హీరోయిన్స్‌కి తమకు ఆడపిల్లలు జన్మిస్తే, వాళ్ళు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. మహిళలైనాసరే సమాజంలో ఏదైనా సాధించగలరన్న విశ్వాసం వారికి వుంటుంది గనుక, ఆడపిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటారు. ఆడ, మగ అన్న వివక్షను హీరోయిన్లు ఎవరూ చూపరు. నిన్నటి గ్లామరస్ తార రంభ, ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా తనకు ఒకటేనంటోంది.
రంభకి ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు. మొదటి అమ్మాయికి మూడేళ్ళు. అమ్మాయి పుట్టిందని సగర్వంగా చెప్పుకుంటున్న రంభకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమట. ఎప్పుడో ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టి, ‘బావగారూ బాగున్నారా’ చిత్రంలో మెగాస్టార్‌తో నటించే స్థాయికి ఎదిగింది. ‘బొంబాయి ప్రియుడు’ సినిమాలో విశ్వరూపం చూపించిన రంభ, మంచి టైమ్‌లోనే పెళ్ళి చేసుకుని ఓ ఇంటిదైపోయింది.
రెండో ఎంట్రీ వుంటుందని చెబుతున్న రంభ, ఇంకొంత కాలం పిల్లా పాపలతో గడిపిన తర్వాతే సినిమాల్లో రీ`ఎంట్రీ ఇస్తుందట. రంభ చిన్న పిల్లలా స్వచ్ఛంగా నవ్వుతుంది. అలాంటి రంభ నటిస్తూ, ప్రేక్షకుల్ని మరింత కాలం అలరించాలని కోరుకుందాం.