రాజకీయ నాయకుల ప్రవర్తన ఎంత నీచంగా ఉంటుందో మీరు చట్ట సభల్లో చూసి మీకు చాలా సార్లు జీవితం మీద విరక్తి కలిగి ఉంటుంది.
అలాగే సినిమా వాళ్ళ చిల్లర్ వ్యవహారాలూ, వాళ్ళ భాష వాళ్ళు చెప్పే నీతులు సమాజం మీద రుద్దే బూతులు ఇవీ మీరు వాంతు లొస్తున్నాఆపుకుని చూసే ఉంటారు.
ఈ రెండు ఫీల్డ్స్ లో కూడా దొంగలు హంతకులు గూండాలు హౌస్ ఫుల్ గా ఉంటారు.వప్పుకుంటారు కదా. ఇప్పుడు విషయంలో కొద్దాం. ఫైన చెప్పిన టైప్ రెండూ ఒకటిగా అయితే ? సినిమాలకు రాజకీయాలకు క్రాస్ కొంతమందిచట్ట సభల్లోకి వస్తే ఎంత మజాగా ఉంటుంది? అలాంటి ఒక సభ ఏదో ఒక దేశం లో జరిగితే ఆ సభ ఎలా ఉంటుంది?చూడాలని ఉందా ?
ఓ చూపు చూస్తారా? Welcome
ఐటమ్ సాంగులు, సింగిల్ మీనింగ్ డైలాగులు అంటే కేవలం బూతు మాత్రమే మాట్లాడే సినిమాలనుంచి రాజకీయాల్లో కొచ్చిన ఒక క్రాస్ నాయకురాలు చట్టసభ లో
అద్దెక్సా ఇప్పుడు నేను మంత్రిని సప్లిమెంట్ కొచ్చనేస్తా అద్దేక్సా
ఆడరాడర్ స్టార్ కొచ్చనేయందే సప్లిమెంట్ కొచ్చినేన్దమ్మా కూర్చో
అయితే స్టార్ కొచ్చనేస్తా అద్దెక్సా
స్టార్ కొచ్చెను ఇప్పుడెలా వేస్తావమ్మా
అంటే నీ ఉద్దేశం ఎందద్యక్సా అద్దెక్సా నేనుసినిమా స్టార్నే! పాతిక ఐటం సాంగులు చేశా ఇక్కడున్నోళ్ళందరూ కార్చుకుంటూ నా సినిమాలు చుసినోళ్లె అద్దెక్సా
స్పీకర్ తల కొట్టుకున్నాడు చూడమ్మా నేను మాట్లాడే స్టార్ వేరు సినిమా స్టార్ వేరు దయచేసి కూర్చో
దాంతో మిగతా సభ్యు లంతా కూర్చో కూర్చో అంటూ అరచారు.
నాయకు రాలికి కాలిపోయింది
ఏంట్రా కూర్చునేది? నీ రింగులో నా ఫింగరు అద్దెక్సా నేనెప్పుడు కొచ్చినేసినా ఇది సప్లిమెంట్ కొచ్చన్ స్టార్ కొచ్చెను బొంగులో కొచ్చెను అంటూ చిల్లర్గాళ్ళంతా నీతులు చెప్తున్నారు అదే ఆళ్ళ పార్టీ వొళ్ళు కొచ్చనేస్తే తప్పట్లు కొడుతున్నారు బాడుకవులు
బాడుకవులు అనడం తోనే అందరూ లేసి గావుకేకలేసారు ఇది అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అద్దెక్సా ఆమె బూతులు మాట్లాడుతోంది అద్దెక్సా
అది బూతని ఏ బాడుకవ్ అంటాడు?అరచిన్దామే పైట లాగేసి నడుముకి చుట్టేస్తూ
అదిగో అద్దెక్సా మళ్ళీ అదే బూతు
ఇది బూతు కాదురా బాడుకవ్ బాడుకవ్ అంతే నా ఉద్దేశం ఏంటంటే badcow అని ఇక్కడ ఎవడయినా ఇంగ్లీష్ వచ్చిన బాడుకవ్ ఉంటే ఆడికి అర్ధ మౌతుంది
సభ్యులంతా అరుపులు కేకలతో లేచి నిలబడ్డారు మరి ఇందాక నీ రింగులో నా ఫింగర్ అన్నావుగా
అది బూతా? నీ ఎంకమ్మ దాన్ని బూతని ఏ బొక్కలో డాఫర్ గాడంటాడు నీ యక్క
అందరూ మళ్ళీ అరపులు కేకలు
దాని బూతు మాటలన్నీ రికార్డ్ నుంచి తొలగించాలి అద్దెక్సా స్పీకర్ కి తిక్క రేగింది
నీయమ్మ బూతులన్నీ రికార్డ్స్ నుంచి తొలగిస్తే ఇంక రికార్డ్స్ లో మిగిలిందేమున్దిరా రికార్డ్ ఖాళీ ఇక్కడ పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే మొత్తం బూతు లేరా కోపంగా అరచాడు స్పీకర్
అద్దెక్సా నా కొచ్చినేందంటే మళ్ళీ మాట్లాడ బోయింది
వీల్లేదు కొచ్చన్ అలవ్ చేయను
ఎలవ్ చేయకపోతే నీ వెల్ లో కొచ్చానంటే నీ బాక్స్ బద్దలైపోద్ది తొడ కొట్టిందా ఆడపడచు వెల్ లోపలి కెళ్ళి .
సభ్యులంతా అరుపులు కేకలు ఈలలు స్పీకర్ వెల్ అడుగున దాక్కున్నాడు.
దాంతో అపోజిషన్ లోనుంచి ఇంకో మగ క్రాస్ ఆమె మీద మీద కొచ్చాడు.
ఏయ్ ఇంకొక్క మాట మాట్లాడావంటే సుర్రు సుమ్మై పోద్ది నువ్వే టైమంతా దొబ్బుతుంటే ఇంకా నా కొచ్చన్ సంగతేంటి ముందు స్పీకర్ చెప్పినట్లు కూర్చో లేకపోతే పైన పచ్చ డవుద్ది
ఏయ్ పైన పచ్చడి చేసే ఓడు ఇంకా పుట్ట లేదురా దమ్ముంటే రా లంబంగా ఉన్న స్తంబాన్ని భంభం చేస్తా వాటేసు కున్నానంటే సైజులు చెప్తా పైన పచ్చడి చేస్తే కింద ఇత్తడయిపోద్ది నాతొ పెట్టుకోకు చికెన్ షాపెక్కి తొడలు కొట్టిన కోడి ఎవర్దనుకుంటున్నావురా అది నా సొంత కోడి
దాంతో ఇంకో క్రాస్ వెల్ లోకి దూకాడు .
ఏయ్ అందరూ ఎవడి సీట్లో వాడు కూర్చోండి లేకపోతే చేతికందింది ఇరుస్తా కాలికందింది పొడుస్తా నోటికందింది కరుస్తా ఏదీ అందక పొతే అరుస్తా
ఏయ్ ఏంట్రా మీద మీద కోస్తున్నావ్ రేపే చేస్తావేంట్రా అంత దమ్ముందా నీకు పెద్ద పెద్ద మొనగాళ్ళకు గంట పగిలి పోయిందిరా రారా నేను రెడీరా దమ్ముంటే రారా
ఏయ్ మాది రేప్ లు చేసే వంశం కాదే తొడలు కొట్టే వంశం తేడాలోస్తే తలలు లేపే వంశం పగ పట్టిన వాడిని పాతరేసే వంశం
అంటే నీకు దమ్ము లేదని రుజువయింది కదరా అందుకే నాతొ పెట్టుకోవద్దు ఎవడూ నేను పల్నాడు లో తొడ కొడితే పాకిస్తాన్ లో దడ రా
స్పీకర్ లేచి పిచ్చాడి లా అరచాడు ఒరేయ్ ఇలాంటి క్రాస్ గాళ్ళతో ఈ సభ నడపడం నావల్ల కాదురా house is adjourned till next elections
యర్రం శెట్టి సాయి
(ఇందులో నేను కొత్తగా కనిపెట్టిన బూతు లేమీ లేవు. అన్నీ మీరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సినిమాలో చూసే ఉంటారు )