ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంటూ పర్సనల్ ప్రశ్నలే ఎక్కువగా అజెండాగా ఇన్నాళ్లు నడచిన ఎబిఎన్ రాధాకృష్ణ షో కి కొన్నాళ్లు విరామం ప్రకటిస్తున్నారట. ప్రస్తుతం 250 షో ఈ ఆదివారం ప్రసారం కాబోతోంది. హీరో రామ్ చరణ్ ను గెస్ట్ గా తీసుకువచ్చారు. ఈ షోని మెగాస్టార్ చిరంజీవితో ప్రారంభించి, రామ్ చరణ్ తో ముగిస్తున్నారు. మరో నాలుగైదేళ్లు విరామం అని ఆఖరి షో ట్రయిలర్ లోనే రాధాకృష్ణ చెప్పేసారు.
250 వారాలు అంటే దాదాపు అయిదేళ్లు సాగినట్లు. మరి ఇంక సెలబ్రిటీలు ఎంతకని దొరుకుతారు. బహుశా అందుకే కాస్త విరామం ప్రకటిస్తున్నట్లుంది. ఈ ఆఖరి షోలో రామ్ చరణ్ మరోసారి తన లవ్ స్టోరీ, డాడీ ఫాలిటిక్స్, బాబాయ్ తో రిలేషన్లపై మాట్లాడినట్లు ట్రయిలర్ చూస్తే అర్థమయింది.