తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(TTA) అంతర్గత వివాదాల పరిష్కారం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మరియు డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, తమ అంతర్గత వివాదాలని, ఈ రోజు వారు బేషరతుగా ఒకరికొకరు తమ వ్యాజ్యాలను పరిష్కరించుకున్నారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబడలేదు.…

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మరియు డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, తమ అంతర్గత వివాదాలని, ఈ రోజు వారు బేషరతుగా ఒకరికొకరు తమ వ్యాజ్యాలను పరిష్కరించుకున్నారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబడలేదు. కేవలం గతంలో సమాచార లోపం వల్ల ఇరువురికి మనస్పర్థలు వచ్చాయి తప్పితే తెలంగాణ సమాజ ప్రగతి కోసం నిజాయితీగా కష్టపడి పనిచేసారు.  

డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల TTAలో కీలక పాత్ర పోషించిన విశిష్ట వ్యక్తి. TTA గత అధ్యక్షుడిగా మరియు అమెరికా తెలుగు వారిగా సేవలందించారు. అచంచలమైన అంకితభావం మరియు నాయకత్వాన్ని ప్రదర్శించారు.  TTA వ్యవస్థాపక సభ్యునిగా,హరనాథ్ యొక్క దూరదృష్టితో కూడిన రచనలు, ఆలోచనలు సంస్థను రూపొందించడంలో గత తొమ్మిదేళ్లలో కీలకంగా ఉన్నాయి. కన్వెన్షన్ (ATC)-2018 జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా, అతను విజయవంతంగా పనిచేసారు. ATC మెగా కన్వెన్షన్ నిర్వహణ, TTA చరిత్రలో చెరగని ముద్ర వేసింది. తను కో-చైర్‌గా, అతని పాత్రలోన్యూజెర్సీలో TTA మెగా కన్వెన్షన్-2022 వ్యూహాత్మక నిర్ణయాలు మరియు నిబద్ధత స్పష్టంగా కనిపించాయి. సలహా మండలి యొక్క చైర్ పర్సన్ గా, అద్భుతమైన విజయానికి గణనీయంగా తోర్పడ్డారు.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి గారు మాట్లాడుతూ “సామరస్యపూర్వకమైన పరిష్కారం కనుగొనబడి, ఇరుపక్షాలు ముందుకు సాగడానికి తీసుకున్న నిర్ణయానికి మేము సంతోషిస్తున్నాము. TTA అందుకు తోడ్పాటు అందిస్తుంది. ఇప్పుడు సియాటెల్‌లో జరిగే మా మెగా-కన్వెన్షన్ మరియు తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మా లక్ష్యంపై దృష్టి సారించాం” అని అన్నారు.TTA భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించి  మా పై నమ్మకం ఉంచినందుకు మేము సంతోషిస్తున్నాము. డాక్టర్ పొలిచెర్ల గారు అతని అన్ని భవిష్యత్ కార్యక్రమాల్లో వారి ప్రయత్నాలలో విజయం పొందాలని మరియు TTAకి అతను చేసిన సేవకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అని చెప్పారు.  

“TTA కి ఈ సేవలను విశిష్టతతో అందించగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము.ఇప్పుడు మరింత ముందుకు సాగడానికి సమయం వచ్చింది మరియు నేను ఇతర మార్గాలలో స్వచ్ఛంద కార్యక్రమాలను కొనసాగించాలని ఎదురుచూస్తున్నాను” అని డా.పొలిచెర్ల కూడా ఇదే విషయాన్ని తెలియజేసారు.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది న్యూజెర్సీలో ఉన్న 501(c)3 లాభాపేక్ష లేని సంస్థ. అమెరికాలో ఉన్న తెలుగు వారిని ఏకం చేయడంపై దృష్టి సారించింది. అమెరికాలోని TTA లో సుమారు 6000 మంది సభ్యులు ఉన్నారు.  ధార్మిక సేవలు అందించడంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశ ప్రజలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు మరియు అందరికి అండగా ఉంటూ మన సంస్కృతిని కాపాడుతున్నారు. పుట్టిన గడ్డ అయిన తెలంగాణాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.