చివరి టెస్టు డ్రా.. 2-1 తేడాతో సిరీస్‌ గెలిచిన టీమిండియా!

అహ్మదాబాద్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జ‌రిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. చివరి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో… బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో నిలబెట్టుకుంది.  Advertisement తొలుత బ్యాటింగ్ చేసిన…

అహ్మదాబాద్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జ‌రిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. చివరి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో… బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో నిలబెట్టుకుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 480 ర‌న్స్ కు ఆలౌట్ కాగా.. భార‌త్ 571 ర‌న్స్ చేసి స్వ‌ల్ప ఆధిక్యం పొందింది. భారీ స్కోర్లు నమోదైన టెస్టులో భారత్ ఆస్ట్రేలియా జట్లు గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. డ్రా అయ్యే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో  2 వికెట్లకు 175 పరుగులు చేసింది. దీంతో పాటు…వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి భారత్ దూసుకెళ్లింది. 

టెస్టు సిరీస్ ముగిసిన నేపథ్యంలో, ఇక అందరి దృష్టి భారత్-ఆసీస్ వన్డే సిరీస్ పై పడింది. ఇరుజట్ల మధ్య మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే ముంబయిలో జరగనుండగా, మార్చి 19న రెండో వన్డేకి విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. మార్చి 22న చివరి వన్డే చెన్నైలో జరగనుంది.