దీన్ని చదివేందుకు ముందు ఎమ్బీయస్: మావిగన్‌ను గున్నమావి అంటే ఓకేనా? అనే వ్యాసం చదవాలని కోరుతున్నాను. దానిలో అమరావతి మహానగరం రూపుదిద్దుకోవడంలో వున్న కష్టాలను విపులంగా రాసాను. ఇప్పుడు మావిగన్ గురించి మాట్లాడుతున్న జగన్ తను అధికారంలో వుండగా దీన్నెందుకు అమలు చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానం యివ్వలేడు. కానీ ‘ఐడియా దేర్ ఆయా పర్ దురుస్త్ ఆయా’ అనే భావం అందరిలో రగలడం టిడిపిని మండిస్తోంది. ఆ ఆలోచనలో లోపాలేమిటో చెప్పకుండా జగన్‌ను, అతనికి ఎదురు చెప్పని పార్టీ క్యాడర్‌ను తిట్టడానికి లంకించు కున్నారు. మరో పక్క వైసిపి యిదే తారకమంత్రం అన్నట్లు ఆర్భాటం చేస్తోంది.
ప్లాన్ ఏను జగన్ అటకెక్కించారా? –
గమనించాల్సిందేమిటంటే – జగన్ మావిగన్‌ను ప్లాన్ బిగా పేర్కొన్నారు. ‘ప్లాన్ ఎ అంటే మూడు రాజధానులు, వైజాగ్‌లో ఎడ్మినిస్ట్రేటివ్ రాజధాని. దాన్ని మీరు అటకెక్కించారు కాబట్టి కనీసం ప్లాన్ బి అమలు చేయండి అని టిడిపికి సలహా యిస్తున్నాడు తప్ప ప్లాన్ ఏ ను నేనూ అటకెక్కించాను, యిక దాని జోలికి పోను అని ఆయన స్పష్టంగా ఎందుకు అనడు? ఇప్పటికైనా అనాలి. మూడిటిలో న్యాయ రాజధాని (హైకోర్టు వున్న వూరిని న్యాయరాజధాని అనరని అనేకసార్లు రాశాను. ఎవరూ అననిది యీయన మాత్రమే మొదలెట్టాడు) కర్నూలుకి రాదని తేలిపోయింది. సుప్రీం కోర్టు అమరావతి నుంచి హైకోర్టుని తరలించడానికి వీల్లేదని చెప్పేశాక అది ముగిసిన అధ్యాయం.
ఇక మిగిలినవి సెక్రటేరియట్, మంత్రుల నివాసాలు వగైరా వుండే ఎడ్మినిస్ట్రేటివ్ కాపిటల్, అసెంబ్లీ సమావేశాలు జరిగే ఎగ్జిక్యూటివ్ కాపిటల్. బాబు హయాం నాటి సెక్రటేరియట్ (అది తాత్కాలికమా? శాశ్వతమా? అని ఆయన్ను నిద్ర లేపి అడిగితే ఛట్టున చెప్పలేడు. నేను పొజిషన్లో వున్నానా? అప్పోజిషన్లో వున్నానా? ముందది చెప్పు అంటాడు) వగైరాలు ఉన్నాయి కాబట్టి అమరావతిని ఎడ్మినిస్ట్రేటివ్ కాపిటల్‌గా కొనసాగించి తీరాలి. తన హయాంలో జగన్ దాన్ని వైజాగ్‌కు తరలిస్తానని, సెక్రటేరియట్ స్టాఫ్‌కి అక్కడా యిళ్ల స్థలాలు కేటాయిస్తానని చాలా అన్నాడు. అదేమీ జరగలేదు కాబట్టి ఆ ఐడియా డ్రాప్ చేయాలి. ఇక లెజిస్లేటివ్ కాపిటల్. అసెంబ్లీ సమావేశాల కోసం వైజాగ్‌లో యింకో అసెంబ్లీ భవనం కట్టేదెందుకు? అసెంబ్లీకి ప్రతిపక్షాలు రానే రానప్పుడు వాటి శాంక్టిటీ ఏముంటోంది? ఇప్పుడు వైసిపి రావటం లేదు, అట్టు తిరగబడితే రేపు టిడిపి కూడా అదే చేయవచ్చు.
ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఓ సెషన్ అమరావతిలో, మరో సెషన్ వైజాగ్‌లో పెడతామంటారా, అదీ దండగే. మహారాష్ట్రలో ముంబయి, నాగపూరులలో జరుగుతాయి కదా అంటే దాని జనాభా 13 కోట్లు. 5 కోట్ల ఆంధ్రకు రెండెందుకు? వైజాగ్ ఫైనాన్షియల్ సిటీగా ఎదిగితే అదే పదివేలు. బాబు మహానగరాన్ని 2029లో కట్టి చూపిస్తానని అంటున్నా మహా అయితే ప్రభుత్వ భవనాలు మాత్రం పూర్తవుతాయని అంచనా. మేం అధికారంలోకి వస్తే వీటన్నిటినీ వదిలి, మళ్లీ వైజాగ్‌లో కడతానని జగన్ అంటే అంతకంటె మతిమాలిన పని వుండదు. వృథా ఖర్చు గురించి యిన్ని సుద్దులు చెప్పి, డూప్లికేషన్ ఎందుకు? ఏతావతా మూడు రాజధానుల ముచ్చట ముగిసినట్లే అని నిర్ద్వంద్వంగా జగన్ డిక్లేర్ చేసి అప్పుడు యీ ఎక్స్టెండెడ్ అమరావతి గురించి మాట్లాడితే దానికి విలువ వస్తుంది.
లేనిపోని భేషజాలు అవసరమా? –
‘మూడు ముక్కలాట అన్నాడు, చేయలేక చతికిలపడ్డాడు అని యిప్పటికే టిడిపి వారు ఎద్దేవా చేస్తున్నారు. ప్లాన్ ఏ లేదని డిక్లేర్ చేస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అనే మీ యిమేజికి భంగం కలుగుతుంది. వద్దు’ అని జగన్ అనుచరులు అనవచ్చు. ‘చేయలేక.. అంటే కోర్టులు చేయనీయలేదు. అమరావతి ప్రజలు వ్యతిరేకించారు, వైజాగ్, కర్నూలు ప్రజలు ఆహ్వానించలేదు. అందుకని కుదరలేదు.’ అని జగన్ ధైర్యంగా ఒప్పుకుంటే అక్కడితో ఆ చర్చ ముగుస్తుంది. ఇక మాట తప్పని, మడమ తిప్పని.. అంతా బోగస్. ఉద్యోగులకు పాత పెన్షన్, సంపూర్ణ మద్యనిషేధం.. యిలాటి వాటిల్లో మాట, మడమ ఏమయ్యాయి? ప్రజలకు నచ్చచెప్పుకోవడమే – ‘అనుకున్నాను కానీ కరోనా వచ్చింది, ఉక్రెయిన్ వార్ వచ్చింది’ అంటూ! నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. పంతానికి, పౌరుషానికి పోతే రాజకీయాల్లో నెగ్గుకుని రాలేరు.
మిస్ చేసుకున్న ఛాన్స్ –
వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి, జనాభా బాగా వున్నారు కాబట్టి, మౌలిక సౌకర్యాల కల్పన కష్టం కాదు కాబట్టి అక్కడ ఎడ్మినిస్ట్రేటివ్ రాజధాని పెడతానన్నాను అని జగన్ యిప్పటికీ సంజాయిషీ చెప్తూన్నాడు. ఆ పేరుతో అక్కడ మళ్లీ సెక్రటేరియట్ కట్టే బదులు, దాన్ని వెలగపూడిలోనే వుంచి, విజయవాడ – గుంటూర్లను, హైదరాబాదు-సికింద్రాబాద్ తరహాలో జంట నగరాలుగా ప్రమోట్ చేసి, రాజధానికి సంబంధించిన యితర ఆఫీసుల నిర్మాణాలను మంగళగిరి, నాగార్జున యూనివర్శిటీ స్థలాల్లో, ఆ యా ప్రాంతాల్లో కట్టి వుంటే అభివృద్ధి కంటికి కనబడేది. ఇప్పటికే వున్న బిల్డింగుకి పై అంతస్తు వేసినంత సులభం యీ పని! ఈ యాక్టివిటీ వలన ఆటోమెటిక్‌గా ఫైనాన్షియల్ యాక్టివిటీ, జనసంచారం పెరిగేది. ఈ పనిని అధికారంలో వుండగా చేయకపోవడం జగన్ పొరపాటు.
అమరావతికి సుదూరంగా వైజాగ్‌లోనే అన్నీ పెడతాననడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లు మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ల కంటె వాళ్లకు సత్తా ఎక్కువ. మీడియా (యజమానులే కాదు, పాత్రికేయులు కూడా), సాహిత్యం, కళలు, సినిమారంగం, వ్యాపారం, రాజకీయం అన్నిటిలో వాళ్లదే ముందంజ! విదేశాల్లో కూడా బావుటా ఎగరేశారు. నేను ఒక పర్టిక్యులర్ కులం గురించి మాట్లాడటం లేదు. ఏ కులానికి చెందిన వారైనా సరే, అక్కడి వారికి ఫోర్స్, ‘పలుకు’బడి ఎక్కువ. మేధావి వర్గాల్లో, వోకల్ సెక్షన్స్‌లో వారిది సింహభాగం. పైగా ఎగ్రెసివ్ కూడా. ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవడానికి కారణం వారే! రాయలసీమ వారికి అంత ఉబలాటం లేదు. ఆంధ్ర ఏర్పడితే వీళ్లు డామినేట్ చేస్తారని భయపడి శ్రీబాగ్ ఒప్పందం తర్వాతే సరేనన్నారు.
కృష్ణా-గుంటూరు తడాఖా –
చివరకు రాష్ట్రం ఏర్పడ్డాక ఈ జిల్లాల వాళ్లు విజయవాడ రాజధాని కావాలని ఆందోళనలు చేశారు. ముఖ్యమంత్రి ప్రకాశం గారు కర్నూలును రాజధానిగా ప్రకటిస్తే, విజయవాడలో ఆయన విగ్రహాన్ని పగలకొడతామని హెచ్చరించారు. కర్నూలు రాజధాని కాబట్టి, హైకోర్టు గుంటూరుకి రావాలని డిమాండు చేశారు. 2014 విభజన తర్వాత మళ్లీ అదే సైజు రాష్ట్రం ఏర్పడేసరికి రాజధాని, హైకోర్టు రెండూ వాళ్లే తీసుకున్న గడుసరులు వారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమానికి కూడా వాళ్లే నాయకులు. అప్పుడు కూడా విజయవాడ రాజధానిగా ఆంధ్ర ప్రాంతం విడి పోవాలనే డిమాండుతో నెలల తరబడి ఆందోళన సాగింది. కెసియార్ తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో టోన్ మార్చి సమైక్యాంధ్ర అన్నారు. ఆ పేరుతో నడిపిన ఉద్యమం చిత్తశుద్ధితో చేయలేదు. హైదరాబాదు కేంద్రపాలితమౌతుంది కాబట్టి అక్కడ తమ హవా ఎలాగూ కొనసాగుతుందని, రాష్ట్రం విడిపోతే ఆంధ్ర ప్రాంతాలు కూడా వర్ధిల్లుతాయని మనసులో అనుకుంటూనే పైకి సమైక్యం అన్నారు.
చివరకు కేంద్రం జెల్లకాయ కొట్టి హైదరాబాదును తెలంగాణ కిచ్చింది. అది వేసిన శివరామకృష్ణన్ కమిటీ అమరావతి అనువైనది కాదని, దొనకొండ ప్రాంతంలో పెట్టవచ్చని, అన్నీ ఒకచోట వద్దని సూచించినా, దాన్ని కాలరాసి, తమ ప్రాంతంలోనే పెట్టించుకున్నారు. ఇంత పవర్ఫుల్ కృష్ణా-గుంటూరు లాబీతో జగన్ వేగలేక పోయాడు. అమరావతిలో అతను ఏం చేయబోయినా అడుగడుగునా అడ్డు తగిలారు. కోర్టుల్లో కేసు మీద కేసు వేసుకుంటూ పోయారు. కోర్టులూ వారికి వంత పాడాయి. తమ ధిక్కారాన్ని, ఏవగింపును బహిరంగంగా ప్రదర్శించారు. జగన్‌కు విసుగెత్తింది. అవమానాలతో అసహనం పెరిగింది. ఓర్చుకుని, శ్రమపడి తను అమరావతిని డెవలప్ చేసినా, తన రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక శక్తి బలపడి, వచ్చే ఎన్నికలలో తనను ఓడించడానికే అది ఉపయోగపడుతుందని అర్థం చేసుకున్నాడు.
అమరావతి వెర్సస్ వైజాగ్ –
దాంతో గుడారం యిక్కణ్నుంచి ఎత్తేసుకుని వైజాగ్ వెళ్లిపోయాడు జగన్. బాబు ముద్ర వున్న అమరావతిపై శక్తిసామర్థ్యాలు వెచ్చించే బదులు వైజాగ్‌పై ఫోకస్ పెట్టి దానిపై తన ముద్ర కొడదామని చూశాడు. ‘ప్రభుత్వం అంటే కంటిన్యుటీ, ఎవరు అధికారంలో వున్నా పనులు సజావుగా సాగిపోవాలి’ అనే సూక్తి ఎలా వున్నా, యీ స్టాంపింగ్ సమస్య వుంది. ‘బాబు ప్రారంభించిన సైబరాబాదును వైయస్ కొనసాగించారు, కానీ వైయస్ కొడుకైన జగన్ బాబు అమరావతిని పాడుపెట్టేశాడు’ అని టిడిపి మీడియా తెగ రాసింది. వైయస్‌ను ఎప్పుడూ తిడతారు కానీ జగన్‌ను పడతిట్టడానికి వైయస్‌కు కాస్త కాంప్లిమెంటు పడేశారు. మరి జగన్ స్టాంపు పడిన రిషికొండ భవనాన్ని బాబు పాడు పెట్టేస్తూంటే, యీ ఏకాక్షి మీడియా శుక్రాచార్యులకు కనబడదు!
జగన్ వైజాగ్ జపంతో కృష్ణా గుంటూరు జిల్లాలను దూరం చేసుకున్నాడు. తీరా చూస్తే వైజాగ్ వాళ్లూ హర్షించ లేదు, ఆదరించ లేదు. జగన్ యీ పొరపాటును గ్రహించాడేమో తెలియదు కానీ ఆ మధ్య రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య వుండాలి అని ఓ స్టేటుమెంటు యిచ్చాడు. కానీ దానికి పెద్ద ప్రచారం రాలేదు. గతంలో సినిమాలకు ‘‘శభాష్ రాముడు’’, ‘‘మంచి మనిషి’’ వంటి టైటిల్స్ వుండేవి. ఇటీవలి కాలంలో ‘‘రాక్షసుడు’’, ‘‘పోకిరి’’, ‘‘డబుల్ ఇస్మార్ట్’’ వంటి టైటిల్సే పవర్ఫుల్ టైటిల్స్‌గా పేరుబడ్డాయి. అందుకని యీసారి జగన్ పై రెండు నగరాలకూ మచిలీపట్నాన్ని జోడించి ‘‘మావిగన్’’ అనే క్రేజీ కాప్షన్‌తో రిలీజు చేశాడు. దాంతో ఎల్లెడలా చర్చ ప్రారంభమైంది.
కృష్ణా-గుంటూరు జిల్లాలలో స్పందన –
అమరావతి మహానగరం యీ టెర్మ్‌లో ఎలాగూ పూర్తి కాదు కాబట్టి, ఎంతసేపూ వచ్చిన నీళ్లను తోడడమే సరిపోతోంది కాబట్టి లోకేశ్ తన దృష్టిని వైజాగ్ వైపు మళ్లించాడని, దాన్నే ప్రమోట్ చేస్తున్నాడనీ ఒక అభిప్రాయం బలంగా నాటుకుంటోంది. ఈ సమయంలో జగన్ కృష్ణా – గుంటూరు జిల్లాల డెవలప్మెంట్ గురించి మాట్లాడడం ఆ ప్రాంతాల వాళ్లకి నచ్చి వుంటుంది. ఈ పథకానికి తను కట్టుబడి వున్నానని, అధికారం మళ్లీ దక్కితే మాట మార్చనని జగన్ నమ్మించ గలిగితే కృష్ణా-గుంటూరు లాబీ చల్లబడుతుంది. అది సుముఖంగా మారుతుందేమోననే భయం టిడిపికి కలుగుతున్నట్లుంది.
లేకపోతే వాళ్లు దీని గురించి యింత మాట్లాడవలసిన పని లేదు. 11 సీట్లతో చతికిలపడి, తాము సీసాలో బిగించి భూమిలో పాతేసిన భూతం ఏదో సలహా యిస్తే యింత రియాక్షనా? పనిలేక పిచ్చి ప్రలాపాలకు దిగాడు అంటూ కొట్టి పారేయవచ్చుగా! ‘అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు’ అంటూ బాబు మాటిమాటికి హుంకరించడం దేనికి? అమరావతి శాశ్వత రాజధాని అనే తీర్మానం ఒక ఫార్మాలిటీ. దానిపై అసెంబ్లీ తీర్మానం పేరుతో 34 మంది వరసపెట్టి ‘జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా…’ అంటూ మాట్లాడి ప్రజల మెదళ్లలో ఆ ఆలోచనను పదేపదే పొజిషన్ చేయడమెందుకు? జగన్ కదలిస్తాననటం లేదుగా, విస్తరిస్తే మంచిదంటున్నాడు. దానికి అయ్యే ఖర్చు తక్కువ. ఆ ఏరియా అంతా కాపిటల్ రీజియన్‌గా ప్రకటించి, తక్కువ ఖర్చులో కొన్ని ఆఫీసులు అక్కడ పెడితే చాలు. అంటున్నాడు. అది చేస్తారో, లేక రాబోయే ప్రాజెక్టులను కూడా హై లెవెల్ కోర్ కాపిటల్లోనే పెట్టి మరింత ఖర్చు పెడతారో టిడిపి క్లారిఫై చేయాలి. ఈ ఐడియా మాదే అనేసి వూరుకుంటే చాలదు.
నగరాల విస్తరణ –
నిజానికి హైదరాబాదు కార్పోరేషన్ ఎలా పెరిగింది? చుట్టూ వున్న శివారు గ్రామాలను కలిపేశారంతే. సౌకర్యాల మాట దేవుడెరుగు కానీ, యింటి పన్నులు పెరిగాయి. ప్రభుత్వం ప్రకటించి వూరుకుంటే, ప్రయివేటు రియల్టర్లే చుట్టూ ప్రాంతాలను ప్రమోట్ చేస్తూ, కాలనీలు కట్టుకుంటూ పోయారు. ప్రజలు అటు షిఫ్ట్ అయ్యారు. తర్వాత మంచి రోడ్లు, బస్సులూ వచ్చాయి. అమరావతి విషయంలో చుట్టూ వున్న ఊళ్లన్నీ ఆల్రెడీ డెవలప్ అయి వున్నాయి. వాటి స్టేటస్ పెంచితే చాలు. కోర్ కాపిటల్కు యిక్కణ్నుంచి యాక్సెస్ పెంచితే సరిపోతుంది. గుజరాత్ చూడండి, అహ్మదాబాదుకి ఎక్స్‌టెన్షన్‌గా గాంధీ నగర్‌ను కట్టి రాజధానిగా చేశారు. దాని కంటూ వేరే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కట్టలేదు. అహ్మదాబాద్దే సరిపోతోంది.
రైల్వే స్టేషన్ మాత్రం అధునాతనంగా 4 ప్లాట్‌ఫాంలతో, పైన 5 స్టార్ హోటల్‌తో, 20 ఎకరాల్లో కట్టారు. గుజరాత్ జనాభా 7 కోట్లు. ఆంధ్ర కంటె 2 కోట్లు ఎక్కువ. పారిశ్రామికంగా చాలా ముందున్న రాష్ట్రం. బాబును చూడబోతే అమరావతి రైల్వే స్టేషన్ 1500 ఎకరాల్లో కడతానంటున్నారు! అసలు గన్నవరంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వుండగా 40 కి.మీ.ల దూరంలో అమరావతిలో మరో యింటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి అనుమతి ఎవరిస్తారు? రెండిటి మధ్య కనీసం 150 కి.మీ.ల దూరం వుండాలి. మొదటిది విపరీతమైన రద్దీగా అయిపోతే అప్పుడు మినహాయింపు యివ్వవచ్చు. అమరావతి యింటర్నేషనల్ ఎయిర్‌పోర్టు గురించి రామ్మోహన్ నాయుడు మినహాయింపు తెచ్చుకుంటాం అన్నాడు కానీ యిటీవల ఎయిర్‌పోర్టు అథారిటీ కొన్ని రిలాక్సేషన్స్ ప్రకటించినప్పుడు యిది లేదు. అనుమతి వస్తుందో రాదో తెలియని ఎయిర్‌పోర్టు కోసం 4-5 వేల ఎకరాల సమీకరిస్తానంటే ఎలా అర్థం చేసుకోవాలి?
విస్తరణ వలన సామాజిక ప్రయోజనం –
అమరావతి/ఆంధ్రావతి/ మావిగన్/ గున్నమావి ఐడియాను అమలు చేస్తే సామాజికంగా మరో ఎడ్వాంటేజి కూడా వుంది. అమరావతి కోర్ కాపిటల్‌లో ఒక కులం వారిదే డామినేషన్ అనే ఫీలింగున్నట్లు రేణుకా చౌదరి పార్లమెంటులోనే మాట్లాడారు. నిజానిజాల కంటె పెర్సెప్షన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ విస్తృత కారిడార్‌లో కాపులు, రెడ్లతో సహా అనేక కులాల వారు వ్యాపించి, ప్రముఖంగా వున్నారు కాబట్టి, కమ్మరావతి ముద్ర తొలగిపోతుంది. మచిలీపట్నం వాసుల్లో హర్షాతిరేకాలు బలంగా వినిపించడంలో యీ కోణం కూడా వుందేమో! దాని మాట ఎలా వున్నా రీజియన్‌లో పోర్టు వుండడం ఏ నగరానికైనా గొప్పే. ముంబయి, కలకత్తా, మద్రాసు పోర్టుల వలననే పెరిగాయి. మద్రాసును పంచమని తెలుగువాళ్లు అడిగినప్పుడు నార్త్ మద్రాసు అడిగారు, పోర్టు మనకే వచ్చి వుండేది. తమిళులు సగం కాదు, అసలే యివ్వమన్నారు.
జగన్ చిత్తశుద్ధితో చెప్పినా, మడతపేచీ వేయడానికి చెప్పినా, కోర్ కాపిటల్‌లో కడదామనుకున్న నిర్మాణాలను యీ కారిడారంతా విస్తరింప చేయడం ప్రాక్టికల్ ఐడియానే. ఇక తక్కిన ప్రాజెక్టులంటారా, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ పంచాల్సిందే! అదే అసలైన వికేంద్రీకరణ. గ్రోత్ ఇంజన్ పేరుతో మహానగరం కట్టడం మంచిది కానే కాదు. పైగా చంద్రబాబు ఎంత ఊదరగొట్టినా, ఆయన మహానగరం యిప్పట్లో అవుతుందని ఎవరికీ నమ్మకం లేదు. అమరావతి శాశ్వత రాజధాని అని పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తే ఏదో సాధించేసినట్లు చంకలు గుద్దుకోవడంలో, వేడుకలు జరిపి, ఇంట్లో దీపాలు పెట్టి ఫోటోలు అప్లోడ్ చేయడంలో వివేకం లేదు.
అప్పటి ముచ్చట అప్పటిదే, యిప్పటి సంగతేమిటి? –
కేంద్ర బజెట్‌లో నిధులు కేటాయించి వుంటే అప్పుడు కేంద్రానికి హారతులు పట్టవచ్చు. ధృతరాష్ట్రుడు పాండవులకు ఇంద్రప్రస్థాన్ని కేటాయించాడు. అక్కడ చూస్తే దట్టంగా పరుచుకున్న ఖాండవ వనం. దాన్ని దహనం చేసి, అక్కడ నగరం కట్టుకోవాల్సి వచ్చింది. ఆంధ్రలోనూ ఖాండవ దహనం జరిగింది. అక్కడ ఔషధ వృక్షాలు, యిక్కడ పచ్చటి పొలాలు! ఇంద్రప్రస్థలో నిర్మాణాలకై పాండవులకు మయుడు దొరికాడు. భవంతి కట్టిపెట్టాడు. ఆంధ్రకు మాత్రం ‘స్పెషల్ స్టేటస్.., కాదు కాదు స్పెషల్ ప్యాకేజి.., లేదు లేదు అప్పులు తెచ్చుకోండి.., యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సరిగ్గా లేవు’ అంటూ తిప్పే మాయావులే తగిలారు. దీన్ని గమనించి, బాబు పిండి కొద్ది రొట్టి ప్లాన్ చేయాల్సింది.
సైబరాబాదు కట్టేటప్పుడు 23 జిల్లాల ఆదాయం వుంది. కల్పతరువైన హైదరాబాదుంది. ఊపితే డబ్బులు రాలాయి. ఇక్కడేముంది? రేగడి నేల. కాలేస్తే కూరుకుపోతోంది. రిజర్వాయర్లు కట్టడానికే ఎంత డబ్బూ చాలటం లేదు. సైబరాబాదులో లాండ్ పూలింగు అవసరం పడలేదు కదా! మరి యిక్కడ? రైతులకు చచ్చేటంత కమిట్ కావాల్సి వచ్చింది. ఔరంగజేబు నాటి మొఘల్స్ వేరు, జఫర్ నాటి మొఘల్స్ వేరు. ఆనాటి బాబు వేరు, యీనాటి బాబు వేరు. ఆ విషయం ఆయనకు అర్థం కావటం లేదు. రేవంత రెడ్డి, యీయనా పోటీ పడి భారీ సిటీల నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. వీళ్లిద్దరినీ చూస్తే ‘‘ద గ్రేట్ డిక్టేటర్’’లో హిట్లర్, ముస్సోలినీల సీను గుర్తుకు వస్తుంది నాకు. రేవంత్ హైదరాబాదునే మేనేజ్ చేయలేకపోతున్నాడు. ఫుట్ ఓవర్ బ్రిజ్ల లిఫ్టులు, ఎస్కలేటర్లు పని చేయటం లేదు. మెట్రో నిర్వహణ తీసుకున్నాక, అక్కడా యిదే జరిగినా ఆశ్చర్యం లేదు. అయినా ఫోర్త్ సిటీ అంటూ కాంట్రాక్టులు, టెండర్లు, మొబిలైజేషన్ ఎడ్వాన్సులు.. యిదే రంధి. ఖజానా ఖాళీగా వుంది.
అమరావతికి సంగతికి వస్తే జగన్ చెప్తున్నదిది – ‘ఎకరాకు రూ. 2 కోట్లు అవుతుందని బాబు కేంద్రానికి, బ్యాంకులకు డిపిఆర్ యిచ్చారు. 50 వేల ఎకరాలకు 1 లక్ష కోట్లు అవుతుంది. 2014-19లో ఖర్చు పెట్టినది 8 వేల కోట్లు. ఇప్పటికి చేసినది 47 వేల కోట్ల అప్పు. డ్రా చేసినది 13 వేల కోట్లు, మొబిలైజేషన్ ఎడ్వాన్సుగా యిచ్చినది 5500 కోట్లు. దీని సంగతి తేలకుండానే రెండో విడతలో 20 వేల ఎకరాలకు నోటిఫికేషన్ యిచ్చారు.’ ఈ అంకెలు తప్పయితే టిడిపియో, ప్రభుత్వమో ఖండించాలి. కారణాలేమైనా ఆంధ్రకు ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ. ఇరాన్ యుద్ధం తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి, అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై వ్యయం పెరుగుతుంది. సాధారణ పరిపాలనకే డబ్బులు చాలనప్పుడు మహానగర నిర్మాణ స్వప్నలోకాల నుంచి నేలకు దిగి వచ్చి, ప్రాక్టికల్ ఐడియాలు ఎవరు చెప్పినా ఎంతో కొంత మేరకు వింటే మంచిది. (ఫోటో – 20 ఎకరాల్లో గాంధీనగర్ రైల్వే స్టేషన్, కింద 1500 ఎకరాల్లో అమరావతి రైల్వే స్టేషన్ ఊహాచిత్రం, 4 వేల ఎకరాల్లో అమరావతి ఎయిర్‌పోర్టు ఊహాచిత్రం)
– ఎమ్బీయస్ ప్రసాద్

చర్చ ఎక్కడ జరుగుతోంది? సోషల్ మీడియా లో ఏకి పోస్తున్నారు. మీరు ఆర్టికల్ సర్వీస్ అందిస్తున్నారు.
అమరావతి ప్రయాణం చాలా సంవత్సరాల క్రితం మొదలు అయ్యింది. కొన్నాళ్ళు బ్రేక్ వచ్చింది. మళ్ళీ ప్రారంభం అయ్యింది. రాజధాని నిర్మాణం అంటే paid ఆర్టికల్ రాయడం కాదు అన్నది బుర్ర వున్నవాళ్లకి అర్ధం అయ్యింది. ఇప్పుడు కొత్త ప్రతిపాదన చెయ్యడం అంటే అంత కన్నా తెలివి తక్కువ ఇంకోటి ఉండదు
Test
అదే అసలు సమస్య.
ఇంకా ఎలక్షన్స్ కి time వుంది. ఈ లోగా మావిగన్ కూడా ప్లాన్ బి అవ్వదని నమ్మేదెలా
రేపు ఎన్నికల్లో జగన్ రెడ్డి పొరపాటునో, జనాల గ్రహపాటునో మళ్ళీ గెలిస్తే .. అప్పుడు ప్లాన్ బి పక్కకు పోయి.. ప్లాన్ ఏ మూడు రాజధానులు మళ్ళీ తెస్తాడు..
అప్పుడు మీరందరూ…
మావిగన్ వద్దు.. మూడు ఉంటేనే ముద్దు.. అని పాడుకొంటూ రాష్ట్రాన్ని నాశనం చేసేయొచ్చు..
ఎదో మొదలెట్టి ఏదేదో చెప్పి చివరికి సోది మొత్తం చెప్పావు
ఇందుకే చెప్పింది
నీ టాలెంట్ కి అన్నని వదిలేస్తే బాగుపడతావ్
గున్నమావి ఎక్స్టెండెడ్ అమరావతి అని ఒప్పుకున్నారు సంతోషం .. అమరావతి అని ఒప్పుకోలేక మచిలీపట్టణం కలిపి తన మార్క్ రాజధాని సృష్టించారు జగన్ గారు .. తెలుగు పేరు ఏమి దొరకలేదు పాపం పెట్టడానికి ..
రాజధాని ఎక్కడ వున్నా అక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పారా ? లేకపోతె కోర్టులు, అడ్మినిస్ట్రేటివ్ భవనాలు కడితే సరిపోద్దా ? ఒక పెద్ద నగరం ఉంటే ఇన్వెస్ట్మెంట్స్, ఎయిర్పోర్ట్, మిగతా ఫెసిలిటీస్ అన్ని వస్తాయి. అందుకనే నగరాలు, ఇవన్నీ కడుతుంది. కాకపొతే డెవలప్మెంట్ అనేది అన్ని చోట్లా జరగాలంటే, ప్రతి ప్రాంతం లో అక్కడ వున్నా సదుపాయాలు, అనుభవాలు, ఇంకా మనుషుల స్కిల్స్ కలిసి చూడాలండి. ఎదో బిల్డింగ్లు కట్టి అయిపోయిద్ది అంటే ఏమి ఉండదు. అమరావతి అనేది మంచి ఆలోచన. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద సమస్య. ఇన్ఫ్రా కావాలంట జనాభా ఉండాలి. విజయవాడ కి ఎయిర్పోర్ట్ వున్నా ఇంటర్నేషనల్ విమానాలు లేవు, అదే ఒక యాభై లక్షలు జనాభా ఉంటే అది వేరు గా ఉందిద్ది. అలాగే హాస్పిటల్స్, యూని , ఆఫీసులు అన్నిటింకి జనాలు కావాలి.
మీరు చెప్పినట్టు విమానాశ్రయం అవన్నీ కాంట్రాక్టర్లు డబ్బులు కోసమే, మన దగ్గర నాలుగు వరసల రోడ్లు, ఇవన్నీ కూడా చాలా వరకు డబ్బులు కోసమే.
Always, the plan was and remains, to loot public and the state; that’s the only plan: the “J Plan.”
Always, the plan was and remains, to l*oot public and the state; that’s the only plan: the “J Plan.”
Always, the plan was and remains, to l*oot public and the state; that’s the only plan: the “Plan J.”
sir babu is not destroying or demolishing rishikonda buildings unlike jagan did with prajavedika. The govt is paying crores for maintenance. They just didn’t find suitable use for it.
తు.-.గ్ల.-.క్ ఒకసారి రాజదాని ప్రాంతం మారిస్తె, జగన్ అనెక సార్లు మార్చాడు! విచిత్రం ఎమిటంటె ప్రతిసారి జఫ్ఫాలు అదె కొరక్ట్ అన్నారు!
ఒక మేధావి అనుకొనే ఆయన తన అనుభవాన్ని, పద విన్యాస కళను రంగరించి తనకి బువ్వ పెడుతున్న వెబ్ సైట్ యజమాని కులానికి చెందిన ఒక నేర సామ్రాజ్య అధినేత ను తెలుగు ప్రజల నాశనానికి ఉపయోగిస్తున్న తీరు బాధాకరం..!!!
మంగళం పాడడు. ఇష్టమైన ఋషి కొండ పాలస్ వదలడు. దానిని ఏదైనా కంపెనీ కి ఒక పదేళ్లు లీజ్ కి ఇస్తే తప్ప.
అలానే బాబు కట్టిన ఐకానిక్ టవర్స్ ని వాడటం ఇష్టం లేక ఏదైనా రెంటెడ్ బిల్డింగ్స్ లో నుంచి పరిపాలన చెయ్యొచ్చు. ఇదంతా అయన గెలిచినప్పటి సంగతి. ఇప్పట్లో ప్రజలు అయన దుష్పరిపాలన ని మర్చిపోరు.
///సైబరాబాదు కట్టేటప్పుడు 23 జిల్లాల ఆదాయం వుంది. కల్పతరువైన హైదరాబాదుంది. ఊపితే డబ్బులు రాలాయి. ///
.
సైబరాబాదు నిర్మించెటప్పుడు రాష్ట్ర బుడ్జెట్ సుమారు 3 వేల కొట్లు! ఇప్పుడు తెలంగాణా పొగా మిగిలిన ఆంద్రప్రదెష్ ఆదాయం ఎంత? 3 లక్షల కొట్లు పైన!
ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్స్ అయ్యారు?
// ‘ఐడియా దేర్ ఆయా పర్ దురుస్త్ ఆయా’ అనే భావం అందరిలో కలగడం టీడిపి ని మండిస్తోంది // ఇది హైలైట్
ఇవ్వాళ ఈ దెశం లొ ఎ నగరం చూసినా విపరీతం అయిన ట్రాఫీక్, నీటి యద్దడి, డ్రినేజ్ సమస్య, పొలుషన్. దీనికి కారణం ఈ నగరాలు ఒక ప్లాన్ ప్రకారం అబిరుద్ది చెందలెదు! ఎదొ రియల్ ఎస్తెట్ వెంచర్లతొ in-organic గా పెరిగింది! ఇప్పుడు వెల కొట్లు కర్చు చెసి నివాస యొగ్యం గా చెయాలి అని చూసినా, పెద్దగా కుదరటం లెదు! ప్రజల జీవనం దుర్బరం గా ఉంది!
.
చైనా ‘1’0’0 కొత్త నగరాలని నిర్మించుకుంది! మన దెశం ఎన్నొ సంవశ్చరాల తరవాత ఒక కొత్త నగరం వస్తుంటె.. దానికి ఎ ప్లాన్ వద్దు, చెట్టుకొక, పుట్టకొక భవనం నిర్మిస్తె అదె నగరం అవుతుంది, అని వాదిస్తె వాడిని ఎమి అనాలి?
మావిగన్ అంటేనే మంచిదంటున్న కోవిదులు అనే శీర్షికతో రాస్తారు అనుకున్నాను కానీ, నా అంచనా తప్పింది. రాజధాని రైతుల కష్టాల గురించి జగన్, ఆయన అనుయాయులు మాట్లాడితే ప్రజలు నవ్విపోతారు. అలా కాదు అనుకుంటే జగన్ రైతులను కలుసుకుని వారికి సంఘీభావం ప్రకటిస్తే బాగుంటుంది. వారు ఖాండ్రించి ఉమ్ము వేస్తే తుడిచేసుకుని మళ్లీ, మళ్లీ ప్రయత్నిస్తే వారి మనసులు కరగవచ్చు. మావిగన్‌కి . క్షమించాలి గున్నమావికి ఆ రైతులు మద్దతు పలకవచ్చు కూడా. జగన్ ఆ దారిలో ప్రయత్నిస్తే బాగుంటుందేమో ఆలోచించండి సర్
చంద్రబాబు ఒక సందర్భంలో “మీ పులివెందుల రాజకీయాలు నా వద్ద కాదు” అంటే ప్రసాద్‌గారు “బాబు ఒక ప్రాంతాన్ని అవమానిస్తున్నారు” అని వాపోయారు. మరి ఈ వ్యాసంలో గుంటూరు, కృష్ణాజిల్లావారి గురించి ఇంత చెడ్డగా రాయడం సబబేనా? విఙులు ఆలోచించాలి
తు.-.గ్ల.-.క్ ఒకసారి రాజదాని ప్రాంతం మారిస్తె, జగన్ అనెక సార్లు మార్చాడు! విచిత్రం ఎమిటంటె ప్రతిసారి జఫ్ఫాలు అదె కొరక్ట్ అన్నారు!
ఇట్టనే అడ్డ diddanga ఏదో ఒకటి వాగుతూ ఉండండి… రాజధానికి వ్యతిరేకంగా ఓటు వేసింది ఒక్క YCP మాత్రమే… జనాలు మన పార్టీ ki మంగళం పాడేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
///నిజానికి హైదరాబాదు కార్పోరేషన్ ఎలా పెరిగింది? చుట్టూ వున్న శివారు గ్రామాలను కలిపేశారంతే. సౌకర్యాల మాట దేవుడెరుగు కానీ, యింటి పన్నులు పెరిగాయి. ప్రభుత్వం ప్రకటించి వూరుకుంటే, ప్రయివేటు రియల్టర్లే చుట్టూ ప్రాంతాలను ప్రమోట్ చేస్తూ, కాలనీలు కట్టుకుంటూ పోయారు. ప్రజలు అటు షిఫ్ట్ అయ్యారు. తర్వాత మంచి రోడ్లు, బస్సులూ వచ్చాయి. ///
.
బొహిశా ఇంతకు మిoచిన భావ దరిద్రం లెదు అనుకుంటా!
హైదెరాబాదులొ ఎందుకు అంత ట్రాఫిక్ రద్ది, నీటి, పారిసుద్య సమస్యలు? టౌన్ ప్లానింగ్ సరిగ్గ లేకనె! బెంగళూరు లొకూడా అదె సమస్య! హైదెరాబాదు లొ కొంత సైబెరాబాదు బెట్టెర్. అంతొ ఇంతొ ప్లాన్ చెసి కట్టరు! ఇక పాత హైదెరబాదు పరిస్తితి దారుణం.
.
దీనికి కారణం ఈ నగరాలు ఒక ప్లాన్ ప్రకారం అబిరుద్ది చెందలెదు! ఎదొ రియల్ ఎస్తెట్ వెంచర్లతొ in-organic గా పెరిగింది! ఇప్పుడు వెల కొట్లు కర్చు చెసి నివాస యొగ్యం గా చెయాలి అని చూసినా, పెద్దగా కుదరటం లెదు! ప్రజల జీవనం దుర్బరం గా ఉంది!
.
చైనా ‘1’0’0 కొత్త నగరాలని నిర్మించుకుంది! మన దెశం ఎన్నొ సంవశ్చరాల తరవాత ఒక కొత్త నగరం వస్తుంటె.. దానికి ఎ ప్లాన్ వద్దు, చెట్టుకొక, పుట్టకొక భవనం నిర్మిస్తె అదె నగరం అవుతుంది, అని వాదిస్తె ఎమి అనాలి?
నువ్వు కులకటానికి కట్టుకున్న రిషికొండ ప్యలెస్స్ మాత్రం అన్ని హంగులతొ ఆర్కిటెక్ట్, ఇంటీరియల్ డిజినెర్లు కావాలి! బావితరాల రాజదానికి మాత్రం ఎ town ప్లాన్ లెకుండా అడ్డ దిడ్డంగా ప్రయివేటు రియల్టర్లలు పిచ్చి పిచ్చి గా లేవుటులు వెయాలా?
50000000000

500000

ఉన్న అయిదేళ్ళు గోతులు కూడా పూడ్చలేదు కాకినాడ నుండి రాజమండ్రి ఎయిర్ పోర్టు కి వెళ్ళాళంటే నడుము విరిగిపోయేది.చుట్టుతిరిగి కత్తిపూడి మీద నుంచి వెళ్ళే వారు.
ఈయన ఓడింతర్వత డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు,మనం నమ్మాలి.
అల్పుడెపుడు పల్కునాడంబరంగానూ
సజ్జనుడు పల్కు చల్లగానూ
కంచు మోగునట్లు కనకంబు మోగునా !
ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్
సొల్లుకబుర్లు వద్దు సోమలింగం
చేసేది గోరంత వాగేది కొండంత
మాటలు కోటలు దాటేను, చేతలు గుమ్మం దాటవు
చెప్పేది చెయ్యి, చేసేదే చెప్పు
తుపాకీరాముళ్ళ గురించి ఎన్నెన్ని అద్భుతమైన సామెతలు ఉన్నాయండీ తెలుగులో
చెప్పేది చెయ్యి, చేసేదే చెప్పు
తుపాకీరాముళ్ళ గురించి ఎన్నెన్ని అద్భుతమైన సామెతలు ఉన్నాయండీ తెలుగులో
జగన్ గారి గురించి, వంద ఏళ్ళ క్రితమే ఇవన్నీ
చెప్పారా!
///నిజానికి హైదరాబాదు కార్పోరేషన్ ఎలా పెరిగింది? చుట్టూ వున్న శివారు గ్రామాలను కలిపేశారంతే. సౌకర్యాల మాట దేవుడెరుగు కానీ, యింటి పన్నులు పెరిగాయి. ప్రభుత్వం ప్రకటించి వూరుకుంటే, ప్రయివేటు రియల్టర్లే చుట్టూ ప్రాంతాలను ప్రమోట్ చేస్తూ, కాలనీలు కట్టుకుంటూ పోయారు. ప్రజలు అటు షిఫ్ట్ అయ్యారు. తర్వాత మంచి రోడ్లు, బస్సులూ వచ్చాయి. ///
.
హైదెరాబాదులొ ఎందుకు అంత ట్రాఫిక్ రద్ది, నీటి, పారిసుద్య సమస్యలు? టౌన్ ప్లానింగ్ సరిగ్గ లేకనె! బెంగళూరు లొకూడా అదె సమస్య! హైదెరాబాదు లొ కొంత సైబెరాబాదు బెట్టెర్. అంతొ ఇంతొ ప్లాన్ చెసి కట్టరు! ఇక పాత హైదెరబాదు పరిస్తితి దారుణం.
.
దీనికి కారణం ఈ నగరాలు ఒక ప్లాన్ ప్రకారం అబిరుద్ది చెందలెదు! ఎదొ రియల్ ఎస్తెట్ వెంచర్లతొ in-organic గా పెరిగింది! ఇప్పుడు వెల కొట్లు కర్చు చెసి నివాస యొగ్యం గా చెయాలి అని చూసినా, పెద్దగా కుదరటం లెదు! ప్రజల జీవనం దుర్బరం గా ఉంది!
.
చైనా ‘1’0’0 కొత్త నగరాలని నిర్మించుకుంది! మన దెశం ఎన్నొ సంవశ్చరాల తరవాత ఒక కొత్త నగరం వస్తుంటె.. దానికి ఎ ప్లాన్ వద్దు, చెట్టుకొక, పుట్టకొక భవనం నిర్మిస్తె అదె నగరం అవుతుంది, అని వాదిస్తె ఎమి అనాలి?
Jagan కులకటానికి కట్టుకున్న రిషికొండ ప్యలెస్స్ మాత్రం అన్ని హంగులతొ ఆర్కిటెక్ట్, ఇంటీరియల్ డిజినెర్లు కావాలి! బావితరాల రాజదానికి మాత్రం ఎ town ప్లాన్ లెకుండా అడ్డ దిడ్డంగా ప్రయివేటు రియల్టర్లలు పిచ్చి పిచ్చి గా లేవుటులు వెయాలా?

ఒక చిన్నరాష్ట్రం
ఆదాయం తేవాల్సిన పారిశ్రామిక అభివృద్ది ఏమంత గొప్పగా లేని రాష్టం
బడాయి ఖర్చులతో అప్పులకుప్ప అయిన రాష్ట్రం
పంటపొలాలను నాశనం చేసి, అప్పులు తెచ్చి బ్రహ్మాండమయిన మెగాసిటీ కడితే సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అయిపోతుందా ?
అన్నీ తెచ్చి ఇక్కడే మురగేసే బదులు, వాటిని రాష్ట్రం మొత్తం సర్దితే అభివృద్ది చంకనాకిపోతుందా ?
నేను ఇన్ని ఇర్రిగేషన్ ప్రాజెక్టులను కట్టాను, నేను ఇన్ని పవర్ ప్లాంటులను కట్టాను, నేను ఇన్ని హైవేస్ వేయించాను, నేను ఇన్ని భారీ పరిశ్రమలు తెచ్చాను అని సగర్వంగా చెప్పుకోగలిగే పోటుగాడిని ఎన్నుకున్న రోజునే ఏ రాష్ట్రానికైనా గతీ మోక్షం
ఒక చిన్నరాష్ట్రం
ఆదాయం తేవాల్సిన పారిశ్రామిక అభివృద్ది ఏమంత గొప్పగా లేని రాష్టం
బడాయి ఖర్చులతో అప్పులకుప్ప అయిన రాష్ట్రం
బడాయి సంక్షేమ పథకాలు అని కూడా రాయండి .
పంటపొలాలను నాశనం చేసి, అప్పులు తెచ్చి బ్రహ్మాండమయిన మెగాసిటీ కడితే సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అయిపోతుందా ?
అన్నీ తెచ్చి ఇక్కడే మురగేసే బదులు, వాటిని రాష్ట్రం మొత్తం సర్దితే అభివృద్ది చంకనాకిపోతుందా ?
నేను ఇన్ని ఇర్రిగేషన్ ప్రాజెక్టులను కట్టాను, నేను ఇన్ని పవర్ ప్లాంటులను కట్టాను, నేను ఇన్ని హైవేస్ వేయించాను, నేను ఇన్ని భారీ పరిశ్రమలు తెచ్చాను అని సగర్వంగా చెప్పుకోగలిగే పోటుగాడిని ఎన్నుకున్న రోజునే ఏ రాష్ట్రానికైనా గతీ మోక్షం
మునిగే ప్రాంతంలో .. పంట పొలాలు ఎలా ఉంటాయి సర్ ? అమరావతి వ్యతిరేకించడానికి ఎదో ఒక కరెక్ట్ లాజికల్ స్టాండ్ తీసుకోండి .. మీరు అన్న ప్రాజెక్టులు కట్టాలి అన్నా ప్రభుత్వం అప్పు చేయాల్సిందే .. రాష్ట్ర ఆదాయమూ తో కాటేసే స్తొమత దేశం లో ఏ రాష్ట్రానికి ఉండదు .. అప్పులు చేసి సంక్షేమ పథకాలు కి పప్పు బెల్లం కింద పనిచేయడం కన్నా ఇన్ఫ్రా స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కొంచెం నయమే .. ..
పంటపొలాలు కొత్త గా వచ్చాయా?
మరి అధికారం రాక ముందు అమరావతి కి మద్దత్తు ఎలా పలికారు?
ఈ మధ్యనే కాదా అమరావతి కాదు అవినీతి కి మేము వ్యతిరేకం అన్నారు?
మళ్ళీ ఈ పంట పొలాల పల్లవి ఏంటి? ఒక మాట మీద ఉండరా?
why don’t we ask Kia to put quarter plant in 4 areas and Mittal also same…lol
ప్రతి ఊరులొ మౌలిక వసతులు.. అంటె రొడ్లు, డ్రైనేజ్, కరెంట్, త్రగు నీరు ఎవరు కల్పిస్తున్నారు?
విశాకలొ, కుర్నూల్ లొ, తిరుపతిలొ మౌలిక వసతులి ఎవరికి వారె కల్పిచుకుంట్తున్నారా? లెక ప్రబుత్వమె కల్పిస్తుందా??? మరి రాజధానిలో మౌలిక వసతుల కల్పించాలి అంటూ ఈ గోల ఎమిటి?
అమరావతి వల్ల కేవలం కొందరికే లాభం, మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరగాలంటూ రాయలసీమ లో కర్నూలు న్యాయ రాజధాని, ఉత్తరాంధ్ర లో వైజాగ్ ని అడ్మిన్ రాజధాని చేసి 3రాజధానులు కడతా అన్నోడు, ఇప్పుడు MAVIGUN అంటే రాయలసీమ నీ, ఉత్తరాంధ్ర నీ మోసం చేసినట్టే..
పూర్తిగా సంక నాకిపోయిన విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఓ 10 సీట్లు వస్తాయని, ఆశ పడి MAVIGUN అంటూ నాటకాలు ఆడితే
60% సీట్స్ ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర లో బోడిగుండు చేస్తారు రా ఎర్రిజగనా…
జగన్ గారికి వొళ్ళు మండింది అంటే తన ప్యాలెస్ లు అన్ని రాష్ట్రంలో పేద ప్రజలకి దానం చేస్తారు, ఎం అనుకున్నారో !
మనం ఒక సారి మోసపోతే అది అవతలి వారి తప్పు.
రెండవ సారి కూడా మోసపోతే అది మన తప్పు.
అట్లాంటిది 4 టర్మ్స్ నుంచి మోసపోతున్నాము అంటే మన డిఎన్ఏ లో డిఫెక్ట్ వుంది అని అర్ధం.
ఈ 4 టర్మ్స్ లో ఒక్క ప్రాజెక్ట్ concept to commissoning వరుకు ముందు వుండి నడిపించార ఆ మహానుభావుడు ? .
capital expenditure మోడల్ ని తన వాళ్ళ wealth క్రియేషన్ మోడల్ గా డిజైన్ చేసిన ఈ విషనరీ నభూతొ నభవిష్యత్.
రాష్ట్రము లో ఒక్కో ప్రాంతం లో ఒక్కో కమ్యూనిటీ వారు కాన్సన్ట్రేటెడ్ గ బలం గ ఉన్నారు .. ఎక్కడ రాజదాని పెట్టిన .. ఎక్క అభివృద్ధి చేసిన అక్కడ ఉన్నవారు ఏంటో కొంత లాభపడతారు .. ఆలా లాభపడిపోతారు అని అక్కడ పెట్టోడు అనడం విడ్డురం ..
జగన్ ఎన్ని టర్న్స్ తీసుకున్నాడో కూడా చెప్పు, అలాగే జగన్ తన దోచుకోటం కోసం టర్న్స్ తిరుగుతున్నాడు అది కలిపేలా నీకు
అప్పులు చేసి పనిచేసిన వాళ్ళకి కూడా న”భూతో ” నో భవిష్యత్తు
People are smart anduke Jagan ki 11 iccharu,
concept to comissioning rishi konda palace!!!!
keep pasting same thing..looks like paid artist of ycheap
Let the youth & people of AP go begging to other State capitals like Bengaluru, Chennai or Hyderabad and get insulted there. We dont want any capital. – This is the stand of YSRCP & this author as well.
అమరావతి వల్ల కేవలం కొందరికే లాభం, మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరగాలంటూ రాయలసీమ లో కర్నూలు న్యాయ రాజధాని, ఉత్తరాంధ్ర లో వైజాగ్ ని అడ్మిన్ రాజధాని చేసి 3రాజధానులు కడతా అన్నోడు, ఇప్పుడు MAVIGUN అంటే రాయలసీమ నీ, ఉత్తరాంధ్ర నీ మోసం చేసినట్టే..
పూర్తిగా సంక నాకిపోయిన విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఓ 10 సీట్లు వస్తాయని, ఆశ పడి MAVIGUN అంటూ నాటకాలు ఆడితే
60% సీట్స్ ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర లో బోడిగుండు చేస్తారు రా ఎర్రిజగనా..
జగన్ మోహిని మెంటల్ బుర్ర కి ఒక ప్లాన?
పిచ్చోడు ముందు రోజు ఏమి జరిగింది బట్టి మరుసటి రోజు నోటికి వచ్చింది వాగుతాడు.
తు.-.గ్ల.-.క్ ఒకసారి రాజదాని ప్రాంతం మారిస్తె, జగన్ అనెక సార్లు మార్చాడు! విచిత్రం ఎమిటంటె ప్రతిసారి జఫ్ఫాలు అదె కొరక్ట్ అన్నారు
ప్లాన్ B కీ మంగళం పాడి.. 2027లో ప్లాన్ C తో అడుగులు ముందుకు వేస్తాడు.. తర్వాత ప్లాన్ D
“2027లో ప్లాన్ B కీ మంగళం పాడి.. ” ప్లాన్ C తో అడుగులు ముందుకు వేస్తాడు.. తర్వాత ప్లాన్ D
ప్లాన్ B ఎన్నాళ్లు ఉంటది? Next year Plan C తో అడుగులు ముందుకా ప్రసాదం?
ప్రసాదం బాగా ముట్టినట్టు ఉంది ఈడికి..
ఇక్కడ జగన్ మూడు ముక్కలాట కంటే తన అరాచకం, పొగరు, అవినీతి, బూతులు, అమరావతి రైతులని ఇబ్బంది పెట్టిన విధానం, సీబీఎన్ అరెస్ట్. మరి ముఖ్యంగా బటన్ నొక్కి డబ్బులు జమ చేయడం చదువుకున్న వాళ్ళకి అస్సలు నచ్చలేదు, ఇవన్నీ కలిపి చీల్చి చెండాడి 11 సీట్స్ దగ్గర పడేసారు , నవరత్నాలని కలిపి నవరంధ్రాలు పొడిచారు
ఊసరవెల్లి కూడా ఉరేసుకునే విధంగా” ఎన్నిసార్లు మాట తప్పి, మడమ తిప్పి డ్రామాలాడాడు కనుకే2024ఎలక్షన్స్ లో ప్రజలు జగ్గడికి కనీసం ప్రతిపక్ష హోదా కి కూడా పనికి రాని సన్నాసి అంటూ11 ఇంచుల లోతుగా దింపి పంగనామాలు పెట్టి, పక్క రాష్ట్రాలకి తరిమి తరిమి కొడితే, పోయి బెంగళూరు బంకర్ లో దాక్కున్నాడు అయినా ఇంకా బుద్ధి రాకుండా కేవలం చంద్రబాబుకి క్రెడిట్ రాకూడదననే కుళ్ళుతో,గుంటూరు, విజయవాడ లకు కూతవేటు దూరంలో ఉన్న అమరావతి లో పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అభివృద్ధి కాకూడదని కోరుకుంటూ మళ్లీ MAVIGUN ఆనే కోత్త నాటకం మొదలుపెట్టాడు… ఇదైనా ఉంటుందా లేక ఇంకో ప్రాంతంలో ఇంకో పేరుతో మళ్ళీ మారుస్తాడా?
ఇంకో 11నెలల్లో Plan B కీ మంగళం పాడి, ప్లాన్ C తో అలా అడుగులు ముందుకు వేస్తాడా?
కామెంట్స్ డిలీట్ చేస్తున్నావ్ అంటే నువ్వు MBచెక్కగాడని అర్థం అవుతోంది.
wrtiter గారు, మీరు చెప్పినట్టే డెఫిసిట్ ఉండి ఉండవచ్చు అప్పట్లో కూడా ఇలానే సీబీఎన్ ని అన్నారు అప్పులు చేస్తున్నాడు, అని చివరికి ఏమైంది? 2003 నుండి IT ఊపందుకోటం హైటెక్ సిటీ డెవలప్ కావటం స్టేట్ రెవిన్యూ పెరగటం ఆరంభించాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి సర్? ఫ్యూచర్ ప్లాన్ అంటారు.
సీబీఎన్ టర్మ్ లో కర్ణాటక IT రంగం దూసుకు పోతోంది, కృష్ణ సీఎం గా నంబర్ 1 లో ఉన్నాడు, అలాంటి వ్యక్తి తో పోటీపడి IT comapanies తేల్చాడు కాబట్టే YSR గారికి రాచబాట అయింది. ఇవన్నీ మర్చిపోతే ఎలా సర్
రైటర్ గారు, మీరు చెప్పినట్టే డెఫిసిట్ ఉండి ఉండవచ్చు అప్పట్లో కూడా ఇలానే సీబీఎన్ ని అన్నారు అప్పులు చేస్తున్నాడు, అని చివరికి ఏమైంది రెండు వేల రెండు నుండి IT ఊపందుకోటం హైటెక్ సిటీ డెవలప్ కావటం స్టేట్ రెవిన్యూ పెరగటం ఆరంభించాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి సర్, ఫ్యూచర్ ప్లాన్ అంటారు.
సీబీఎన్ టర్మ్ లో కర్ణాటక IT రంగం దూసుకు పోతోంది, కృష్ణ సీఎం గా నంబర్ 1 లో ఉన్నాడు, అలాంటి వ్యక్తి తో పోటీపడి IT comapanies తేల్చాడు కాబట్టే YSR గారికి రాచబాట అయింది. ఇవన్నీ మర్చిపోతే ఎలా సర్
మీరు జవాబు చెప్పలేక బ్లాక్ చేస్తే మీ చేతగాని తనాన్ని చూసి మీ ఎంతగా బాధ పడుతున్నారో అర్థం అవుతుంది
Good, suggest Jagan to continue MAViGUN agenda till next elections. So that TDP/JSP will get second term without much effort
ప్రజలు మంగళం పడేయకుండా చూసుకోండి ..
ఊసరవెల్లి కూడా ఉరేసుకునే విధంగా” ఎన్నిసార్లు మాట తప్పి, మడమ తిప్పి డ్రామాలాడాడు కనుకే2024ఎలక్షన్స్ లో ప్రజలు జగ్గడికి కనీసం ప్రతిపక్ష హోదా కి కూడా పనికి రాని సన్నాసి అంటూ11 ఇంచుల లోతుగా దింపి పంగనామాలు పెట్టి, పక్క రాష్ట్రాలకి తరిమి తరిమి కొడితే, పోయి బెంగళూరు బంకర్ లో దాక్కున్నాడు అయినా ఇంకా బుద్ధి రాకుండా కేవలం చంద్రబాబుకి క్రెడిట్ రాకూడదననే కుళ్ళుతో,గుంటూరు, విజయవాడ లకు కూతవేటు దూరంలో ఉన్న అమరావతి లో పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అభివృద్ధి కాకూడదని కోరుకుంటూ మళ్లీ MAVIGUN ఆనే కోత్త నాటకం మొదలుపెట్టాడు… ఇదైనా ఉంటుందా లేక ఇంకో ప్రాంతంలో ఇంకో పేరుతో మళ్ళీ మారుస్తాడా?
అసలు స్థిర కాపిటల్ అనేది లేకుండా, సంచార కాపిటల్ అనే కాన్సెప్ట్, జగన్ గారు ముందుకు తీసుకు వెళ్ళాలి.
అంటే ప్రభుత్వం మొత్తం ఒక కదిలే ట్రైన్ లో ఉంటుంది. శ్రీకాకుళం నుండి బయలు దేరి తిరుపతి కి ,అటు ఇటు తిరుగుతూ వుంటుంది. Cm అందులో ac కోచ్ లో నివాసం ఉంటారు. ఆ ట్రైన్ ఆ రోజు ఏ స్టేషన్ లో ఆగితే, ఆ రోజుకి అదే ఆంద్ర కాపిటల్. ఎవరైనా cm నీ కలవాలి అంటే, ట్రైన్ లో ఎక్కి కలవాలి.
వారం వారం చల్లగా బెంగళూరు కి షికార్లు కొట్టే జగన్ గారికి ఇది బాగా సూట్ అవుతుంది.
అరే, అరికట్ల వటక్కాయ రెడ్డి!
“అమరావతిలో జగన్ ఏమి చేయబోయినా (కృష్ణా – గుంటూరు లాబీ) అడుగడుగునా అడ్డు తగిలారు. కోర్టుల్లో కేసులు మీద కేసులు వేసుకుంటూ పోయారు. కోర్టులూ వారికి వంత పాడాయి.”
.
జగన్ అమరావతిలో చేసినవి చేయబోయినవి: ప్రజా వేదిక కూల్చడం, నిరసనకారుల్ని మహిళల్ని పోలీసులతో కొట్టించడం, 144 section పెట్టడం, అక్కడ జరుగుతున్న అన్ని నిర్మాణ పనుల్ని ఆపేయడం, నిర్మాణ సామాగ్రి వేరేచోటకి తరలించడం, ప్లాన్ ను నిర్వీర్యం చేయడానికి బయటవాళ్ళకు సెంట్ స్థలాలు ఇచ్చి slum క్రియేట్ చేయాలి అనుకోవడం… కోర్టులు ఊరికే వంత పాడతాయా? కోర్టుల్లో నిలవకపోతే చేయబోయేది అన్యాయమనే కదా? పైగా జగన్ చేయబోయిన అభివృద్ధికి కోర్టులు అడ్డుపడ్డాయి అని జనాలకి సర్ది చెప్పుకోమని సలహా ఇస్తారా? అది contempt of court కాదా?
“జగన్ కు విసుగెత్తింది. అవమానాలతో అసహనం పెరిగింది. ఓర్చుకొని శ్రమపడి అమరావతిని డెవలప్ చేసినా … వచ్చే ఎన్నికల్లో తనని ఓడించడానికే అది ఉపయోగ పడుతుంది అని అర్థం చేసుకున్నాడు.”
.
మీరు రాసిన మొత్తం వ్యాసంలో జగన్ కి ఉన్న motivations మొత్తం అమరావతిని ముందుకు వెళ్లకపోనివ్వడమే అని తెలుస్తోంది. రాజధాని పరంగా ఒక్క సరైన విధానం కానీ చేసిన పని కానీ లేదు. మావిగన్ కు వున్న motivations అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.
.
జగన్ చెప్పినవి: 1) క్యాపిటల్ కి పోర్ట్ ఉంటే అభివృద్ధి వేగంగా ఉంటుంది. 2) 110km హైవే రెండువైపులా ఆఫీసు భవనాలు కట్టడం.
.
అసలు క్యాపిటల్ కి పోర్ట్ కి సంబంధం ఏమిటి? క్వాంటమ్ వ్యాలీ లాంటి వాటిని సీ పోర్ట్స్ కి అనుసంధానం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? సెక్రటేరియట్ భవనాన్ని 5 ముక్కలు చేసి అక్కడక్కడా విసిరేసినట్టు కడితే, బయట నుంచి వచ్చేవారికి బాలయ్య సినిమాలో చెప్పినట్టు ఏ ముక్క ఎక్కడుందో వెతుక్కోవడానికే ఒక రోజు పడుతుంది.
.
మావిగన్ అంటూ ఏ కసరత్తు లేని పిచ్చి వాగుడుకి ఏమన్నా క్లారిటీ ఉందా? ఒకడు దాంట్లో అమరావతి ఉంది అంటాడు, ఇంకోడు లేదు అంటాడు … మీరు చెప్పిన మావిగన్, జగన్ చెప్పింది ఒక్కటే అంటారా? పిచ్చి వాగుడికి పది భాష్యాలు రాస్తే అది సూక్తి అయిపోదు. ఏదో సోషల్ మీడియా లో పాపులారిటీ కి చేసిన వీడియో లాగా ఉంది. చిత్త శుద్ధి ఉంటే సరిగ్గా కసరత్తు చేసి govt. ముందు ఒక ప్రపోజల్ పెట్టండి. అసెంబ్లీలో డిస్కస్ చేయండి.
Whatever leaders say, CBN is well aware that YCP got nearly 40% of votes. The power cycle is going to turn once in 5 years. So, YCP is not a demon bottled and cremated. CBN is well aware of it.
nope..ycheap does not have 40%.. wait till 2029 and you will know..
తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందని సామెత.
ఈయన గారికి (జగన్) మూడేళ్ల కొకసారి ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలొస్తాయి.
ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఏడవకుండా అసెంబ్లీకి వెళితే ఏ విషయం గురించి అయినా చర్చించే అవకాశంఉంటుంది అట్లా పోము
ఈ మావిగన్ (పేరు వినగానే ఆయన ఎంత సీరియస్ గా చెప్పాడో తెలుస్తుంది) గురించి ఇతఃపూర్వం ఎవరితోచర్చించారో తమలాంటి మేధావులు వ్రాక్క్రుచ్చాలి మరి
పక్షితీర్థంలో పక్షిలాగా ఆరోజుకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడారో తెలీక, కక్కలేక మింగలేక ఏదోనోటికొచ్చినట్టు వాగి ఆయన వెళ్ళిపోతే …. ఆయన మాటల్లో ఏదో నిగూఢ అర్థం ఉందని మీలాంటి వైకాపాకార్యకర్తలు ప్రచారం చేయడం ఓ దౌర్భాగ్యం
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. తప్పే లేదు
yemayya panthulu
a photolu yenti?
moodu rajadanulu ani nalugo velu mavigun ni choospisthunnadu?
మా అన్నయ్య అధికారం లోకి వస్తే గనుక ప్లాన్ బి అటక ఎక్కుతుంది.ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని.
“కానీ ‘ఐడియా దేర్ ఆయా పర్ దురుస్త్ ఆయా’ అనే భావం అందరిలో రగలడం టిడిపిని మండిస్తోంది”..what an elevation to a fake idea…he just proposed it to keep opposing but not as a serious…same like 3 capitals…lol