వైసీపీలో ఏం జరుగుతున్నదో, కార్యకర్తల ఆకాంక్ష ఏంటో వైఎస్ జగన్‌కు తెలియకుండా కొంత మంది జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అదే తమ కర్తవ్యంగా భావిస్తుంటారు. ఎందుకంటే, జగన్‌కు నిజాలు తెలిస్తే వైసీపీలో కొందరి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. జగన్‌ను ఎంత అంధకారంలో ఉంచారంటే, ఇటీవల తాడేపల్లిలో ఆయన కార్యాలయం వెలుపల పే…ద్ద గొడవ జరిగింది. కానీ ఇంత వరకూ ఆ విషయమై జగన్‌కు తెలియనివ్వలేదని వైసీపీ కేంద్ర కార్యాలయ విశ్వసనీయ వర్గాల సమాచారం.
చంద్రబాబు సర్కార్‌లో కీలకంగా పనిచేసే మహిళా మంత్రి తోడి కోడలు కొంతకాలం క్రితం వైసీపీలో చేరారు. సదరు మహిళా నాయకురాలు, అలాగే వైసీపీకి చెందిన దళిత నాయకులు జగన్‌ను కలవడానికి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సదరు మహిళా నాయకురాలితో వైసీపీ యువ నాయకుడు కాస్త అభ్యంతరకరంగా మాట్లాడినట్టు తెలిసింది. దీంతో అక్కడే ఉన్న విజయవాడ వైసీపీ ఎస్సీ నాయకుడు ఇదేంటని నిలదీసినట్టు తెలిసింది. మహిళలతో ఎలా మాట్లాడాలో తెలియదా? అని ఆగ్రహించినట్టు సమాచారం.
దీంతో అహం దెబ్బ తిన్న వైసీపీ యువ నాయకుడు…అక్కడున్న పార్టీ దళితులపై కొడతానంటూ చెప్పు తీసుకున్నాడని తెలిసింది. ఈ విషయమై వైసీపీ దళిత నాయకులు మేరుగ నాగార్జున, సుధాకర్‌బాబుల దృష్టికి సదరు బాధిత దళితులు తీసుకెళ్లారు. ఈ లోపు అక్కడి నుంచి నోరు పారేసుకున్న వైసీపీ యువ నాయకుడు తప్పించుకున్నాడు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి మేరుగ నాగార్జున, సుధాకర్‌బాబు చేరుకున్నారు.
అసలేం జరిగిందో వాళ్లకు దళితులు వివరించారు. అక్కడి నుంచి వాళ్లంతా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లారు. తమపై అవాకులు చెవాకులు పేలిన అతనిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే బడిత పూజ చేస్తామని సజ్జలతో నేరుగా చెప్పారు. సదరు యువ నాయకుడికి సజ్జల ఫోన్ చేయగా, తాను ఊళ్లో లేనని, రేపు వచ్చి మాట్లాడ్తానని చెప్పినట్టు తెలిసింది. అయితే యువనాయకుడిని కొడితే, వ్యవహారం చాలా దూరం పోతుందని గ్రహించిన సజ్జల రామకృష్ణారెడ్డి… సదరు వ్యక్తిని పిలిపించి మాట్లాడ్తానని, క్షమాపణ చెప్పిస్తానని , మళ్లీ రేపు రావాలని సర్ది చెప్పి పంపారు.
ఆ మరుసటి రోజు పెద్ద సంఖ్యలో దళితులు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సదరు నోటి దురుసు యువ నాయకుడిని పిలిపించినట్టు తెలిసింది. మొదట తాను చెప్పు తీసుకోలేదని , తిట్టలేదని బుకాయించినట్టు సమాచారం. కానీ సీసీ కెమెరాల పుటేజిని తెప్పించి పరిశీలించాలని దళితులు డిమాండ్ చేయడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో సజ్జల ఆ పని చేయాల్సి వచ్చింది.
సీసీ పుటేజీలో దళితులు చెప్పినట్టుగానే, సదరు వైసీపీ యువ నాయకుడు కొడతానంటూ చెప్పు చేతిలోకి తీసుకోడానికి సంబంధించిన దృశ్యాలు కనిపించినట్టు సమాచారం. దీంతో తప్పును అనివార్యంగా ఒప్పుకున్నట్టు తెలిసింది. దళితుల చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పాడని సమాచారం. ఇంతటితో సమస్య తీరిపోయిందని సజ్జల అనుకున్నారు.
కానీ ఆత్మాభిమానం దెబ్బతిందని రగిలిపోతున్న దళితులు, కార్యాలయం బయటికి వచ్చి, సదరు యువ నాయకుడి కోసం ఎదురు చూడసాగారు. అతను బయటికి వస్తే చితక్కొట్టాలని కాచుక్కూచున్నారు. కొంత సమయం తర్వాత కారులో సజ్జల ఎక్కడికో బయల్దేరుతూ, ఇంకా గేటు దగ్గర గుంపుగా ఉన్న దళితుల్ని చూశారు.
ఏమైనా పని వుందా? అని దళితుల్ని ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. సదరు నోటి దురుసు యువ నాయకుడికి బుద్ధి చెప్పిన తర్వాతే, ఇక్కడి నుంచి వెళ్తామంటూ మనసులో మాటను సజ్జల దగ్గర బయట పెట్టినట్టు సమాచారం. దీంతో పార్టీ పరువు బజార్ను పడుతుందని ఆందోళన చెందారు. మళ్లీ దళితుల్ని లోపలికి తీసుకెళ్లి, రెండోసారి కూడా క్షమాపణ చెప్పించినట్టు వైసీపీ కేంద్ర కార్యాలయ విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
ఇంతకూ నోటి దురుసు యువ నాయకుడెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో సామాజిక సమీకరణల పేరుతో సిటింగ్ ఎంపీని కాదని, ఎవరినైతే నిలబెట్టాలని జగన్ అనుకున్నారో, అతనే నోటి దురుసు యువ నాయకుడు. ఎంపీ అభ్యర్థి అతనే అని తెలియగానే, ఎమ్మెల్యే అభ్యర్థులంతా వెళ్లి, ఇలాగైతే తాము పోటీ చేసేది లేదని జగన్‌కు తేల్చి చెప్పడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. దీంతో ఆ స్థానం నుంచి నెల్లూరుకు చెందిన మాజీ మంత్రిని పోటీ చేయించిన సంగతి తెలిసిందే.
అలాగే సాక్షి చానల్‌లో కూచుని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆ యువ నాయకుడే, సొంత పార్టీకి చెందిన మహిళను అమర్యాదగా మాట్లాడ్డంతో పాటు కొడతానంటూ దళితులపై చెప్పు కోవడాన్ని వందలాది మంది కార్యకర్తలు చూశారు. కానీ తన పార్టీ కార్యాలయం వెలుపలే పెద్ద సంఘటన జరిగినా, జగన్‌కు మాత్రం తెలియలేదని సమాచారం. ఒకవేళ జగన్‌కు తెలిసి కూడా, ఇంకా అలాంటి వ్యక్తిని పార్టీలో పెట్టుకున్నారంటే, అంతకంటే అన్యాయమైంది మరొకటి వుండదనే మాట వినిపిస్తోంది.
అరె ఎంకి ఎదవ!! ప్రపంచం మొత్తం ja*** గాడి చుట్టూ తిరగదు, అది గుర్తు పెట్టుకో!! నువ్వు నీ రాతలు!!
Nagarjuna yadav
Intha story rasina vadivi , Peru rayadaniki vucha neeku… Readers ke name cheppaleni vadivi neevu, Mari veru Vallu Anna ki enduku cheppali
దళితుల మీద దౌర్జన్యం చేసి, హింసించి, చంపడం మాకు దేవుడిచ్చిన హక్కు.. ఇలాంటివి మా పార్టీ లో usual గా రోజూ జరిగేవే.. కర్మ కాలి ఈరోజు బైటకి వచ్చింది.. ఇదంతా చంద్రబాబు కుట్ర, లోకేష్ red book రాజ్యాంగం, లెవెనం మొగుడు పవన్ కళ్యాణ్ కుతంత్రం..
Dr సుధాకర్
Driver సుబ్రహ్మణ్యం
శిరోమండనం
ఇదంతా లెవెనం మొగుడు పవన్ కళ్యాణ్ కుతంత్రం..
YSRCP పైన దళితుల్లో ఆగ్రహం అని heading పెట్టలేదేంటి ?
లెవెనన్నాయ్.. ఇదంతా చంద్రబాబు కుట్ర.. అంటూ x లో ఏరగు .. లేకపోతే చాలా డ్యామేజ్ జరిగేటట్టు ఉంది.
ఆ ఏముంది లెబ్బా మా పార్టీ లో ఇవన్నీ మామూలే.. రోజూ జరిగేవే.. లైట్ తీస్కో. ఇది Y ఛీ పి రాజ్యాంగం
అసలు అవన్నీ మనకు అవసరమా…డబ్బుల మూటలు లెక్కోసుకోడానికే టైం ఉండట్లేదు….
పార్టీ రాజ్యాంగం అనుసరిస్తూ మా రెడ్డి నాయకులు, దళితులని భూతులు తిట్టి, అవమానించి, చెప్పుతో కొడితే మెచ్చుకోవాల్సింది పోయి, శాలువా కప్పి సన్మానించాల్సింది పోయి , అవార్డు గివార్డ్ ఇవ్వాల్సింది పోయి, ఇదేందయ్యా ఇది.. అందరూ నామీద పడి బట్టలూడదీస్తుండారూ, ఏదేదో చెయ్యమంటున్నారూ ?? న్యాయమా అని అడుగుతు0డా..??
It seems this message is provoking message…. Don’t respond to this …. It is sure he is TDP activist
‘రే అవినాషు .. ఎక్కడున్నవావ్ రా ?? నీకు పొద్దుమూకలు దానితోనే పనా??ఇటు రారా… నన్ను కలవడానికి పురం నుండి మన బానిస సంత వచ్చుండారు.. నేనేంది వాళ్లేంది అందుకే.. వాళ్ళను ఆ బాత్రూం కాడ ఉండమని ఆర్డర్ ఏసాను..కొద్దిగా వాళ్ళ పని సూడు ..
ఆ యువ నాయకుడు నాగార్జున యాదవ్
జగనన్న 29 మీకు అంతా మంచి జరుగుతుంది కానీ మీరు ముందు మీ దగ్గర పెద్ద పెద్ద పదవులు పొంది మీకు వెన్నుపోటు పొడిచిన గుంట నక్కలు దూరం పెట్టాలి.మీ దగ్గర ఒక్కొకడు 4.5పదవులు పొంది మీకు వెన్నుపోటు పొడిచిన దొంగనాయల్లను నమ్మితే మీకు 24ఫలితాలు వస్తాయి…అందులో సందేహాo లేదు… మీరు ఎప్పుడూ సీఎం గా ఉండాలని అని కోరుకుంటున్నాను తర్వాత మీ ఇష్టం జగనన్న…..
నీకు చాలా పె..ద్ద కోరికలున్నాయే
రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన ఏం ఉపయోగం లేదు.. జగనన్న పాలన రుచి చూశారు నీకో దణ్ణం అంటు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు.రెండోసారి అధికారంలోకి రావాలంటే జగనన్న లో చాలా మార్పులు రావాలి.. రాజశేఖరరెడ్డి తరహాలో పార్టీ నాయకులను తయారుచేయాలి.అలా చేయటం జగనన్న వల్ల సాధ్యం కాదు.. ద్రోహం చేసేవారిని దూరం చేసుకోలేడు వారి చేతిలో బందీ అయ్యాడు కాబట్టి..మీ కోరిక నేరవేరే ఛాన్స్ లేదు గాక లేదు..
హతవిధీ .. ఏమిటీ ఖర్మ.. పార్టీ కార్యాలయంలో జరిగిన సంఘటనలకు కూడా సీసీ ఫుటేజీ లు చూడాల్సి వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి ఎలావుందో అర్ధం అవుతుంది.
అసలు పార్టీ పెట్టినా వాడికే మనుషుల అంటే అసహ్యం. ఇంకా తన కులం కానీ వాళ్ళని మనుషుల కింద లెక్క వేయదు.
Nagarjuna Yadav alias Nagarjunamma