ట్రోల్స్ కు పాల్పడేవాళ్లు టెర్రరిస్టులంట

యూట్యూబ్ లో వస్తున్న ట్రోలింగ్ వీడియోస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గట్టిగా ఫోకస్ పెట్టింది. సెలబ్రిటీలపై వ్యక్తిగత స్థాయిలో ట్రోలింగ్ కు పాల్పడే 25 యూట్యూబ్ ఛానెల్స్ ను ఇప్పటికే టెర్మినేట్ చేసింది…

యూట్యూబ్ లో వస్తున్న ట్రోలింగ్ వీడియోస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గట్టిగా ఫోకస్ పెట్టింది. సెలబ్రిటీలపై వ్యక్తిగత స్థాయిలో ట్రోలింగ్ కు పాల్పడే 25 యూట్యూబ్ ఛానెల్స్ ను ఇప్పటికే టెర్మినేట్ చేసింది అసోసియేషన్.

మరో 200 ఛానెళ్ల లిస్ట్ ను తయారు చేసింది. ఆ జాబితాను తెలంగాణ డీజీపీకి అందించింది. ఇలా ట్రోల్స్ చేసేవాళ్లను టెర్రరిస్టులతో పోల్చాడు ‘మా’ ప్రతినిధి శివబాలాజీ.

“ఈ ట్రోల్స్ చేసేవాళ్లను నేను టెర్రరిస్టులంటాను. వాళ్లు పుడుతూనే ఉంటారు. ఒక ఛానెల్ డౌన్ చేస్తే, మరో ఛానెల్ పెడతారు. మేం ఆల్రెడీ దిగాం కాబట్టి, ఇక రోజూ ఫైట్ చేస్తూనే ఉంటాం. ట్రోల్స్ ద్వారా ఎక్కువ వ్యూస్, సబ్ స్క్రైబర్లు పొందిన ఛానెల్స్ ను ముందుగా టెర్మినేట్ చేస్తున్నాం. అసోసియేషన్ లో సెపరేట్ గా వింగ్ పెట్టుకొని పని చేస్తున్నాం. ఈ నెలాఖరుకు మరిన్ని ఛానెల్స్ ను డౌన్ చేస్తాం.”

ఇకపై పోలీస్ డిపార్ట్ మెంట్ లోని సైబర్ సెల్ తో సమన్వయం అవుతూ పనిచేయబోతోంది ‘మా’ అసోసియేషన్. దీనికి సంబంధించి ఓ కో-ఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటుచేయబోతోంది.

హనుమంతు ఇష్యూ జరిగిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్రోలింగ్ వీడియోస్, డార్క్ కామెడీ వీడియోస్ ను సీరియస్ గా తీసుకుంది. ఏ ఛానెల్ లోనైనా అలాంటి వీడియోస్ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ‘మా’.

One Reply to “ట్రోల్స్ కు పాల్పడేవాళ్లు టెర్రరిస్టులంట”

Comments are closed.