అఖిల్ వదిలేసుకున్న చాన్స్

రెండో సినిమాపై ఈరోజుకు ఫిక్స్ కాలేకపోతున్నాడు హీరో అఖిల్. వంశీ పైడిపల్లి లాంటి మంచి దర్శకుడు, పెద్ద దర్శకుడు అందుబాటులోకి వచ్చినా, ఎందుకో వదిలేసుకున్నాడు. నిన్న మొన్నటి దాకా ఊిగిసలాటలో వున్న వంశీ పైడిపల్లి…

రెండో సినిమాపై ఈరోజుకు ఫిక్స్ కాలేకపోతున్నాడు హీరో అఖిల్. వంశీ పైడిపల్లి లాంటి మంచి దర్శకుడు, పెద్ద దర్శకుడు అందుబాటులోకి వచ్చినా, ఎందుకో వదిలేసుకున్నాడు. నిన్న మొన్నటి దాకా ఊిగిసలాటలో వున్న వంశీ పైడిపల్లి ఇప్పుడు ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. 

ఓ మంచి మీడియం రేంజ్ లవ్ సినిమాను అందించాలని వంశీ పైడిపల్లి ఆలోచిస్తున్నట్లు వినికిడి. అఖిల్ ఏమో రీమేక్ కావాలన్నాడు. వంశీకి తన కథ మీద తనకు నమ్మకం. అందుకే ఇప్పుడు వేరే సరైన హీరో కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అఖిల్ మంచి చాన్స్ మిస్ అయినట్లే కదా? 

ఇప్పటికిప్పుడు అఖిల్ కు పెద్ద డైరక్టర్లు ఎవరూ అందుబాటులో లేరు. కొరటాల శివ, బోయపాటి, శేఖర్ కమ్ముల, శ్రీనువైట్ల, పూరి జగన్నాధ్ ఇలా అందరూ బిజీనే. హరీష్ శంకర్ లాంటి ఒకరిద్దరు మిగిలారంతే. మరి అఖిల్ ఎత్తి ఎత్తి కాలు ఎక్కడ వేస్తాడో చూడాలి.