తమ్ముడు పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టడంతో చిరంజీవి అభద్రతా భావానికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ పార్టీ పెడితే ఎక్కడ అభిమానులంతా అటెళ్లిపోతారో అని చిరంజీవి భయపడిపోతున్నాడు. రాజకీయ నాయకుడిగా రంగ ప్రవేశం చేసిన తర్వాత తప్పు మీద తప్పు చేసి గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న చిరంజీవి తనకి ఎదురుగా తమ్ముడు నిలబడడాన్ని తట్టుకోలేకపోతున్నాడు.
పవన్‌కి సహకారాలు అందించరాదని చిరంజీవి అభిమాన సంఘాలు అన్నిటికీ ఆదేశాలు వెళ్లడం ఆయనకి ఉన్న ఇన్సెక్యూరిటీని తెలియజేస్తోంది. అయితే పవన్ ఇమేజ్ ఇప్పుడు చిరంజీవి కంట్రోల్ చేస్తే తగ్గిపోయే లెవల్ దాటిపోయింది. చిరంజీవి వేదికపై ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కోసమే అభిమానులు ఆరాట పడడం ఎన్నోసార్లు చూసాం.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి ఇమేజ్ డౌన్ అయిపోగా, పవన్ ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయాడు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో చేసిన దానికి నిజానికి ఇప్పుడు పవన్ పార్టీ పెడితే ఎవరూ పట్టించుకోకూడదు. కానీ చిన్న, పెద్ద అందరూ పవన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అతని ఆవిర్భావ సభకి వాడవాడలా వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే ఎన్నో విధాలుగా తన స్థాయి తగ్గించుకున్న చిరంజీవి ఇప్పుడు తమ్ముడిని కట్టడి చేయాలని చూస్తే మరింతగా అది పడిపోవడం తప్ప ఒరిగేదేం ఉండదు.