‘మెగా’ అంచనాల్ని నిలబెట్టుకుంటాడా.!

కుర్రాడెలాగుంటాడు.? అని మెగా అభిమానులంతా టెన్షన్‌గా ఎదురు చూశారు నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ గురించి. వరున్‌తేజ తెరంగేట్రం చేస్తున్నాడన్న వార్త తెలియగానే ఒకటే ఉత్కంఠ. ఆ ఉత్కంఠకు తెరపడిరది.. కుర్రాడు బాగానే వున్నాడు..…

కుర్రాడెలాగుంటాడు.? అని మెగా అభిమానులంతా టెన్షన్‌గా ఎదురు చూశారు నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ గురించి. వరున్‌తేజ తెరంగేట్రం చేస్తున్నాడన్న వార్త తెలియగానే ఒకటే ఉత్కంఠ. ఆ ఉత్కంఠకు తెరపడిరది.. కుర్రాడు బాగానే వున్నాడు.. బాగున్నాడు.. చాలా బాగున్నాడు.. అంటూ ఫస్ట్‌ లుక్‌ బయటకొచ్చాక కామెంట్స్‌ విన్పించాయి.

‘ముకుంద’ సినిమాలో నటిస్తున్న వరుణ్‌తేజ, ఆ సినిమా స్టిల్స్‌లోనూ దర్శనమిస్తున్నాడు. సినిమా లుక్‌కి ముందు క్లాస్‌గా కన్పించిన వరుణ్‌, సినిమాలో మాస్‌ లుక్‌తో దర్శనమిచ్చాడు. పెదనాన్న చిరంజీవి అయితే, ‘వరుణ్‌తేజ రూపంలో తెలుగు సినిమాకి మరో అందగాడు దొరికాడు’ అనేశారు. డాన్సుల్లోనూ, ఫైట్స్‌లోనూ ఇప్పటికే శిక్షణ తీసుకున్న వరుణ్‌, మెగా ఫ్యామిలీలో మరో మెగా హీరో అన్పించుకునేలా వున్నాడంటూ ‘ముకుంద’ యూనిట్‌ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇలా.. వరుణ్‌తేజపై భారీ అంచనాలున్నాయి. చిరంజీవి డాన్సులు దున్నేస్తే, పవన్‌కళ్యాణ్‌ మేనేజ్‌ చేసేశాడు. అల్లు అర్జున్‌, చరణ్‌ డాన్సుల్లో తమకు ఎదురే లేదన్పించేసుకున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్‌పై చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ వుంటాయి. సాయిధరమ్‌తేజ కూడా డాన్సులు అద్భుతంగా చేశాడని అతని సినిమా ట్రెయిలర్స్‌తోనే స్పష్టమయ్యింది గనుక, వరుణ్‌ డాన్సులూ ఓ రేజ్‌లో వుంటాయని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు.

మరి, ఇన్ని అంచనాల్ని వరుణ్‌తేజ నిలబెట్టుకుంటాడా.? వేచి చూడాల్సిందే.