Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫిజిక్ మీద పవన్ దృష్టి

ఫిజిక్ మీద పవన్ దృష్టి

అజ్ఞాతవాసి సినిమా తరువాత మళ్లీ కెమేరా ముందుకు రాలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కోట్ల ఆదాయాన్ని వదులుకుని, రాజకీయాల్లోకి వచ్చానని పదే పదే చెప్పారు. దానికి తగినట్లే, తన శరీరాకృతిని పట్టించుకోకుండా రాజకీయాల్లో తిరిగారు. జుట్టు, గెడ్డం భారీగా పెంచారు. దానికి తగినట్లు బాడీ కూడా కాస్త పెరిగింది.

డిసెంబర్ నుంచి మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తారని టాక్ అయితే వుంది. సినిమాలు చేయకుంటే పవన్ కు ఆదాయం ఎలా? అని ఆయన సన్నిహితులు కూడా అంటున్నారు. త్రివిక్రమ్-కొరటాల శివ ఇలా కాస్త పేరున్న డైరక్టర్లతో సినిమా చేయాలని పవన్ కు కూడా వున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తన శరీరాకృతిని మళ్లీ సరిదిద్దుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఆధునిక జిమ్ పరికరాలకు పవన్ ఆర్డర్ ఇచ్చారని, ఇవి బెంగుళూర్ నుంచి రావాల్సి వుందని తెలుస్తోంది. వీటి ద్వారా కాస్త సన్నబడడం, అక్కర్లేని చోట్ల పేరుకున్న ఫ్యాట్ ను కరిగించుకోవడం వంటివి సాధ్యమవుతాయని టాక్.

మొత్తం మీద పవన్ తన శరీరాకృతి మీద దృష్టి పెట్టడం ఆయన అభిమానులకు కచ్చితంగా సంతోషం కలిగించేవారే.

గెడ్డం మొక్కు?

పవన్ ఎన్నికల సందర్భంగా విపరీతంగా గెడ్డం, జుట్టు పెంచారు. అయితే జుట్టు మాటేమో కానీ, గెడ్డం మాత్రం దేవుడి మొక్కు అని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తనను కలిసిన కొందరి దగ్గర ప్రస్తావించారని బోగట్టా. ఏ మొక్కు, ఏ గుడి, ఏ దేముడు అన్నది చెప్పలేదు కానీ, జస్ట్ మొక్కు అని మాత్రం పవన్ అన్నట్లు తెలుస్తోంది.

అంటే 23 తరువాత ఎప్పుడైనా పవన్ క్లీన్ షేవ్ తో నీట్ గా కనిపించే అవకాశం వుందన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?