హీరోలకు ఫ్లాప్స్ వస్తే ఏం చేస్తారు. సక్సెస్ కోసం వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కొంతమంది. మరికొంతమంది మాత్రం గ్యాప్ తీసుకుంటారు. బన్నీ అలానే గ్యాప్ తీసుకున్నాడు. 1 నెల, 2 నెలలు కాదు.. ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకున్నాడు.
మరి ఈ ఏడాది గ్యాప్ లో అతడు ఏం చేశాడు. ఆ తర్వాత తిరిగి ఎలా సక్సెస్ సాధించాడు. తాజాగా ఈ విషయాల్ని బన్నీ బయటపెట్టాడు.
నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత ఇతరుల సలహాలు వినడం మానేశాడట అల్లు అర్జున్. తన మనసు చెప్పింది మాత్రమే వినాలనుకున్నాడట. అందుకే తనతో తాను గడిపేందుకు 6 నెలలు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆ గ్యాప్ లో తనతో తాను చాలా మాట్లాడుకున్నాడట. ఆత్మశోధన చేసుకున్నాడట. తమలో దాగున్న ప్రొఫెషనల్ కోచ్ ను నిద్రలేపాడట. అంతరాత్మకు మించిన ఉత్తమ గురువు మరొకరు లేరని, ప్రతి ఒక్కరు తమ అంతరాత్మ మాట వినాలని చెబుతున్నాడు బన్నీ.
తను అలా తనతోతాను మాట్లాడుకొని, స్వీయ మార్గదర్శనం చేసుకొని, ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత పుష్ప-1, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు.
ఆత్మశోధన ద్వారా తనను తాను మెరుగు పరుచుకున్నానని, ప్రతి ఒక్కరు తమతోతాము గడిపేందుకు సమయాన్ని కేటాయించాలంటున్నాడు బన్నీ.
hit vachaka emaina cheppochu. cricket lo koodaa 100 kottagaane evevo kaburlu chepthaaru. next duckout aithe noru medaparu.
Nuvvu oka hit kotti chepparadu….
Chetilo oka phone unna prati okkadu comment petteyadame
మరి ఆ సినిమా ట్రైలర్స్ లో, సినిమాలో ఊరికే ఊదరగొట్టారు “గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది” అని?