ఏడుపులు, డ్రామాలూ… బాబోయ్ బిగ్ బోర్!

బిగ్ బాస్ అనేది ఒక పదిహేను, పదహారు మంది వివిధ రంగాల్లో కాస్త పేరొందిన కొందరు కలిసి ఒకే ఇంట్లో వంద రోజుల పాటు కలిసి కెమెరాల నడుమ జీవించాల్సిన రియాలిటీ షో. పక్కింటి…

బిగ్ బాస్ అనేది ఒక పదిహేను, పదహారు మంది వివిధ రంగాల్లో కాస్త పేరొందిన కొందరు కలిసి ఒకే ఇంట్లో వంద రోజుల పాటు కలిసి కెమెరాల నడుమ జీవించాల్సిన రియాలిటీ షో. పక్కింటి విశేషాలు తెలుసుకునే సగటు మనిషి కుతూహలానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ షో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ పాపులరయింది. ఇంగ్లీష్, హిందీ భాషలలో ఈ షో రచ్చ రచ్చగా వుంటుంది. 

దక్షిణాదికి వచ్చేసరికి సదరు షో స్వరూపమే మారిపోయింది. ఇక్కడ ఆటలో ఆడ, మగ తేడా వుండదు… గెలుపుకోసం ఏదైనా ఓకే అన్న తీరు అటు ఆటాడుతోన్న వారిలో కానీ, ఇటు చూస్తోన్న ప్రేక్షకులలో కానీ లేదు. హౌస్ లోపలకు వెళ్లిన వారిలో గెలుపు కంటే ఎక్కడ బ్యాడ్ అవుతామోననే భయమే ఎక్కువ వుంది. దీనిని కొందరు లేడీ కంటెస్టెంట్లు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. 

తాకరాని చోట తాకాడనో, ఆడవాళ్ల మీద జులుం ప్రదర్శిస్తున్నాడనో, లేదా సాటి కంటెస్టెంట్ల పట్ల టాస్కుల సమయంలో కర్కశంగా వ్యవహరిస్తున్నారనో వివిధ రకాలుగా కెమెరాల ముందు నటన ప్రదర్శిస్తున్నారు. దీంతో అవినాష్ లాంటి పాపులర్ కమెడియన్ కూడా గెలుద్దామనే తపన కంటే ఎక్కడ జనం దృష్టిలో బ్యాడ్ అవుతాననే భయంతో వణికిపోయేవాడు. ఆ భయంతోనే ఎలిమినేట్ కూడా అయిపోయాడు. 

ఏడిస్తే ఓట్లు వేస్తారని, డ్రామా చేస్తే ప్రేక్షకులు ఫూల్ అవుతారని ఎవరికి వారు తమకు తోచిన ఎత్తులు వేసి ఈ షో తాలూకు అసలు ఉద్దేశాన్ని మార్చేసారు. కఠినమైన టాస్కులతో క్యారెక్టర్ టెస్ట్ చేయాల్సిన ఈ షోని తెలుగు నిర్వాహకులు కూడా ‘పట్టుకుంటే పట్టుచీర’ తరహా గేమ్ షోగా మార్చి పారేసారు. 

హిందీలో దాదాపు పదిహేనేళ్లుగా సాగుతోన్న ఈ షో అక్కడెలా వుంటుందో, ెస్ట్ ఎలా మాట్లాడతాడో, లోపలకు వెళ్లిన కంటెస్టెంట్లు ఎంత ఎక్సయిట్‌మెంట్ ఇస్తారో ఒక్కసారి నిర్వాహకులు, ఆటగాళ్లు కూడా తర్కించుకుంటే ఉత్తమం.

మ‌రో జోస్యం వ‌దిలిన స‌బ్బం