ఏం లేకున్నా మేకోవర్ అనే పదం వాడేయడం అభిమానులకు కామన్ గా మారిపోయింది. మొన్నటికిమొన్న రామ్ చరణ్ ఫొటోలు కొన్ని బయటకొచ్చాయి. అతడి మేకోవర్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు. ఎప్పట్లానే గడ్డంతో కనిపించాడు చరణ్. అందులో కొత్తదనం ఏముందో ఫ్యాన్స్ కే తెలియాలి.
ప్రస్తుతం ఈ హీరో ఓ యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. దాని కోసం కూడా అతడేం కొత్తగా తయారవ్వలేదు. ఎప్పట్లానే కనిపిస్తున్నాడు. బుచ్చిబాబు సినిమా కోసం బాగా మారిపోతున్నాడనే ప్రచారం జరిగింది. గడ్డం పెంచడం తప్ప, కొత్తగా ఏం కనిపించలేదక్కడ.
ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే ప్రచారం నడుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయాడని, అతడి కొత్త లుక్ అదిరిపోయిందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి తారక్ లో కొత్తదనం ఏదీ కనిపించలేదు.
విజయ్ దేవరకొండ సినిమా ప్రోమోకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ సందర్భంగా విజయ్-తారక్ ఫొటోలు బయటకొచ్చాయి. అందులో తారక్ చాలా కొత్తగా ఉన్నాడని, కొత్త సినిమా కోసం అద్భుతంగా తయారయ్యాడని ఫ్యాన్స్ ఊదరగొడుతున్నారు. కానీ అక్కడేం లేదు.
మేకోవర్ అంటే కళ్లకు కొట్టొచ్చినట్టు కనిపించాలి. గుండు కొట్టించుకోవాలి లేదా భారీగా జుట్టయినా పెంచాలి. క్లీన్ షేవ్ లోకి మారాలి లేదా గుబురుగా గడ్డమైనా పెంచాలి. పోనీ శారీరకంగా చూసుకుంటే సిక్స్ ప్యాక్ అయినా కనిపించాలి, బక్కపల్చగానైనా మారిపోవాలి. ఇలాంటివి చేసినప్పుడే కదా మేకోవర్ కనిపిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లో అలాంటివేం కనిపించలేదు ప్రస్తుతానికి.
దాన్నే భజన అంటారు..
అయినా మనకు కొత్తేమీ కాదు కదా..
జగన్ రెడ్డి బెంగుళూరు టూ గన్నవరం.. ప్రతి వారం వస్తాడు.. ప్రతి సారి వైసీపీ సోషల్ మీడియా హడావుడి చూడాలి..
..
మంగళవారం..
బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో …పులివెందుల సింహం బయల్దేరింది..
గన్నవరం ఎయిర్పోర్ట్ లో.. పులివెందుల సింహం ఆంధ్ర లో అడుగు పెట్టింది.. జగనన్న కు ఘన స్వాగతం..
మళ్ళీ శుక్రవారం..
గన్నవరం ఎయిర్పోర్ట్ లో.. పులివెందుల సింహం గర్జన.. టీడీపీ నాయకుల్లో వణుకు..
బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో.. ఎవడికీ తెలీదు.. చీకట్లో కలిసిపోతాడు..
..
మళ్ళీ మంగళవారం పొద్దున్న బ్రష్ చేసుకుని.. సేమ్ రిపీట్..
ఈ ఆర్టికల్ లో కూడా ఇంత మేకోవర్ ఉందా!






mahesh babu makeover for SSMB29
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
సరిగ్గా చెప్పారు
Maku teleyedhu