గేమ్ ఛేంజర్ కు ఆ సమస్య లేదు

ఓ పెద్ద సినిమా విడుదల వాయిదా పడిందంటే, ఓటీటీతో సమస్య. ఆల్రెడీ అగ్రిమెంట్ లో ఓ డేట్ ఉంటుంది, రిలీజైన తర్వాత 4 వారాలు లేదా 6 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తామంటూ అందులో…

ఓ పెద్ద సినిమా విడుదల వాయిదా పడిందంటే, ఓటీటీతో సమస్య. ఆల్రెడీ అగ్రిమెంట్ లో ఓ డేట్ ఉంటుంది, రిలీజైన తర్వాత 4 వారాలు లేదా 6 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తామంటూ అందులో క్లియర్ గా రాస్తారు. సినిమా పోస్ట్ పోన్ అయినప్పుడు, ఈ తలనొప్పులుంటాయి. రేటు తగ్గించుకోవడం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి.

ఈ లెక్కన చూసుకుంటే గేమ్ ఛేంజర్ విషయంలో నిర్మాత దిల్ రాజు చాలా నష్టపోయి ఉండాలి కదా. మూడేళ్లుగా నడుస్తున్న సినిమా. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు. ఈమధ్య కూడా క్రిస్మస్ అని చెప్పి సంక్రాంతికి వాయిదా వేశారు.

మరి ఓటీటీతో దిల్ రాజుకు సమస్యలు లేవా..? గేమ్ ఛేంజర్ విషయంలో దిల్ రాజుకు నిజంగానే ఆ సమస్య లేదు. ఎందుకంటే, స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న జీ గ్రూప్, ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి కూడా.

ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ తో పాటు, థియేట్రికల్ రిలీజ్ లో కొంత వాటా కోసం జీ గ్రూప్ (జీ స్టుడియోస్ పేరిట) అగ్రిమెంట్ చేసుకుంది. ఈ మేరకు అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికే భారీ మొత్తాన్ని దిల్ రాజుకు అందించిన సదరు సంస్థ… థియేట్రికల్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే తప్ప, దిల్ రాజును ప్రశ్నించలేదు.

ఇలా రిలీజ్ తో ముడిపడిన అగ్రిమెంట్ కాబట్టి, గేమ్ ఛేంజర్ ఎన్నిసార్లు వాయిదా పడినా దిల్ రాజుపై ఆ ప్రభావం ఉండదు. మిగతా ఓటీటీ సంస్థలు ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవు. కాబట్టి విడుదల తేదీకి, స్ట్రీమింగ్ డేట్ కు మధ్య తేడా వస్తే డబ్బుల్లో కోత పడుతుంది.

4 Replies to “గేమ్ ఛేంజర్ కు ఆ సమస్య లేదు”

  1. ఒరేయ్ గ్రేట్ ఆంధ్ర గే అనుకున్న రా నువ్వు మెగా కుక్క వి అని…. నీ అబ్బ మా దేవర ని చాలా నెగటివ్ చేసావ్ రా నువ్వు… నీ డేట్ చేంజర్ ని పట్టించుకోం

Comments are closed.