వ్య‌తిరేక క‌థ‌నాల్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌న్న చంద్ర‌బాబు

టీడీపీ అనుబంధ మీడియాలో కూట‌మి స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా వ‌స్తున్న క‌థ‌నాల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో కీల‌క…

టీడీపీ అనుబంధ మీడియాలో కూట‌మి స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా వ‌స్తున్న క‌థ‌నాల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. స‌మావేశం అనంత‌రం కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు చంద్ర‌బాబుతో నేరుగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా “మ‌న” అనుకునే ప‌త్రిక‌ల్లో కూట‌మి స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు వ‌స్తున్న విష‌యాన్ని చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.

సొంత మీడియాలోనే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌రుస క‌థ‌నాలు వ‌స్తుండ‌డంతో చెడ్డ పేరు వ‌స్తుంద‌నే ఆందోళ‌న‌ను బాబు ఎదుట వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఆ క‌థ‌నాల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, మీ ప‌ని మీరు చేసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెప్పాయి. దీంతో అనుకూల మీడియాలో త‌మ‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు వ‌స్తే, చంద్ర‌బాబు సీరియ‌స్ అవుతార‌నే భ‌యం వాళ్ల‌లో పోయింది.

త‌మ‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చే క‌థ‌నాల్ని అస‌లు ప‌ట్టించుకోవ‌ద్ద‌నే నిర్ణ‌యానికి టీడీపీ ప్రజాప్ర‌తినిధులు వ‌చ్చారు. చంద్ర‌బాబు మ‌న‌సులో మాట తెలియ‌డంతో మీడియా క‌థ‌నాల‌పై టీడీపీ ప్రజాప్ర‌తినిధులు గ‌ట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక‌పై త‌మ గురించి ఎంత తీవ్ర‌మైన వ్య‌తిరేక క‌థ‌నాలు రాసినా, ఏమీ కాద‌నే ధైర్యం వాళ్ల‌లో వ‌చ్చింద‌న్న‌ది నిజం.

7 Replies to “వ్య‌తిరేక క‌థ‌నాల్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌న్న చంద్ర‌బాబు”

  1. పలచన అయ్యేది జనాల్లో… అధినేత దృష్టిలో ఐతే ఎంత… అవకపోతే ఎంత… ఎంత పలచన ఐతే అంత లోతున గొయ్యి తవ్వి పాతేస్తారు జనాలు. తరువాత వాడికంటే పరమ నికృష్టుడిని ఎన్నుకుంటారు.

Comments are closed.