సంప‌ద సృష్టిక‌ర్త బీద అరుపులు!

ఎన్నిక‌ల‌కు ముందు సంప‌ద సృష్టించి, జ‌గ‌న్ ప్ర‌భుత్వం కంటే ఎక్కువ సంక్షేమ ల‌బ్ధిని క‌లిగిస్తాన‌ని ఇష్టానుసారం హామీలిచ్చిన చంద్ర‌బాబు, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు చెప్ప‌డం ఏంట‌ని జ‌నం నిల‌దీస్తున్నారు.

త‌మ ఇబ్బందుల్ని ప్ర‌భుత్వ దృష్టికి ప్ర‌జ‌లు తీసుకెళ్తుంటారు. వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని పాల‌కులు హామీ ఇస్తుంటారు. నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉన్న స‌మ‌స్య‌ల్ని పరిష్క‌రిస్తుంటారు. స‌హ‌జంగా ఏ రాష్ట్రంలో అయినా ఇదే జ‌రుగుతుంటుంది.

త‌మ ఇబ్బందుల్ని ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని పాల‌కులు త‌మ పార్టీ నాయ‌కుల‌కు చెప్ప‌రు. ప్ర‌భుత్వ‌మే త‌మ ఇబ్బందుల్ని ప్ర‌జ‌ల‌తో మొర పెట్టుకుంటే, ఇక ఓట్లు వేసి గెలిపించినోళ్లంతా ఎక్క‌డికి వెళ్లాలి? త‌మ గోడును ఎవ‌రికి చెప్పుకోవాలి?… ఇప్పుడీ ప్ర‌శ్న‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం నుంచి వ‌స్తున్నాయి.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్‌ ఇన్‌చార్జులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కాఫీ కబుర్లు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్‌ ఇన్‌చార్జులతో చంద్రబాబు మాట్లాడారు. కార్య‌క‌ర్త‌ల్ని ఆర్థికంగా బ‌లోపేతం చేసేందుకు ఈ-3 (ఎథిక‌ల్ ఎక‌న‌మిక్ ఎంప‌వ‌ర్‌మెంట్‌) అనే కొత్త విధానాన్ని తీసుకొస్తాన‌ని చంద్ర‌బాబు అన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల రాయితీలు ఇప్పిండం ద్వారా కార్య‌క‌ర్త‌ల్ని పారిశ్రామిక‌వేత్త‌లుగా త‌యారు చేస్తాన‌ని భ‌రోసా క‌ల్పించారు.

ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. ఏ పార్టీకైనా కార్య‌క‌ర్త‌లే బ‌లం. వాళ్ల‌లో న‌మ్మ‌కం స‌డ‌లితే రాజ‌కీయంగా చాలా ఇబ్బందులు వ‌స్తాయి. 2014-19 మ‌ధ్య కాలంలో ప‌రిపాల‌న‌పై దృష్టి సారించి, కార్య‌క‌ర్త‌ల్ని విస్మ‌రించాన‌ని, అందుకు 2019 ఎన్నిక‌ల్లో భారీ మూల్యం చెల్లించుకున్న‌ట్టు చంద్ర‌బాబు ప‌లుమార్లు చెప్పారు. కార్య‌క‌ర్త‌ల్ని ఎప్ప‌టికీ విస్మ‌రించ‌న‌న్నారు.

2024లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఏ మాత్రం సంతోషంగా లేరు. కేవ‌లం మంత్రులు, ఎమ్మెల్యేలే బాగుప‌డుతున్నార‌ని, చిన్న‌చిన్న ప‌నులు కూడా చేయ‌డం లేద‌ని కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో వారి మ‌న‌సెరిగి చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల‌కు ఆర్థిక భ‌రోసా ఇచ్చేలా ఊర‌డించే మాట‌లు చెప్పారు.

ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబు చేసిన మ‌రో కామెంట్ అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. క్షేత్ర‌స్థాయిలో సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో పాటు ప్ర‌భుత్వం ప‌డుతున్న ఆర్థిక ఇబ్బందుల్నీ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మయ్యేలా చెప్పాల‌ని క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జ్‌ల‌కు చంద్రబాబు సూచించారు. దీని అర్థం ఏంటో చంద్ర‌బాబుకే తెలియాలి.

బ‌హుశా చంద్ర‌బాబు నోట ఈ మాట విన్న‌ప్పుడు క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జ్‌లు ఆశ్చ‌ర్యానికి గురై వుంటారు. ఇప్ప‌టికే సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల‌కు సంబంధించి కొన్ని అమ‌లుకు నోచుకోక‌పోవ‌డం తీవ్ర ప్ర‌జాగ్ర‌హానికి గురి అవుతోంది. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్టు పింఛ‌న్‌ను రూ.30 వేల నుంచి రూ.4 వేలకు చంద్ర‌బాబు స‌ర్కార్ పెంచింది. అయితే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఇంత వ‌ర‌కూ ఒక్క‌టంటే ఒక్క కొత్త పింఛ‌న్‌ను కూడా మంజూరు చేయ‌లేదు.

నెల‌కు రూ.4 వేలు పింఛ‌న్ కావ‌డంతో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ ఆశించే ప‌రిస్థితి. మ‌రోవైపు చంద్ర‌బాబు స‌ర్కార్ ఇదిగో, అదిగో అంటూ తీవ్ర కాల‌యాప‌న చేస్తోంది. రెండేళ్ల పాల‌న కూడా పూర్తి అవుతోంది. పింఛ‌న్ ఊసే ఎత్త‌క‌పోవ‌డంతో అర్హులైన వారంతా మండిప‌డుతున్నారు. 50 ఏళ్లు నిండితే చాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు పింఛ‌న్లు ఇస్తామ‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికారు. ఇప్పుడేమో త‌ప్పించుకుని పాల‌కులు తిరుగుతున్నారు.

అలాగే 18 ఏళ్లు నిండిన ప్ర‌తి మ‌హిళ‌కూ నెల‌కు రూ.1500 ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఆ ప‌థ‌కం కూడా అతీగ‌తీ లేదు. ప్ర‌తి ఏడాదీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌న్న హామీ కూడా పూర్తిస్థాయిలో నోచుకోవ‌డం లేదు. చాలా మందికి ప‌థ‌కం వ‌ర్తించ‌డం లేదు. ఈ విష‌య‌మై ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకునే దిక్కులేదు.

త‌ల్లికి వంద‌నం ప‌థ‌కానికి కూడా తూట్లు పొడిచారు. సీబీఎస్ఈ సిల‌బ‌స్ చ‌దువుతున్న విద్యార్థుల్లో చాలా మందికి అస‌లు ప‌రిగ‌ణ‌లోకే తీసుకోవ‌డం లేదు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ప‌థ‌కాలు అమ‌లుకు నోచుకోవ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆర్థిక ఇబ్బందుల్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డం అంటే, హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు కాదా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అంతేకాదు, హామీలు అమ‌లు చేయ‌లేమ‌ని చెప్పిన‌ట్టు కాదా? అని నిల‌దీస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు సంప‌ద సృష్టించి, జ‌గ‌న్ ప్ర‌భుత్వం కంటే ఎక్కువ సంక్షేమ ల‌బ్ధిని క‌లిగిస్తాన‌ని ఇష్టానుసారం హామీలిచ్చిన చంద్ర‌బాబు, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు చెప్ప‌డం ఏంట‌ని జ‌నం నిల‌దీస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా హామీల‌ను అమ‌లు చేయ‌లేర‌ని వైఎస్ జ‌గ‌న్ చెప్ప‌డాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. సంప‌ద సృష్టి ఏమైంద‌నే ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయ అవ‌స‌రాలు తీర్చుకున్న త‌ర్వాత‌, ప్ర‌జ‌ల్ని వంచించ‌డం చంద్ర‌బాబుకు అల‌వాటైంద‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు.

15 Replies to “సంప‌ద సృష్టిక‌ర్త బీద అరుపులు!”

  1. ja*** అనే లుచ్చా ని సపోర్ట్ చేసే నీ లాంటి బ్రొతలిజం చేసే bastards ఉన్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు!! 

  2. ja*** అనే లుచ్చా ని సపోర్ట్ చేసే నీ లాంటి బ్రొతలిజం చేసే bastards ఉన్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు!! 

  3. ja*** అనే లుచ్చా ని సపోర్ట్ చేసే నీ లాంటి బ్రొతలిజం చేసే bastards ఉన్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు!! 

  4. ja*** అనే లుచ్చా ని సపోర్ట్ చేసే నీ లాంటి బ్రొతలిజం చేసే bastards ఉన్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు!! 

  5. ja*** అనే లు*చ్చా ని సపోర్ట్ చేసే నీ లాంటి బ్రొ*తలిజం చేసే basta*rds ఉన్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు!! 

  6. నీ లాంటి వాళ్ల ఏడుపులు తో బాబు గారికి, కూటమికి దిష్టి పోతుంది రా శుంఠ !

  7. కుక్క మోహమోడా ఇలా వ్రాస్తే నీకు నక్కకి తేడా ఏముంది.  చిత్త కార్తే…..

  8. పద సృష్టికర్త అయిన చంద్రబాబుకే ఈ విధమైన పరిస్థితి కల్పించాడంటే మీ జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదయ్యో అంత అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు 

Comments are closed.