బాబు జ‌న్మ‌స్థలిలో చెవిరెడ్డి స్ఫూర్తిదాయ‌క పోరాటం!

అభ్య‌ర్థుల కోసం మోహిత్‌రెడ్డి వెతుక్కోవాల్సి వ‌చ్చింది. ఎవ‌రైనా ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తార‌ని తెలిస్తే, వెంట‌నే టీడీపీ నుంచి బెదిరింపు కాల్స్ వెళ్లేవి.

అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎలా నెట్టుకురావాలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసి చూపారు.

ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా ఎలా మార్చుకోవాలో చెవిరెడ్డికి బాగా తెలుసు. గెలుపుపై నమ్మకాన్ని కోల్పోకుండా తుదిదాకా పోరాడటంలోనూ చెవిరెడ్డి దిట్ట. వీటన్నింటినీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి రుజువు చేసుకున్నారాయ‌న‌.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జన్మస్థలమైన చంద్రగిరి గడ్డపైన నిలబడి రాజకీయాలు చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి టార్గెట్‌గానే వున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని కకావికలం చేసి, ఏకపక్షం చేసుకోవాలని అనుకున్న‌ అధికార పార్టీ ఎత్తులను చెవిరెడ్డి దీటుగా ఎదుర్కొంటున్నారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లే వేయలేని స్థితి నుంచి కూటమికి బలమైన పోటీ ఇచ్చేదాకా ఎన్నికల యుద్ధక్షేత్రంలో నిల‌బెట్టడంలో చెవిరెడ్డి చేసిన, చేస్తున్న కృషి ఆ పార్టీ నేతలకు స్ఫూర్తి అని చెప్పొచ్చు.

రాష్ట్రంలో చాలాచోట్ల జరిగినట్లే చంద్రగిరి నియోజక వర్గంలోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు మొద‌టిరోజు నామినేషన్లు వేయలేకపోయారు. ఒక అసెంబ్లీ స్థానాన్ని తలపించేలా వుండే తిరుపతి రూరల్ మండలంలోని 40 స్థానాలకు తొలిరోజు ఒక నామినేషన్ కూడా వైసీపీ వేయలేకపోయింది.

నామినేషన్లకు వెళ్లినవారిపై దాడులు చేయడం, నామినేషన్ పత్రాలు చించేయడం వంటి ఘటనలతో అధికార పార్టీ నేతలు బెంబేలెత్తించారు.

ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో చెవిరెడ్డి అనూహ్యంగా అభ్యర్థులతో కలెక్టర్ కార్యాలయం లోపల బైఠాయించారు. చేతిలో జాతీయ జెండాలు, అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని దీక్షకు కూర్చున్నారు. కలెక్టర్ దగ్గరుండి నామినేషన్లు వేయించాలని డిమాండ్ చేశారు.

రాత్రి దాకా ఈ బైఠాయింపు కొనసాగింది. ఆఖరికి పోలీసులు బలవంతంగా అందరినీ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా కుటుంబ సభ్యులు, అనుచరులతో బైఠాయించి ఆందోళన కొనసాగించారు.

దీంతో రెండో రోజు పోలీసులు, అధికార యంత్రాంగం దిగిరాక తప్పలేదు. వైసీపీ అభ్యర్థులందరూ నామినేషన్లు వేయగలిగారు. ఇదే గొప్ప విజయంగా నిలిచింది.

ఇక నామినేషన్ల పరిశీలనలో తిరుపతి రూరల్‌తో పాటు పలు మండలాల‌కు చెందిన వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయ‌న కుమారుడైన చంద్ర‌గిరి వైసీపీ ఇన్‌చార్జ్ మోహిత్ రెడ్డి తిరుపతి ఆర్డీవో కార్యాల‌యం ఎదుట బైఠాయించారు.

అదే విధంగా స్వయంగా న్యాయవాదైన‌ చెవిరెడ్డి నల్లకోటు ధరించి, తానే తన అభ్యర్థుల తరపున ఆర్డీవో వద్దకు అప్పీల్‌కు వెళతానంటూ పట్టుబట్టారు. దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. వందల మందిని మోహరించారు.

దీంతో అనివార్యంగా కొన్ని నామినేషన్లనైనా పునరుద్ధరించాల్సి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి చెవిరెడ్డి క్షేత్రస్థాయిలో దిగి పోరాటం సాగిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. ఇక కార్యకర్తలను తిరిగి ఏక‌తాటిపైకి ఎలా తెస్తారు? ఎలా ఉత్తేజప‌రుస్తారో అనే సందేహం అందరిలోనూ వుండేది.

ఈ దశలోనే స్థానిక ఎన్నికలు వచ్చాయి. తన కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేయడానికి ఈ ఎన్నికలను ఒక అవకాశంగా మార్చుకున్నారు.

వాస్తంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా చాలామంది కార్యకర్తలు వెనకడుగు వేస్తుండగా, అసలు అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలపగలరా అనే అనుమానం వ్యక్తమైంది.

అభ్య‌ర్థుల కోసం మోహిత్‌రెడ్డి వెతుక్కోవాల్సి వ‌చ్చింది. ఎవ‌రైనా ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తార‌ని తెలిస్తే, వెంట‌నే టీడీపీ నుంచి బెదిరింపు కాల్స్ వెళ్లేవి.

దీంతో మ‌న‌కెందుకులే అని చాలా మంది వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భ‌యంతో వెన‌క‌డుగు వేసే ప‌రిస్థితి. అయినా కార్యకర్తలు పదేపదే మంతనాలు జరిపి, ధైర్యం నింపి యుద్ధక్షేత్రంలోకి తీసుకురాగలిగారు.

నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చెవిరెడ్డి సాగిస్తున్న పోరాటం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. తానే క్షేత్రంలోకి దిగి, ముందు నిలబడిన‌ తీరు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చింది. అందువల్లే ఈ రోజు తిరుపతి రూరల్ మండలలో 40 ఎంపీటీసీ స్థానాలకుగాను 28 స్థానాల్లో పోటీ జరుగుతోంది.

మిలిగిన 12 స్థానాల్లో 11 టిడిపికి ఏకగ్రీవమైనా, వైసీపీకి కూడా ఒక స్థానం ఏకగ్రీవమైంది. పోటీ జరుగుతున్న స్థానాల్లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతోంది.

అధికార పార్టీకి దీటుగా వైసీపీ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఇక చెవిరెడ్డి చిన్నకుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిని తిరుపతి రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుస్తారన్న ధీమాను వైసీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

అలాగే టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా అదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుండడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఏదేమైనా నిస్తేజంగా వున్న చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంలో చెవిరెడ్డి సఫలీకృతులయ్యారు.

8 Replies to “బాబు జ‌న్మ‌స్థలిలో చెవిరెడ్డి స్ఫూర్తిదాయ‌క పోరాటం!”

  1. అవును లిక్కర్ డబ్బులు ఎలా దోచాలో బాగా తెలుసు, అందుకే లాస్ట్ టైం ఎలక్షన్ లో ఏమయ్యాడు పోరాడలేదు 

  2. పాపం వెన్ను నొప్పి తగ్గినట్లు ఉండే….కోర్ట్ కి తెలిస్తే బెయిల్ కాన్సుల్ అవుతుందేమో

      1. లండన్ మందులు తో తగ్గని సై”కో తు”గ్లక్ గాడి పిచ్చి చూసే చెల్లి తల్లి వదిలి పారిపోయారు గా…

    1. కర్ణాటక, ఆంధ్ర మద్య తిరిగి తిరిగి అన్న అలసిపోయాడు, అన్నను బాధపెట్టకండి, అన్నకు విశ్రాంతి అవసరం ఉంది, అన్న బెంగుళూరు ప్యాలెస్ లో ప్రశాంతంగా నిద్ర పోతాడు ఎవ్వరు అన్నను డిస్టర్బ్ చెయ్యవద్దు. 

Comments are closed.