స్థానిక పోరులో ముఖ్యంగా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అనూహ్య విజయాల్ని నమోదు చేసుకుంది. కూటమి సాధించిన విజయాలతో పోల్చితే, వైసీపీ చాలా తక్కువ చోట్ల మాత్రమే పాగా వేసింది. అయినప్పటికీ టీడీపీలో తెలియని ఆందోళన కనిపిస్తోంది.
వైసీపీ ఎక్కడెక్కడ విజయాలు సాధించింది? కారణాలేంటి? అనే కోణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆరా తీస్తున్నారు.
స్థానిక పోరులో టీడీపీ సర్వశక్తులు ఒడ్డింది. అయినప్పటికీ వైసీపీ చెప్పుకోదగ్గ విజయాల్నే నమోదు చేసుకుంది. వైసీపీ నామరూపాలు లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, తళుక్కుమని మెరవడం టీడీపీ పెద్దల్ని కలవరానికి గురి చేస్తోంది. ఈ విషయమై సీరియస్‌గా చర్యలుంటాయని నారా లోకేశ్ హెచ్చరించడం గమనార్హం.
వైసీపీ విషయానికి వస్తే, ఇంకా సమీక్షిస్తున్నట్టుగా కనిపించడం లేదు. రాయలసీమ, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున దౌర్జన్యాలు జరిగాయి. అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. వైసీపీ తప్పక గెలుస్తుందనే భయంతోనే టీడీపీ అరాచకాలకు తెగబడిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
వైఎస్ జగన్ కూడా రెండుమూడు దఫాలు మీడియా సమావేశాలు నిర్వహించి, టీడీపీ దాడుల్ని కళ్లకు కట్టారు. వీటిని ఎలక్షన్లు కాదు, సెలెక్షన్లు అంటారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు బాగా జరిగిన చోట్ల వైసీపీ ఓడిపోవడంపై జగన్‌తో పాటు ఆ పార్టీ పెద్దలు పోస్టుమార్టం చేస్తున్న దాఖలాలు లేవు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీకి చెప్పుకోదగ్గ ఫలితాలే వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ నేతలు మరింత శ్రద్ధ కనబరిచి వుంటే, మరిన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్ని దక్కించుకునే వాళ్లనే అభిప్రాయం సొంత పార్టీ నుంచే వ్యక్తమవుతోంది.
అలాగే ఉభయగోదావరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల వైసీపీ ఇన్‌చార్జ్‌లు ఎన్నికల్ని ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. కొన్నిచోట్ల నామినేషన్లు వేయడంతోనే తమ బాధ్యత తీరినట్టు ఇన్‌చార్జ్‌లు వ్యవహరించారు.
వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా కోఆర్డినేటర్లు ఉన్నారు. అసలు ఆ వ్యవస్థ వల్ల వైసీపీకి రాజకీయ ప్రయోజనం ఏంటో ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాదు. పైపెచ్చు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థ వల్ల, పార్టీలో గ్రూపుల్ని పెంచి పోషించడానికి తప్ప, మరెందుకూ పనికి రావడం లేదు. నాయకులకు పదవులు దక్కడం మినహాయిస్తే, పార్టీకి ప్రయోజనం శూన్యం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన ప్రాంతాలకు ఒకసారి వెళ్లి రావడమే తప్ప, అక్కడ ప్రభావితం చేసిందేమీ లేదు. పైగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నిర్ణయమే ఫైనల్ అని, మీరు ఎక్కడా జోక్యం చేసుకోవద్దని ముందే కోఆర్డినేటర్లకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
ఇదే కోఆర్డినేటర్ల వ్యవస్థ లేకపోయి వుంటే, 28 జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ నేరుగా మాట్లాడే అవకాశం వుండేది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని జగన్ తెలుసుకుని, దిశానిర్దేశం చేసే పరిస్థితి వుండేది. కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకోడానికి ఇంకో కోఆర్డినేటర్. ఏంటీ వ్యవస్థలు? ఏ పార్టీలో అయినా వున్నాయా?
ఉదాహరణకు ఉత్తరాంధ్రకు చెందిన కోఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌లను తీసుకుందాం. వారికి కోస్తా బాధ్యతలు అప్పగించారు. కానీ తమ ప్రాంతాల్లో బంధువుల్ని గెలిపించుకోడానికే వారికి సమయం సరిపోలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
వైసీపీలో పెద్ద రెడ్లైన కోఆర్డినేటర్లు ఉన్నారు. వాళ్లంతా ఈ ఎన్నికల్లో ఏం చేశారో అందరూ చూశారు. కనీసం ఉనికి కూడా చాటుకోలేదు. కానీ పదవులు మాత్రం పెద్దపెద్దవే.
ఈ ఎన్నికలు కార్యకర్తలకు సంబంధించినవని, వారికి అండగా నిలబడాలని వైఎస్ జగన్ పదేపదే చెప్పారు. కానీ జగన్ ఆదేశాల్ని పట్టించుకన్న ఇన్‌చార్జ్‌లు కేవలం 10-15 మాత్రమే అంటే ఆశ్చర్యం కలగకమానదు.
వైసీపీ మరిన్ని విజయాల్ని సాధించడానికి అవకాశం ఉన్నప్పటికీ, డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టం లేక ఇన్‌చార్జ్‌లు చేతులెత్తేశారన్నది పచ్చి నిజం. కేవలం తమ కోసం మాత్రమే కార్యకర్తలు అన్నట్టుగా అత్యధిక వైసీపీ ఇన్‌చార్జ్‌లు వ్యవహరించారు.
కార్యకర్తల కోసం మీరు నిలబడితే, రేపు సార్వత్రిక ఎన్నికల్లో వాళ్లంతా మీ కోసం మద్దతుగా వుంటారని జగన్ చెప్పారు. ఆర్థికంగా ఎంతోకొంత అండగా నిలిచి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుచుకుని రావాలనేది వైఎస్ జగన్ ఉద్దేశం.
వైసీపీ ఇన్‌చార్జ్‌లు మాత్రం… జగన్ ఎన్నెన్నో చెబుతుంటారని, వాటన్నింటిని పట్టించుకుంటే , మన జేబులకు చిల్లులు పడతాయని కూడబలుక్కున్నారు. అందుకే 110కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌చార్జ్‌లు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులెత్తేసినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రజల్లో వైసీపీపై ఆదరణ, కూటమిపై వ్యతిరేకత వున్నప్పటికీ… ప్రతిపక్షం రాజకీయంగా సొమ్ము చేసుకోలేకపోయింది.
దీనికి వైఎస్ జగన్ తప్పు కూడా లేకపోలేదు. ఎందుకంటే, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతల్ని నేరుగా తనే పర్యవేక్షించలేదు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన బాధ్యతలు అప్పగించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడ్డమే తప్ప, ఆదేశాల్ని పట్టించుకునేంత సీన్ లేదు.
జగన్‌నే ఖాతరు చేయని నేతలు, సజ్జల ఆదేశాల్ని పట్టించుకుంటారని ఎలా అనుకుంటారు? తన పార్టీ బాగోగుల గురించి జగన్‌కే పట్టింపు లేనప్పటికీ, మిగిలిన వారికి ఎందుకు వుంటుంది? మన ఎన్నికలప్పుడు చూసుకుంటాంలే అని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అనుకున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో కాడిని వదిలేశారు. టీడీపీ దౌర్జన్యాలు, అధికార యంత్రాంగం ఒత్తిళ్లు అనే సాకు చూపే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు.
ఇలాగైతే రానున్న ఎన్నికల్లో ఇన్‌చార్జ్‌ల గెలుపు కోసం తామెందుకు పని చేయాలని కార్యకర్తలు అనుకుంటే, పరిస్థితి ఏంటో ఒక్కసారి వైఎస్ జగన్ ఆలోచించాలి. అటువైపు చంద్రబాబు, లోకేశ్ ఇప్పటికే ఓటమిపై సమీక్షలు మొదలు పెట్టారు. కారణాల్ని తెలుసుకుని దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నారు.
అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న వైసీపీ మాత్రం, ఓటమిపై ఇంకా ఎలాంటి సమీక్షలు నిర్వహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అన్నింటినీ టీడీపీ దౌర్జన్యాల ఖాతాలో వేస్తూ, ఎక్కువ మంది వైసీపీ ఇన్‌చార్జ్‌లు తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
అలాంటి దొంగల్ని పట్టుకుని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం జగన్‌పై మాత్రమే వుంది. జగన్ ఏం చేస్తారో చూడాలి. కష్టపడితేనే ఫలితం వుంటుంది.
తమ వైపు నుంచి తగిన శ్రమ లేకుండా, ఫలితాల్ని ఆశించడం వైసీపీ నేతలకు సరైన విధానం కాదు. ఇది వైఎస్ జగన్‌కు కూడా వర్తిస్తుంది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో స్థానిక పోరులో ఓటమిపై జగన్ స్వయంగా పోస్టుమార్టం నిర్వహించి, గెలుపు దిశగా పయనించడానికి ఏం చేయాలో ప్రణాళికలు రచించుకోవాలి.
తన పార్టీ కోసం, మరెవరినో పని చేయమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఆ విషయాన్ని ఆయన గుర్తించుకుని, అడుగులు ముందుకేస్తేనే, భవిష్యత్‌లో ప్రయోజనం.

సింగిల్ డిజిట్ నే రేపు కూడా..
inka meku adi vachedi ippudu election chusaka next kutami vastundi ante janalu navvutunnaru mottam bedirimpulu
పక్కకెళ్లి ఆడుకో బుజ్జి…
yes 1st place to kutami 👍
TDP ki Raa.. Rey without pavan nothing.
edo nee aanadam atyutsaaham gaani.. VZM,ANT rendu jillalu tappite peddaga prabhavam ledu.. Prakasam,Kadapa very disappointing ..migilinvai maatadukodam kooda anavasaram..
ఆ ఇంటి దొంగల గురించే కదా విజయ్ సాయి చెబుతుంది
నీ రాతలలో తప్ప వైసీపీ తళుకులు మాకు యాడా కనపడేలా?
kosta jillalu lo gadichina 2 years lo matha marpidilu lo 6lkhalu mandi maripoyaru ani nevedika andaru jagan matam loki next 2 years lo inka chala mandi potaru ani talk
అన్న అసలు రాజకీయ నాయకుడు కాదు , ఆ లక్షణాలు ఏమీ లేవు అని నువ్వే చాలాసార్లు రాశావ్. అన్నకు మించిన దొంగ పార్టీ లో ఉన్నాడంటావా?
పద్ధతి గా రాసిన ప్రతి కామెంట్ ని డిలీట్ చేయడం భావ్యం కాదు
పద్ధతి గా రాసిన ప్రతి కామెంట్ ని డిలీట్ చేయడం భావ్యం కాదు
Goodbye
Goodbye
అన్నకు మించిన పెద్ద దొంగ ఎవరు? అన్నను అన్నే పట్టుకోవడం అంటే
వాడే జగ దొం!;గ..
మా శామ్యూల్ బెంజిమన్ ఏమైనా అన్నారో పుచ్చలేగేసి పోతాయి ఎవ్వాడికైనా
ఇంటి దొంగ అంటే చెల్లి ఇల్లు కాజేసిన దొంగా?
క్లారిటీ ఇచ్చి చావు GA
ఇంటి దొంగ అంటే సోదరి ఇల్లు కాజేసిన దొంగా?
క్లారిటీ ఇచ్చి చావు
ఇంటి దొంగ అంటే పెళ్ళికి ఇల్లు ఇవ్వని దొంగా?
క్లారిటీ ఇచ్చి చావు
సొంతింటి దొంగ అంటే మేనకోడలికి పెళ్ళికి ఇల్లు ఇవ్వకుండా అడ్డుపడ్డ దొంగా
క్లారిటీ ఇచ్చి చావు
వాడికి అంత తెలివి ఎక్కడుంది, సజ్జల ఏది చెపితే అది నిమెస్తాడు
First into donga- jagan
2nd inti donga – Rachamallu(proddatur maaji MLA)
తన జేబులో నుంచి రూపాయి కూడా తీయకుండా నాయకులే ఖర్చులన్నీ భరించాలి అంటే, వాళ్ళు మాత్రం డబ్బులు ఎక్కడనుంచి తెస్తారు?
యథా పార్టీ అద్యక్షా…….తధా ఇన్ చార్జ్ …తధా ..నాయకులు…..
తెలుగుదేశం సేఫ్
Kongala party.
chinna kon:galani,super konga endhuku patt:kuntundhi??
మావోడు తన సొంత నియోజకవర్గం పులివెందులలో కార్యకర్తలకోసం అండగా నిలబడి, ఆర్థికంగా సహాయం చేసి ఎంతమందిని గెలిపించాడూ?
మావోడు ఎన్నికల ముందే “ప్రీ”మార్టం చేసేసి కూటమి అరాచకాలు, అక్రమాలతో గెలుస్తోంది.. ఇవి elections కాదు selections అని చెప్పేశాడు కదా? మరి పోస్టుమార్టం చేస్తే, కొత్తదేమైనా కనిపెట్టగలడా లేదుకదా? So టైమ్ వేస్ట్..
పోస్టుమార్టం చేస్తే, అన్నీ వేళ్ళు మావోడిమీదికే చూపిస్తే? అందుకే మనోడికి అట్లాంటివి చేసే అలవాటు లేదు..
ఎన్నికలు సజావుగా / బాగా జరిగిన చోట్ల కూడా వైసీపీ ఓడిపోయిందా? సజావుగా జరిగినా ఎందుకు ఓడిపోయింది? ప్రభంజనం సృష్టించి స్వీప్ చెయ్యాలి కదా? అయినా ఓడిపోయింది అంటే మీరు చెప్తున్నవి తప్పుడు ఆరోపణలు అని తేలిపోతోంది అరికట్లా? మరీ ఇంత సిల్లీగా దొరికిపోతే ఎట్టా ఎర్రిమోహనా?
Ayo emi ra ee GA baadha ,pls evaraina woodwords pattandi…..
money talks, cbn has money so they are dissecting the result and ysrp people raised white flags
దొంగలకే దొంగ ఒంటరి దొంగ
వైసీపీ ఎక్కడ గెలిచింది, ఎక్కడ ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయింది అని టీడీపీ వాళ్లే విశ్లేషించుకుంటున్నారు. కానీ వైసీపీలో మాత్రం ఆత్మపరిశీలన చేసే ఒక్కడూ కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో ఓటమికి కారణాలు ఉండవు, గెలుపుకు మాత్రం గొప్పలు ఉంటాయి!
సీమలో కొన్ని చోట్ల గొడవలు జరిగితే జరిగి ఉండొచ్చు. మరి ప్రశాంతంగా జరిగిన కోస్తాంధ్రలో వైసీపీ ఎందుకు ప్రభావం చూపలేకపోయింది? కూటమిపై వ్యతిరేకత ఉందని మీరే ఊహించుకుంటున్నారు. కానీ వైసీపీ పాలనపై ప్రజల్లో మిగిలిన భయం ఇంకా పోలేదు.
2024లో కూటమిని గెలిపించింది కేవలం హామీలు కాదు, జగన్ పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత. మళ్లీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా చేస్తామని రోజూ బెదిరిస్తుంటే ప్రజలు మాత్రం ఎందుకు ఓటు వేస్తారు?
కూటమి తన సమన్వయ లోపాలను సరిదిద్దుకుంటోంది. మరి వైసీపీ నాయకత్వం మాత్రం ఇంకా భ్రమల్లోనే ఉందా?
వాడే పెద్ద దొంగ-నా-డోడుకు, వాడు దొంగలను పట్టుకోవటం ఏంటి నీ పిచ్చి కాకపోతే!!
ఒక దొంగ ఇంకో దొంగ నీ కనిపెడతాడా అని మరో దొంగ రాయటం..
ఒక దొ0గ ఇంకో దొ0గ నీ కనిపెడతాడా అని మరో దొ0గ రాయటం
1st donga -jagan
2nd donga – Rachamallu
3rd donga- meesalan bijendra reddy from Aallagadda
Pulivendula lo votla time ki palace lo padukoni nidrapoyadu