ప్రేమించే గిరిజ‌నుల‌కు జ‌గ‌న్ రిట‌ర్న్ గిఫ్ట్ ఏదీ?

ఇటీవ‌ల ముగిసిన ప‌ల్లె పోరులో అల్లూరి జిల్లాలో వైసీపీ విజ‌య ఢంకా మోగించి, జ‌గ‌న్‌పై గిరిజ‌నుల ప్రేమ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిత‌మైంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌రువును ఉత్త‌రాంధ్ర‌లోని గిరిజ‌న ప్రాంతం నిలిపింది. వైసీపీకి కంచుకోట లాంటి రాయ‌ల‌సీమ‌, ప‌ల్నాడు ప్రాంతాల్లో చాలా వ‌ర‌కూ వైసీపీ అభ్య‌ర్థుల్ని నామినేష‌న్లు వేయ‌నివ్వ‌ని దుస్థితి. ఆయా ప్రాంతాల్లో టీడీపీ ఏక‌గ్రీవాల పేరుతో బ‌ల‌వంత‌పు విజ‌యాల్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే వైఎస్ జ‌గ‌న్‌పై ఉత్త‌రాంధ్ర‌లోని గిరిజ‌నులు గుండెల్లో పెట్టుకున్నారు. క‌ష్ట‌కాలంలో అండ‌గా వుంటామ‌ని, అత్యంత దారుణ ప‌రిస్థితుల్లోనూ వైసీపీకి వారు అండ‌గా నిలిచిన తీరు గురించి ఎంతగా ప్రశంసించినా త‌క్కువే.

ప్రేమ‌కు అదే రిట‌ర్న్ గిఫ్ట్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే గిరిజ‌నులు చూపిన తెగువ‌, ప్ర‌ద‌ర్శించిన ప్రేమ‌కు అంతేస్థాయిలో వాటిని పంచ‌డంలో వైసీపీ విఫ‌లం అయ్యింద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

ఇటీవ‌ల ముగిసిన ప‌ల్లె పోరులో అల్లూరి జిల్లాలో వైసీపీ విజ‌య ఢంకా మోగించి, జ‌గ‌న్‌పై గిరిజ‌నుల ప్రేమ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిత‌మైంది.

అల్లూరు జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలుండ‌గా, వాటిలో ఏడు వైసీపీకి ద‌క్కాయి. మిగిలిన నాలుగింటిలో కూట‌మికి 3, సీపీఎంకు ఒక జెడ్పీటీసీ స్థానం ద‌క్కాయి. అలాగే 172 ఎంపీటీసీ స్థానాల్లో 89 వైసీపీకి ద‌క్కాయి. ప‌ల్లె పోరులో గిరిజ‌నులు ఏక‌ప‌క్షంగా వైసీపీపై నిలిచార‌నేందుకు ఈ ఫ‌లితాలే నిద‌ర్శ‌నం

అలాగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా గిరిజ‌నం వైసీపీ వైపు నిలిచారు. అర‌కు పార్ల‌మెంట్‌తో పాటు అసెంబ్లీ, అలాగే పాడేరు ఎమ్మెల్యేలుగా వైసీపీ అభ్య‌ర్థులే గెలుపొందారు. త‌మ‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా నిలిచిన గిరిజ‌నుల‌పై వైఎస్ జ‌గ‌న్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు గ‌ట్టిగా అండ‌గా నిల‌వాల్సిన బాధ్య‌త వుంది. ప‌రిష‌త్ పోరులో రాష్ట్ర‌మంత‌టికీ క‌లిపి అల్లూరి జిల్లా ప‌రిష‌త్ మాత్ర‌మే వైసీపీకి ద‌క్కింది.

ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు వ‌ర‌కు కూటమి నేత‌లు గిరిజ‌న ప్రాంతాల్లో పంపిణీ చేసిన‌ట్టు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌లోభాల‌కు వారు లొంగ‌లేదు.

అలాగే ఓట‌ర్ల‌ను భ‌య‌పెట్టి, సీమ‌లో మాదిరిగా విజ‌యాల్ని త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని కూట‌మి నేత‌లు ప్ర‌య‌త్నించిన‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల్లో గిరిజ‌నులంతా క‌ట్టెలు ప‌ట్టుకుని, కూట‌మి నేత‌ల‌పై తిరగ‌బ‌డ‌డం వ‌ల్లే, నేడు వైసీపీ త‌లెత్తుకుని నిల‌బ‌డ‌గ‌లిగింది.

పార్టీ కోసం త్యాగాలు చేసిన గిరిజ‌నుల ప్రేమాభిమానాల్ని వైసీపీ పెద్ద‌లు గుర్తించాలి. వాళ్ల‌ను గుండెల్లో పెట్టుకుని నిల‌బ‌డాల్సిన వైసీపీ పెద్ద‌లు, ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

రాష్ట్రంలో వైసీపీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేలా గిరిజ‌నులు నిల‌బ‌డ‌డాన్ని, ఆ పార్టీ నాయ‌కులు విస్తృతంగా జ‌నంలోకి తీసుకెళ్లాలి. ప్ర‌లోభాలు, దాడుల‌కు భ‌య‌ప‌డి వెన్నుచూపిన వైసీపీ నాయ‌కుల గురించి వింటున్నాం.

కానీ పేద ప్ర‌జ‌లైనా గిరిజ‌నులు మాత్రం వైఎస్ జ‌గ‌న్ కోసం ఎందాకైనా అన్న‌ట్టు నిల‌బ‌డిన తీరు అద్భుతం. అలాంటి పేద గిరిజ‌నులు కోరుకునేది గుప్పెడు జ‌గ‌న్ ప్రేమ మాత్రం. ఇదేమీ డ‌బ్బు ఖ‌ర్చ‌య్యేది కూడా.

జ‌స్ట్ ఒక ఆత్మీయ ప‌ల‌క‌రింపే. గిరిజ‌న ప్రాంతాల‌కు వెళ్లి, వారితో క‌లిసి ప్రేమ పంచుకోవ‌డం ద్వారా త‌న పార్టీ శ్రేణుల‌కు జ‌గ‌న్ సానుకూల సంకేతం పంపిన‌ట్టు అవుతుంది. మంచి ప‌నికి ఆల‌స్యం ఎందుకు జ‌గ‌న్‌? బెంగ‌ళూరు బ‌దులు ఒక వారం అర‌కు వెళితే పోయేదేముంది?

14 Replies to “ప్రేమించే గిరిజ‌నుల‌కు జ‌గ‌న్ రిట‌ర్న్ గిఫ్ట్ ఏదీ?”

  1. ఎవరినుండి అయినా చివరికి తల్లీ చెల్లీ నుండీ కూడా లాక్కోవడమే అలవాటు.. ఇవ్వడం అస్సలు నచ్చదు మావోడికి. “ఏరా మోహనా వీళ్ళ దగ్గర నుండీ ఏం లాక్కుందాం?

  2. అన్న పరదాలు లేకుండా నగరాలు పట్టణాలలో తిరగడమే గగనం అంటే….నువ్వు గిరిజన ప్రాంతాలు అంటావ్

    1. అక్కడ అన్న అడుగు పెట్టాలంటే అడవులు మొత్తం తెగనరకాలి. ఎందుకంటే అన్నకి చెట్లు అంటే ఎలర్జీ!

  3. చాలా ఎక్కువ ఊహించు కుంటున్నావు… అన్నియ గురించి…

    వాళ్లకి మంచి జరగాలి అంటే ఒక నెల అక్కడ వుండి మిగతా వాళ్ళని కూడా మతమార్పిడి చేసేస్తే సరిపోతుంది 

  4. పిచ్చోడా! అన్నయ్ వ్యవహారమంతా వన్వే టైపు. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తె ఏం తెస్తారు అన్నట్లు. ఇన్నేళ్ల నుండి ఆయన్ని చూస్తూ కూడా కొత్తగా ఏదో చేయాలని ఎలా అనుకుంటావ్? ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టని వాడు మావాడు.

  5. “జఘనుణ్ణైనా చంద్రుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్లేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా!”

    ఒక్కడు సినిమా పాటకి కాస్త అటు ఇటుగా.

    వాడు పొడిచాడు అని వీడు, వీడు అక్రమంగా సంపాదించాడని వాడు జుట్టూ జుట్టూ పీక్కోపోతే జనాలకి ఒరిగింది ఏంటో తెలియట్లేదు. ఒక్కో సీటుకి ఇంత ఖర్చు పెట్టాం అని ఎర్రికట్ల ఎప్పుడో రాశాడు. ఇప్పుడు దాన్ని వసూల్ చెయ్యడానికి, 2029కి సమాయత్తం అవ్వడానికి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో బేరీజు వేసుకుంటున్నారు.

Comments are closed.