తమ సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో మూడు జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ ఓటమిపై మంత్రి నారా లోకేశ్ సీరియస్‌గా ఉన్నారు. రెండున్నరేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని 40 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అలాంటి నియోజకవర్గంలో చాలా తక్కువ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీచడం, మరీ ముఖ్యంగా చంద్రగిరి చంద్రబాబు సొంత గడ్డ కావడంతో లోకేశ్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
చంద్రగిరి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో తిరుపతి రూరల్ జెడ్పీటీసీ పరిధిలో 1.60 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్‌రెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ తరపున ధనలక్ష్మి అనే మహిళ పోటీ చేశారు.
తిరుపతి రూరల్ అనేది చిన్నపాటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని తలపిస్తుంది. అందుకే అక్కడి గెలుపు ప్రభావం యావత్ చంద్రగిరిపై పడుతుందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
ఈ క్రమంలో తిరుపతి రూరల్‌తో చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.
అధికార దుర్వినియోగం, ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టడం, వైసీపీకి జనరల్ ఏజెంట్లు లేకుండా చేయడం, భారీ మొత్తంలో దొంగ ఓట్లు వేయించుకున్నారనే ప్రచారం…ఇన్ని తోడైనా టీడీపీ ఎందుకు గెలవలేకపోయిందన్న ప్రశ్న ఆ పార్టీ పెద్దల్ని వెంటాడుతోంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చంద్రగిరిలో మూడు జెడ్పీటీసీల ఓటమిని సంకేతంగా చూపుతున్నారు.
ఈ విషయమై చంద్రగిరి నియోజకవర్గంతో పాటు ఇతరత్రా టీడీపీ నాయకుల్ని ఆరా తీసినట్టు తెలుస్తోంది.
స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల తీరే టీడీపీ ఓటమికి కారణమని మెజార్టీ నేతలు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. దీంతో చంద్రగిరితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీలో ఏం జరుగుతున్నదో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఓహో…రాష్ట్రం లో గెలిచినా వేళ MPTC లు వందల జడ్పీటీసీ లు వదిలేసి చంద్రగిరి లో ఓడిన మూడు జడ్పీటీసీ లు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి సంకేతం అని చెప్తున్నారా? సర్లే నమ్మేసాం
chandragiri congress ki ippudu ysrcp ki kanchukota yedo monna MLA lo gelichadu nani ante next adukuntaru ikkadada nani ni
next election kuppam kuda potundi chusukondi
కుప్పం అన్నోడి కొంపలోకే దూరి కొట్టాం, ఎవరు చూసుకోవాలి, ఎవరు మూసుకోవాలి..
Pulivendula lo kottam anukuni Chandragiri lo pallu voodakottukunna Maalokam.
ఏ హాస్పిటల్ లో ఉన్నావు రే?
bolli naidu ni rajamundry ki pampali anna Jagan.. Ma vote daaniki matrame vestunnam, A.P. mottanni dochestunnaru
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్న పార్టీ రాయలసీమ లో 80 శాతం సీట్లు గెలుస్తుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది జరుగుతుంది.
వై?!సీపీ దొం?!గ ఓట్లు.. చూసాం గా ear రె!?డ్డి గాడు పోలింగ్ బూత్ లో పొండి పొండి అని బయటికి పంపుతున్నాడు.