ప‌వ‌న్‌కు అనుకూల శ‌త్రువులు!

స‌ద‌రు చానెల్ ప్ర‌జెంట‌ర్‌పై వ్య‌క్తిగ‌తంగా కూడా జ‌న‌సేన సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు విరుచుకుప‌డుతున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అనుకూల శ‌త్రువుల‌తోనే స‌మస్య‌. మూడో భార్య అన్నా లెజినోవాతో వివాహ బంధాన్ని తెంచుకుంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది.

త‌మ పార్టీకి సంబంధించిన అధికార ప్ర‌తినిధులు, నాయ‌కులు, సోష‌ల్ మీడియా యాక్టివిస్టులెవ‌రూ స్పందించొద్ద‌ని వైసీపీ అధికారికంగా ప్ర‌క‌టించి, ప్ర‌శంస‌లు అందుకుంటోంది. పార్టీ అధిష్టానం ఆదేశాల్ని ఆ పార్టీ పెద్ద నాయ‌కులు మొద‌లుకుని, సామాన్య కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు తు.చ త‌ప్ప‌క పాటిస్తున్నారు.

ఇత‌రుల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి మాట్లాడొద్ద‌నే వైసీపీ ప్ర‌క‌ట‌న టీడీపీ, ఆ పార్టీ మీడియాకి అస‌లు జీర్ణం కావ‌డం లేదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ విడాకుల ప్ర‌క‌ట‌న‌పై వైసీపీ చెల‌రేగిపోతుంద‌ని, ఆ మంట‌లో చ‌లి కాచుకుందామ‌ని టీడీపీ యాక్టివిస్టులు, అలాగే అనుకూల మీడియా అనుకుంది. అందుకు విరుద్ధంగా వైసీపీ హుందాగా స్పందించడంతో ఆ పార్టీ వ్య‌తిరేకుల‌కు షాక్ త‌గిలిన‌ట్టైంది.

అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ విడాకుల అంశాన్ని వైసీపీ అనుకూల మీడియా ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. కానీ చంద్ర‌బాబు, టీడీపీ అంటే ప్రాణం తీసుకునే ఒక చానెల్ మాత్రం డిబేట్ పెట్టింది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ విడాకుల గురించి ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే త‌ప్ప‌ని, అస‌లే మాట్లాడ‌కూడ‌దంటే ఎలా కుదురుతుంద‌ని టీడీపీ అనుకూల చానెల్ ప్ర‌జెంట‌ర్ ప్ర‌శ్నించ‌డంపై జ‌న‌సేన తీవ్రస్థాయిలో మండిప‌డుతోంది.

ఇటీవ‌ల స‌ద‌రు చానెల్ అధిప‌తి అల్లుడు త‌మ కుటుంబంలో విభేదాల్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ చేసిన ట్వీట్‌ను వారు గుర్తు చేస్తున్నారు. స‌ద‌రు చానెల్ ప్ర‌జెంట‌ర్‌పై వ్య‌క్తిగ‌తంగా కూడా జ‌న‌సేన సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు విరుచుకుప‌డుతున్నారు.

కొంద‌రు జ‌న‌సేన వీర‌మ‌హిళ‌లు త‌మ నాయ‌కుడిపై అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించే క్ర‌మంలో …పుండుపై కారం చల్లిన‌ట్టుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఇది ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ర్స‌న‌ల్ అంటూనే, పిచ్చిరాత‌ల్ని జ‌న‌సేన వీర మ‌హిళ‌లు కొంద‌రు పోస్టులు పెట్టారు. అస‌లు ఆ విష‌యం గురించి మాట్లాడొద్ద‌ని ఆదేశించిన వైసీపీపై ఏ మాత్రం ఆధారాల్లేకుండా, విమ‌ర్శ‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

“ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. మిమ్మల్ని ప్రశ్నించే మా గొంతు కేవలం మీ రాజకీయ పరిపాలన వరకు మాత్రమే. మీ వక్తిగత జీవితం లో తొంగి చూసే హక్కు మాకు లేదు” అంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ విడాకుల‌నే పుండును కెలుకుతున్న‌దెవ‌రో జ‌నానికి బాగా అర్థ‌మ‌వుతోంది.

ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు పేరుతో రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లంతా ఆయ‌న గురించి పోస్టులు పెట్ట‌డం విచిత్రంగా వుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌క్తిగత జీవితంపై ఏ మాత్రం గౌరవం, అభిమానం వున్నా, అస‌లు ఆ విషయం గురించి ప్ర‌స్తావించ‌కూడ‌దు.

ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి వైసీపీనే ఆ విష‌యంపై మాట్లాడొద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు, సొంత పార్టీ అధికార ప్ర‌తినిధుల‌తో పాటు టీడీపీ అనుకూలురు ఇష్టానురీతిలో మాట్లాడ్డం ద్వారా, ఏం కోరుకుంటున్నారో అర్థం కావ‌డం లేదు. మీరెందుకు మౌనంగా వున్నారు? మా నాయ‌కుడి వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడండి అని ప‌రోక్షంగా రెచ్చ‌గొడుతున్న‌ట్టుంది.

వైసీపీ నేత‌లు మాట్లాడితే, దాన్ని అడ్డం పెట్టుకుని, ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచామ‌ని ప్ర‌చారం చేసుకోడానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించిన‌ట్టుంది. అయితే వైసీపీ త‌మ ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంతో వారంతా గిల‌గిలా త‌న్నుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక ఓపిక లేక‌, త‌మ‌కు తామే ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెళ్లిళ్ల గురించి, మ‌ద్ద‌తు పేరుతో ప్ర‌స్తావించ‌డం జ‌న‌సేనలోని కొంద‌రు అధికార ప్ర‌తినిధులు, వీర మ‌హిళ‌ల‌కు, టీడీపీ అనుకూల చానెల్స్ ప్ర‌తినిధుల‌కే చెల్లింది.

10 Replies to “ప‌వ‌న్‌కు అనుకూల శ‌త్రువులు!”

  1. నీకు బుద్ధి ఉందా మూర్తి, వ్యక్తిగత జీవితంపై విమర్శలు వద్దని మొదట ట్వీట్ చేసిందే టీడీపీ, దాన్ని లైక్ చేస్తూ రీ ట్వీట్ చేసింది వైసీపీ. నీవేమో విద్వేషం పెరిగేలా తప్పుడు రాతలు రాయడం అవసరమా.

  2. మరి నువ్వెందుకు పవన్ గారి గురించి ఇన్ని ఆర్టికల్స్ రాశావ్ 

    Paytm డబ్బులు రాలేదా 😂🤣

    1. పీకే పవన్ కళ్యాణ్ కాదు పెళ్లాల కళ్యాణ్ ? కాదు కాదు – పెళ్లాలను పీకేసే కళ్యాణ్ – పిల్లల్ని నట్టింట్లో ముంచేసే కామ పిశాచి

      డీసీఎం – డివోర్స్ చీఫ్ మాన్స్టర్

Comments are closed.