రాయలసీమ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు మాటల్లో చెప్పడానికి వీల్లేనంతగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాత్రం నోరెత్తలేదు. పైగా స్థానిక పోరులో విజయాలపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
పవన్ అన్నా నామినేషన్ వేసేందుకు వెళ్లిన తమను కుక్కని కొట్టినట్టు కొట్టారంటూ పల్నాడులో జనసేన నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి వాపోయారు. వారికి మద్దతుగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు నిలిచారు. టీడీపీ రౌడీయిజంపై ఆయన విరుచుకుపడ్డారు.
ఇలా ఒకట్రెండు చోట్ల కాదు, చాలా ప్రాంతాల్లో టీడీపీ రౌడీయిజానికి మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన కూడా బాధితులే. అయినప్పటికీ దిద్దుబాటు చర్యలు లేవు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన దాఖలాలు లేవు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, మద్దతుగా నిలిచిన వారిపై ఎడాపెడా కేసులు, అరెస్ట్‌లతో వేధించడం సాధారణమైంది. ఇక భౌతికదాడులు, వారి వాహనాల విధ్వంసం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
వాస్తవాలు ఇలా వుంటే, మంత్రి నాదెండ్ల మనోహర్ లాంటి వారు మీడియా ముందుకొచ్చి ఇంకా వైసీపీ అరాచకాలు చేస్తోందంటూ విమర్శలు. కనీసం నవ్విపోతారనే స్పృహ కూడా లేకుండా పోయిందని సొంత పార్టీ శ్రేణులే తప్పు పట్టే పరిస్థితి.
కిందిస్థాయిలో స్థానిక పోరులో టీడీపీ అరాచకాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో వైఎస్సార్ కడప జిల్లా జనసేన అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్‌ని అడిగితే తెలుస్తుంది. టీడీపీ దాడిలో తమ కార్యకర్త ప్రాణాలు పోయాయని, మీరే కారణమని పులివెందుల డీఎస్పీతో సుంకర శ్రీనివాస్, ఆయన పార్టీ నాయకులు పోలీస్ అధికారితో నేరుగా వాదనకు దిగారు.
అంతేకాదు, ఇలాంటి పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఆవేదనకు లోనై రాజంపేట జనసేన ఇన్‌చార్జ్ హరిరాయల్ బూట్లతో తనను తాను నడిరోడ్డుపై కొట్టుకున్నారు.
చక్రాయపేట మండలం సురభి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన మద్దతుతో జలపాతి నాగమల్లయ్య పోటీ చేయాలని అనుకున్నారు. నాగలగుట్టపల్లె సచివాలయంలో నామినేషన్ వేశారు.
అయితే నామినేషన్ల పరిశీలన రోజు బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి నాగలగట్టుపల్లికి వెళ్లి హల్‌చల్ చేశారు. నామినేషన్ల పరిశీలనకు వైసీపీతో పాటు జనసేన మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులను రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.
ఈ విషయాన్ని జనసేన నాయకులు తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. జనసేన నాయకులు నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టీడీపీ రౌడీలు రాళ్లు, కర్రలతో వెంటపడ్డారు. ఈ గొడవలో జనసేన సర్పంచ్ అభ్యర్థి బంధువు ముంతల వీరాంజనేయులు (55) గుండెపోటుతో చనిపోయారు.
మృతదేహంలో నాగలగుట్టపల్లె రోడ్డుపై జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌తో వాగ్వాదం చేశారు. రక్షణ కల్పించలేని మీ పోలీస్ అసమర్థతోనే తమ కార్యకర్త ప్రాణం పోయిందని పులివెందుల డీఎస్పీతో జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. పవన్ మాటలు నమ్మి పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీకి మద్దతు ఇస్తున్నందుకు బూట్లతో తామే కొట్టుకోవాల్సి వచ్చిందని రాజంపేట ఇన్‌చార్జ్ హరిరాయల్ అన్నంత పని చేశారు.
ఎక్కడైనా, ఎప్పుడైనా అరాచకం పెరిగిపోయినప్పుడు ప్రశ్నించాలి. కానీ మనకెందుకులే అని అనుకుంటే, అది చివరికి మన వరకూ వస్తుంది. పులివెందులలో అదే జరిగింది.
వైసీపీ వాళ్లను కదా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నదని జనసేన, బీజేపీ పెద్దలు ప్రేక్షకపాత్ర పోషించారు. ఇప్పుడే అదే వారికి శాపమైంది. తాము నామినేషన్లు వేసినా, మిత్రపక్షం అయినప్పటికీ టీడీపీ ఒప్పుకోలేదు. రాళ్లు, కర్రలతో టీడీపీ రౌడీలు వెంటాడారు. బలహీనమైన గుండె ఆగిపోయింది.
ఇప్పుడు జనసేన నాయకులు శవంతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. కానీ ఇంత వరకూ ఈ ఘటనపై జనసేన పెద్దలెవరూ నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ పెద్దలపై జనసేన శ్రేణులు రగిలిపోతాయంటే, పోవా మరి!
పులివెందులలో జనసేన కార్యకర్త మృతి.. టీడీపీ శ్రేణులపై ఆరోపణలు
నామినేషన్ స్క్రూటినీకి వెళ్లకుండా వీరాంజనేయులుపై టీడీపీ శ్రేణులు ఒత్తిడి తెచ్చాయని, ఆ ఒత్తిడి కారణంగానే ఆయన గుండెపోటుతో మృతి చెందారని ఆరోపిస్తూ.. బీటెక్ రవి, పోలీసులకు వ్యతిరేకంగా అర్ధరాత్రి ధర్నా చేపట్టిన జనసేన నాయకులు.
— greatandhra (@greatandhranews) November 22, 2026

ఇంత దరిద్రం ఎలక్షన్ ఇంకా భవిష్యత్ lo ఏ EC ఏ సీఎం కూడా నిర్వహించడం జరగదు ఇంత హింస నా నామినేషన్ పేపర్స్ లాక్కొని వెళ్లడం రిగ్గింగ్ లు ఒక్కటే కాదు చాలా ఉన్నాయి
2021 లో అన్న ఇంతకన్నా దరిద్రంగా చేశాడుగా.
జగేన్ మొగుడిగా PK కూడా ఆ కర్మ అనుభవిస్తున్నాడు అంటావా?
కు..క మొరుగు తోంది.
హట్ ..దీనికి పని పాట లేదు కు..క అరుస్తూ వుంటుంది
Anna roudyism mana patent.
janasena followers meeda daadi chesi recha godithe tdp ki 2029 lo power vundadu,,,
కింద స్థాయి జనసేన కార్యకర్తలని టీడీపీ వాళ్ళు వేధించి చంపుతున్న పవన్ కళ్యాణ్ పట్టించు కోవటం లేదు …మెల్లగా అసంతృప్తి మొదలు అవుతోంది …ఇట్లాగే కొనసాగితే 2029 ఎన్నికలలో పవన్ చెప్పిన వోట్ వేయరు …కాపు సామాజిక వర్గం ని అనవసరం గ దూరం చేసుకుంటున్నారు