జనసేన నేతలు బాహాటంగానే పొత్తుల మీద తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కూటమిలో షేరింగ్ ద్వారా తమకు 30 శాతం సీట్లు కావాలని జనసేన నేతలు కోరుతున్నారు.
విశాఖలో అయితే జనసేనకు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపు పట్ల ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం వార్డులు 19 దాకా ఉన్నాయి. జనసేనకు ఇందులో కేవలం మూడు అంటే మూడు సీట్లు మాత్రమే ఇచ్చారని గాజు గ్లాస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముప్పై శాతం సీట్లుగా ఆరు అయినా రావాలని వారు వాదిస్తున్నారు.
కేటాయించిన మూడు వార్డుల్లో కూడా జనసేన బలం చూసుకోకుండా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తాను అనుకున్న చోట్ల ఇచ్చారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం పార్టీకి అవమానం అని జనసేన నేత బెహరా భాస్కరరావు ఫైర్ అయ్యారు.
ప్రచారంలో ఎక్కడా జనసేన నేతలు లేకుండానే టీడీపీ సొంతంగా చేసుకుంటోందని ఆయన విమర్శించారు. జనసేన అవసరం లేదా అని ప్రశ్నించారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న పార్టీ నేతలకు తగిన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
జనసేనను పశ్చిమ నియోజకవర్గంలో కీలక ప్రాంతాల్లో లేకుండా చేసేందుకు చూస్తున్నారని టీడీపీ నేతల మీద ఆయన విమర్శలు చేశారు. జనసేనకు గౌరవం ఇస్తేనే ఉమ్మడి ప్రచారంలో పాల్గొంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. జనసేన అవసరం ఉందని గుర్తించినప్పుడే తాము వస్తామని, లేకపోతే తమ అభ్యర్థులతో ప్రచారం చేసుకుంటామని చెప్పారు.
జనసేనకు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తక్కువ సీట్లు ఇచ్చారని ఆ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. తమకు బలం ఉందని చెప్పినా ఇలా వ్యవహరించడం అంటే కించపరచడమేనని అంటున్నారు.

జనసేన గురించి comment పెట్టాలంటేనే ఈ మధ్య నాకే సిగ్గుగా ఉంది. మా ఊర్లో ఇంతకుముందు నా comments చదివి, “ఎందుకన్నా అలాంటి comments పెడతావు మా మీద, మా నాయకుడి మీద?” అని అడిగేవాళ్లు. అయితే, రానురాను అలా అడిగేవాళ్ల సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఎందుకంటే… వాళ్లందరికీ ఒక clarity వచ్చింది.
మనకు seat ఇవ్వరు. ఇచ్చినా, వాళ్ల candidateలనే నిలబెడతారు TDP వాళ్లు. మనోళ్లు నిల్చుందామని try చేస్తే, nominations కూడా తిరస్కరిస్తారు. మన బతుకంతా టీడీపీ బండిని లాగడమే తప్ప, ఎప్పటికీ మనకు ఒక గుర్తింపు వస్తుందనే ఆశ లేదు. ఎప్పటికైనా *Paradise* సినిమాలో నానిలాంటోడు ఒకడు వచ్చి గుర్తింపు తీసుకొస్తే తప్ప, ఇప్పుడున్న సానిని నమ్ముకుని ప్రయోజనం లేదు అని.
How can Janasena expects more than 10% of seats ?