Advertisement

Advertisement


Home > Politics - Gossip

కాషాయం విప్పబోతున్న రాజు గారు ?

కాషాయం విప్పబోతున్న రాజు గారు ?

ఆయనలో ఇన్నాళ్ళకు ఒక క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ నిండు అసెంబ్లీలో చంద్రబాబుని శోభన్ బాబు అని పొగిడినపుడే మనసు ఎక్కడో చాలా వరకూ అర్ధం చేసుకున్నారు. అయినా బీజేపీలో ఆయనకు గౌరవం పదవులు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే బీజేపీ తనంతట తానుగా ఎవరికీ వదులుకోదు కాబట్టి.

విశాఖకు చెందిన ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తెలుగుదేశాన్ని పొగుడుతూ వైసీపీనే టార్గెట్ చేస్తూ వస్తారు అని అందరూ అంటూంటారు. అదే బీజేపీలో ఇతర నేతలు రెండు పార్టీలను విమర్శిస్తారు. ఇలా కాస్తా భిన్నంగా వ్యవహరిస్తున్న రాజు గారి మీద సొంత పార్టీలో అనుమానాలు ఉన్నా ఆయన మానాన ఆయనను వదిలేశారు.

ఇపుడు ఆయన సరైన టైం వచ్చిందనుకున్నారో ఏమో బీజేపీకి తాజాగా రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాటలో సైకిలెక్కబోతున్నారు అన్న టాక్ నడుస్తోంది. ఆయన గుంటూరు వెళ్లి కన్నా నివాసంలో ఆయన్ని కలవడం, బయట మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీలో పరిస్థితులు ఏ మాత్రం బాగులేవు అంటూ కామెంట్స్ చేయడం చూస్తూంటే సైకిలెక్కుతారు అనే అంటున్నారు.

ఆయన 2014లో బీజేపీ తెలుగుదేశం పొత్తులో భాగంగా గెలిచారు. 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడారు. పొత్తులు ఉంటే బీజేపీలో ఉండాలనుకున్నారు కానీ బీజేపీ సొంతంగా పోటీ అంటోంది. దాంతో రాజు గారికి తత్వం భోధపడిందని, తెలుగుదేశం నీడ కోసం ఆయన చూస్తున్నారు అంటున్నారు.

ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడే తీరిక కేంద్ర పెద్దలకు లేదని రాజు గారు కామెంట్స్ చేశాక ఆయన బీజేపీలో ఉంటారా అన్న డౌట్లు రావడం సహజమే. ఏపీ బీజేపీలో ఏమి జరుగుతుందో అర్ధం కాదని అంటున్న రాజు గారు కాషాయం విప్పేడానికి అంతా సర్దుకుంటున్నారు. అనే అంటున్నారు. కన్నాతో పాటు ఆయన టీడీపీలో చేరుతారు అని టాక్ నడుస్తోంది. 

బీజేపీకి విశాఖలో ఉన్న కొద్ది మంది నాయకులలో రాజు గారు ఒకరు. ఆయన గుడ్ బై కొడితే ఇక మిగిలేది ఎవరు అన్నదే సందేహం. అయినా రాజు గారి పోకడ ముందు నుంచి తెలుసు కాబట్టి మేము పట్టించుకోమని బీజేపీ నేతలు ధీమా పడితే అది వారి ఇష్టమనుకోవాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?