
వైసీపీ దళిత ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో టీడీపీలో బెర్త్ ఖరారు చేసుకున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. వైసీపీ సీనియర్ నాయకుడైన ఆ ఎమ్మెల్యేకు వివిధ కారణాలతో రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేనని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దీంతో సదరు ఎమ్మెల్యే టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.
సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆ నాయకుడు మొదట ప్రజారాజ్యం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రమైన ఆ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. పోయిన చోటే వెతుక్కోవాలనే చందంగా ఆయన ఓడిపోయిన చోటే వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
అయితే తన లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలెవరినీ ఖాతరు చేయకపోవడంతో పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆయన్ను తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఓ ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అయితే వైసీపీ కంచుకోట అయిన ఆ నియోజకవర్గంలో గ్రామ, మండలస్థాయి నాయకులతో ఎమ్మెల్యేకు పొసగలేదు. మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని వైసీపీ శ్రేణులు అధిష్టానానికి గట్టి వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఆయన్ను మార్చక తప్పనిసరి పరిస్థితి నెలకుంది. తనకు వైసీపీలో టికెట్ దక్కదని తేలిపోవడంతో టీడీపీలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఆర్థికంగా స్థితిమంతుడైన ఆ ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఆయనకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపినట్టు సమాచారం. తనకు ముందే టికెట్ ఇవ్వనని చెప్పేసిన సీఎం జగన్‌కు సదరు ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పినట్టు తెలిసింది. ఎందుకంటే ముందే చెప్పడం వల్ల, పక్క పార్టీతో మాట్లాడుకునే వెసలుబాటు కల్పించారని సన్నిహితులతో సదరు ఎమ్మెల్యే చెబుతున్నారని సమాచారం.
సీఎం జగన్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించినా, చంద్రబాబు "వరప్రసాదం"గా సానుకూలత వ్యక్తం చేసినట్టు ఆయన చెప్పుకుంటున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా