భారత్ సర్కారు పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉ్రగవాద స్థావరాలపై వైమానిక దాడులను ప్రారంభించింది. భారత్ లో ఉ్రగవాద కార్యకలాపాలకు ఊతమిస్తున్న స్థావరాలుగా పీఓకేలో భారత్ గుర్తించిన తొమ్మిది ప్రదేశాలలో ఈ వైమానిక దాడులు నిర్వహించారు.
ఈ ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా ప్రకటించారు. ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఒక రకంగా భారతజాతిలో చైతన్యాన్ని ప్రేరేపించే విధంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం వెనుక సరైన కారణం ఉన్నదని తెలుస్తోంది.
పహల్గాంలో అమాయకులైన పర్యాటకుల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. 25 మంది భారతీయులతో పాటు, ఒక నేపాల్ జాతీయుడు కూడా ఈ దుర్మార్గమైన దాడుల్లో మరణించారు. మరణించిన వారిలో కొత్తగా పెళ్లి చేసుకుని ఆ ఆనందమయ క్షణాలను గడపడానికి పర్యటనకు వచ్చిన నవదంపతులు కూడా ఉన్నారు.
నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ నవదంపతులుగా విహార యాత్రకు వెళితే.. అతడిని ఉగ్రవాదులు అంతమొందించారు. అతని భార్య పోస్టు చేసిన ఒక ఫోటో.. యావత్ జాతిలో ఆవేదనను కలిగించింది. ఆవేశం రగిలించింది. నవవధువు కాళ్లపారాణి ఆరక ముందే ఆమె నుదుటి సింధూరం చెరగిపోయింది. ఈ దుర్మార్గానికి బదులుగానే.. ఈ దాడులకు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. ౌ
పైగా దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు.. పర్యాటకుల్ని మతం అడిగి మరీ అంతమొందించినట్టుగా వార్తలు వచ్చాయి. హిందువులు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వారు హత్య చేశారు. అయితే పర్యటకులకు రక్షణగా నిలవడానికి ప్రయత్నించిన ముస్లిము కూడా ఈ దాడుల్లో హతమయ్యారు.
హిందూత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపిన వారి ఉగ్రవైఖరికి జవాబుగా.. హిందూత్వ ప్రతీక అయిన, సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది.
అంతర్జాతీయ సమాజంలో ఎలాంటి మచ్చ రాకుండా ఉండేందుకు, పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి వెళ్లకుండా, పౌరుల నివాస ప్రాంతాల జోలికి వెళ్లకుండా కేవలం.. చాలా జాగ్రత్తగా ఎంపిక చేసిన ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు నిర్వహించినట్టుగా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
emito ee neeli kj lk ga nundi elanti articles