ప్రజాస్వామ్య పరిరక్షకులుగా తమకు అనన్యమైన కీర్తి ప్రతిష్టలు కావాలి. భారతదేశంలో రకరకాల దుష్టశక్తుల కారణంగా ఎప్పుడెప్పుడు మలిగిపోతుందా అని అనిపించే దీనస్థితిలో ఉన్న ప్రజాస్వామ్య దీపాన్ని రెండు చేతులు అడ్డుపెట్టి పరిరక్షించే మహానుభావులుగా తమ గురించి చరిత్రలో అందరూ అనుకోవాలి.
తమ గురించి తాము ఆ రకంగా డప్పు కొట్టుకోవాలి. దానికి తగిన విధంగా చిన్నచిన్న టక్కు టమార గజకరణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాలి.
అంతే అలాంటి ప్రచారం నిరంతరాయంగా జరుగుతూ ఉంటే చాలు.. ఇక ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా వెన్నుపోటు పొడిచి సమాధి చేసినా సరే తమకు ఖాతరు లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగు అనేది వారికి ఒక వీక్ పాయింట్! అందుకోసం ఆడుతున్న రకరకాల డ్రామాలే నవతరం రాజకీయం.
ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు రెండు ముక్కలుగా చీలిపోయింది. ఎన్నికలు ప్రకటించిన తర్వాత.. ఆశావహులందరూ నామినేషన్లు వేసే ప్రక్రియ ఒక దశ. ప్రజలు వచ్చి పోలింగునాడు తమ ఓటు ద్వారా తీర్పు చెప్పేది రెండో దశ. ఈ రెండు దశల్లోనూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే ప్రక్రియ ప్రత్యేకించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగ్విజయంగా నడుస్తోంది.
శుక్రవారం నాడు రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. సీట్ల పంపకాల పంచాయతీలు, తగాదాలు, అలకలు.. రాజీ చర్చలు.. మాకు ఫలానా సీట్లే కావాలి.. మాకు బలం అమాంతం పెరిగిపోయింది.. కనుక ఇన్ని సీట్లు ఇస్తే కుదరదు.
సీట్ల సంఖ్య పెరగాలి.. వంటి పితలాటకాలు అనేకం కూటమి పార్టీల మధ్య చోటుచేసుకుంటూ వచ్చాయి గనుక… సీట్ల పంపకాల పేరుతో వారు బహధా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి అలాంటి ఇబ్బందేమీ లేదు.
ఇది ఏకధ్రువ పార్టీ. ఒక్క నాయకుడి మాట మీదనే చెలామణీ అయ్యే పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అదే వారందరికీ కూడా వేదం. కాబట్టి.. ఇక్కడ రచ్చలు, వార్తలు ఏమీ లేకుండా చాలా సునాయాసంగా అభ్యర్థుల ఎంపిక పర్వం పూర్తయిపోయింది.
కాబట్టి.. యింకా సీట్ల పంపకాల గురించి చర్చోపచర్చలు సాగించుకుంటూనే ఉండే అవసరం లేకుండా శుక్రవారం నాడే అభ్యర్థులు నామినేషన్లు వేయడం కూడా ప్రారంభించారు. కానీ ఏం జరిగింది? రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క చోటైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయడం అనే ప్రక్రియ సజావుగా సాగిందా?
ఒక చోట వైసీపీ లోక్ సభ పక్ష నాయకుడి మీదనే దాడులు చేశారు.. పోలీసులు నిర్బంధించి ఊరి వెలుపలకు పంపించారు. మరోచోట మాజీ ఎమ్మెల్యే ఆఫీసు మీద దాడికి తెగబడ్డారు. దహనం చేసేశారు. ఆస్తుల్ని కారుల్ని తగులబెట్టారు. కార్యకర్తల మీద దాడులు చేసి కొట్టారు. ఒకచోట నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని వాటిని చించి పారేశారు. మరోకచోట వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల నిర్బంధాలు అరెస్టులు జరిగాయి.
తమాషా ఏంటంటే.. అధికార తెలుగుదేశం కూటమి పార్టీలకు చెందిన నాయకులు ఇలా విచ్చలవిడిగా దాడులకు పాల్పడగా.. బాధిత వర్గానికి చెందిన వైసీపీ వారి మీదనే పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పుడు చెప్పుకున్న అన్ని సంఘటనలు కూడా పోలీసుల ఎదురుగానే జరిగాయి. వారే వీటన్నింటికీ సాక్షీ భూతులు.
ఏం జరిగినదో సమస్తం దగ్గరుండి చూసి మరీ.. వైసీపీ వారి మీద కేసులు పెట్టిన దుర్మార్గమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ యంత్రాంగం స్వయంగా కాపాడుతోంది.
చంద్రబాబు నాయుడు ఒకవైపు అచ్చమైన ప్రజాస్వామ్యాన్ని తాము పరిరక్షిస్తున్నామని పదేపదే బహిరంగ వేదికల మీద చెబుతూ ఉంటారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నాం అని కూడా అంటూ ఉంటారు. పైకి ఒకటి లోన ఒకటి మాట్లాడే, వ్యవహరించే తీరుకు చంద్రబాబు నాయుడు నిదర్శనం!
నిజానికి అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వారు అరాచకంగా వ్యవహరించడం అనేది తెలుగు ప్రజలకు అలవాటు అయిపోయింది. జగన్ హయాంలో కూడా అనేక చెదురు మదురు సంఘటనలు జరిగాయి.
మరి ఈ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ వేత్తగా గుర్తింపు ఉన్న చంద్రబాబు నాయుడు- ప్రజాస్వామ్యం కోసం ఏం చేస్తున్నట్లు?
వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి అరాచకాలు జరిగాయో వాటిని వంద రెట్లు, వేయి రెట్లు చేసి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారా?
లేదా నిజాయితీగా స్వచ్ఛంగా ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా పోలీసు యంత్రాంగం మీద ఎలాంటి ఒత్తిడిలు తీసుకురాకుండా.. స్వచ్ఛమైన ఎన్నికలు నిర్వహించి తానొక రోల్ మోడల్ గా చరిత్రలో నిలవాలనే ఆలోచన ఆయనకు ఉన్నదా అనేది చర్చించుకోవాల్సిన విషయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రదర్శిస్తున్న దూకుడు అత్యంత హేయంగా ఉంది.
ఇంతా కలిపి దీని వలన ఆయన ఏం సాధించబోతున్నారు?
మహాఅయితే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లను తెలుగుదేశం మరియు కూటమి పార్టీలు సాధించవచ్చు. తద్వారా కూటమి పరిపాలనకు రాష్ట్ర ప్రజలు నీరాజనం పడుతున్నారని.. ఎవరూ నమ్మనటువంటి అబద్ధాలను ప్రచారం చేసుకోవచ్చు. అంతకుమించి వారు ఏమైనా సాధించబోతున్నారా?
నిజానికి ఇలాంటి దుశ్చర్యల ద్వారా వాళ్ళు సాధించేది మరొకటి కూడా ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు పాల్పడిన దుర్మార్గాలకు వెయ్యిరెట్లుగా వారు మరింత అరాచకంగా వ్యవహరిస్తారు- అనడంలో సందేహం లేదు.
అంటే రాజకీయాలు ప్రజాస్వామ్యం అనే మాటలను పూర్తిగా తుంగలో తొక్కేసి వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు, విద్వేషాలు మాత్రమే చలామణి అయ్యే వ్యవస్థకు చంద్రబాబు నాయుడు రూపుదిద్దుతున్నారని అర్థమవుతోంది.
ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఆహ్వానించదగిన పరిణామం కానే కాదు.
ఎన్నికల వ్యవస్థలో రెండో దశ అయిన పోలింగ్ ప్రక్రియ కూడా ఇంకా మిగిలి ఉంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రహసనం మాత్రమే జరుగుతోంది.
పోలింగ్ విషయంలో భారీ సంఖ్యలో తమకు కిట్టని వారి ఓట్లని తొలగించడం ద్వారా ‘సర్’ అనే దుర్మార్గాన్ని నెత్తిన మోస్తూ అధికార కూటమి పార్టీలు ఎప్పటికీ ఒక అరాచకానికి పాల్పడ్డాయి. రేపు పోలింగ్ జరిగినా సరే సజావుగా జరుగుతుందని నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తుంది.
నామినేషన్ల సమయంలోనే ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్న వారు.. ప్రజలు వచ్చి స్వేచ్ఛగా ఓట్లు వేసే వాతావరణాన్ని అందించగలరా అనేది అనుమానమే! కాబట్టి ఈ రెండు రకాలుగా కూడా ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు సర్కారు భ్రష్టు పట్టిస్తున్నదని మనం అర్థం చేసుకోవాలి.
ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్రమంతా అధికార కూటమి రెండున్నరేళ్ల పాలనకు బ్రహ్మరథం పట్టిందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు డప్పు కొట్టుకుంటారు. తమ వందిమాగధులతో ప్రచారం చేయించుకుంటారు.
తమ అనుకూల మీడియాలలో రాయించుకుంటారు. సోషల్ మీడియా అనే పచ్చ కార్యకర్తలకు లక్షలకు లక్షల రూపాయలు చెల్లిస్తూ అనుకూల ప్రచారం చేయించుకుంటున్నారు కనుక వారందరితో కూడా భజన చేయించుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఏం జరిగిందో ప్రజలకు తెలుసు కదా?
ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఇలాంటి అరాచకాలతో నామమాత్రపు విజయాలను అధికార కూటమి నమోదు చేసిందో ప్రజలకు తెలుసు కదా! ఆ ప్రచారాలను వారు నమ్ముతారని అనుకోవడం భ్రమ! పైగా అసహ్యించుకుంటారు కూడా!
చంద్రబాబు నాయుడు సర్కారు వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా కొన్ని మంచి పనులు కూడా చేయవచ్చు గాక.. కానీ ఈ స్థానిక ఎన్నికల సందర్భంలో పాల్పడుతున్న దుర్మార్గాలు ప్రజలలో పుట్టించే అసహ్యం వారిని ఎన్నటికీ వెన్నాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి.
..వెంకట్ ఆరికట్ల

ఆహా…నీ ఆర్తనాదం…శ్రావణాందకరం!!!!
ఇక్కడ ఇద్దరు సమాజానికి పట్టిన చీడలే. ఒకరిఒకరు నేను ఆ చెద తినేసే పురుగు అని డప్పు కొట్టుకుంటున్నారు. ఎవరిది బాగా మోగితే వారే గొప్ప. 😂 ఇక నువ్వు చేశావు అందుకే నేను చేశాను అనేది ఒక ముసుగు. నువ్వు చేశావు కాబట్టి నిన్ను దింపి వేరే వార్ని ఎన్నుకుంటే వారు అంతే. ఇద్దరు ఇద్దరే..
అసలు వైసీపీ అధికారం లో వున్నప్పుడు చేసిన అరాచకాలు గురించి ఇప్పుడు సుద్ద పూస కబుర్లు చెపుతున్నావు… అప్పుడు నోరు విప్పలేదు..
తెలుగుదేశం పార్టీ పుట్టి 40 ఏళ్ళు… అక్కడక్కడా చెదురు మొదురు సంఘటనలు తప్ప ఇలాగ ఎప్పుడూ లేదు…. దీనికి ఆధ్యుడు మాత్రం అన్నయ్ అందులో అనుమానం లేదు..
అప్పుడు టీడీపీ క్యాడర్ మౌనం గా వున్నారు.. ఇప్పుడు అవకాశం వచ్చింది రెచ్చిపోతున్నారు.. ఇప్పుడు బాబు కూడా ఆపే పరిస్థితి లేదు
వైసీపీ లాంటి పార్టీ పుట్టడం ఆంధ్రా ప్రజల దురదృష్టం
నువ్వు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరు. అక్కడికి నువ్వేదో పెద్ద సత్య హరిశ్చంద్రుడు అయినట్టు బిల్డప్. నువ్వేంటో నీ బతుకేంటో అన్న అధికారం లో ఉన్నప్పుడు చూసాం కదా. ఇది కేవలం ఒక ప్రతీకార చర్య.
Diniki prathikaram vallu chestaru ..ee daridram samanya prajalaku enduku roju..oka roju 2 parties date fix chesukoni ground fix chesukoni kottuku savandi..enduku prajala money ni / police system ni waste chestaru mi svartha laki..wate parties/ politicans.
Dasara amount padinda ga
Avunu mari jalaga vedhava vunnappudu ycp kukksle TDP vaaritho nominations veyinchaaru kadaa
హ! హ!! గురువింద నీతులు!
అన్నయ్య టైమ్ లో ఎన్ని unanimous అయ్యాయో ఒక్కసారి గూగుల్ చేయి. Nearly 40%. అంటే unanimous ఐన వాటిలో ఎంత రౌడీయిజం చేశారో, కనీసం నామినేషన్ వెయ్యనీయకుండా ఎంత అరాచకం చేశారో ఎవ్వరు మర్చిపోలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అని పత్తిత్తు కబుర్లు చెప్తున్నావు. అప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం. అప్పుడు అన్నకి ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు. మనకి జరిగితే ప్రజాస్వామ్య ఖూనీ,అదే మనం చేస్తే అన్న క్లీన్ స్వీప్ విక్టరీ. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
ప్రజాస్వామ్యం గురించి నువ్వు, అన్న మాట్లాడితే జనాలు ఇదేదో కొత్త బూతు అనుకుంటారు. మనకున్న పేరుప్రఖ్యాతులు అలాంటివి.
మూసుకుని ఇంకేదన్నా రాయి
ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడితే జనాలు ఇదేదో కొత్త బూతు అనుకుంటారు. మన పేరుప్రాఖ్యాతులు అలాంటివి.
మూసుకుని ఇంకేదైనా రాయి
ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడితే జనాలు ఇదేదో కొత్తరకం తిట్లు అనుకుంటారు. మన పేరుప్రఖ్యాతులు అలాంటివి మరి.
మూసుకుని ఇంకేదైనా రాయి
Punganoor pungi pagilindi ani paluvuru medhavula maata yera van kara yenk
Ipudu nayam
Poyina sari namineshanlu veyaniyaledu. Marchipoyava ariveerakatla