బోయపాటి శీనుతో బన్నీ చేస్తున్న సరైనోడు సినిమా వర్క్ ఫూర్తి కావచ్చింది. దీని తరువాత బన్నీ సినిమా ఏమిటన్నదానిపై క్లారిటీ వచ్చేసినట్లే. హరీష్ శంకర్ తో గతంలో ఓసారి భేటీ వేసారు కానీ, ఇప్పుడైతే చాన్స్ ఇవ్వడం లేదు. బన్నీ తరువాతి సినిమా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ తోనే ఫైనల్ అయింది.
ఈ గ్యాసిప్ గత కొద్ది కాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఫైనల్ అయింది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ తమిళంలో సూర్యతో సినిమా చేస్తున్నారు. అది దాదాపు పూర్తయినట్లే. అంటే బన్నీ, విక్రమ్ ఇద్దరు ఒకేసారి రెడీ అవుతారు. అప్పుడు ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది.
అయితే విక్రమ్ కుమార్ దగ్గర సమస్య ఏమిటంటే స్క్రిప్ట్ కు చాలా టైమ్ తీసుకుంటారు. మనం స్క్రిప్ట్ కు దాదాపు ఏడాది టైమ్ తీసుకున్నారు. మరి బన్నీ తో సినిమాకు స్క్రిప్ట్ రెడీగా వుంటే వెంటనే ప్రారంభమవుతుంది. ఇద్దరు తరువాత ప్రాజెక్టు కు రెడీ అంటున్నారంటే, రెడీగా వుండి వుండాలి.