రామ్ చరణ్ సోలో ప్లాన్ మళ్లీ

దసరా ఓ రోజు అటైనా..ఇటైనా సరే రామ్ చరణ్ సినిమా దసరాకు విడుదల ఖాయం అంట. అందుకు అనుగుణంగా పక్కా షెడ్యూలు, డేట్లతో సహా ప్లాన్ చేసి పెట్టారట. నెల  రోజులకు పైగా ఏకబిగిన…

దసరా ఓ రోజు అటైనా..ఇటైనా సరే రామ్ చరణ్ సినిమా దసరాకు విడుదల ఖాయం అంట. అందుకు అనుగుణంగా పక్కా షెడ్యూలు, డేట్లతో సహా ప్లాన్ చేసి పెట్టారట. నెల  రోజులకు పైగా ఏకబిగిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చేసి, ఆప్పుడు విదేశాలకు షిఫ్ట్ అవుతారట. జూన్, జూలైల నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసేయాలని ఫర్మ్ గా డిసైడ్ అయ్యారట. 

పాటలు కొన్ని విదేశాల్లో తీస్తారు. పొస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, దసరాకు విడుదల చేయాలని సంకల్పం. లాస్ట్ మినిట్ హడావుడి లేకుండా వీలయినంత ముందుగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కు కాస్త ఎక్కువ టైమ్ వుండేలా షెడ్యూలు డిజైన్ చేసారట.

రామ్ చరణ్ ప్లానింగ్ భలేగా వుంటుంది. బన్నీ, ఎన్టీఆర్, మహేష్, పవన్, ప్రభాస్, బాలయ్య, ఎవరూ దసరా బరిలోకి వచ్చేలా లేరు. ఇన్నాళ్లు సంక్రాంతికి వచ్చి, కలెక్షన్లు తగ్గకుండా చూసుకుంటున్న రామ్ చరణ్ ఈసారి అదే ప్లాన్ దసరాకు వేసాడన్నమాట. నిర్మాతకు కలిసి వచ్చే అంశమే.