ఫాదర్ల పాటలను కుర్రాళ్ల సినిమాలకు రీమిక్స్ చేయడం ముందు ఫ్యాషనయింది..ఆపై ఆనవాయతీగా మారింది. రామ్ చరణ్ కొన్ని సినిమాల్లో మెగాస్టార్ పాటలు రిపీటయ్యాయి..రీమిక్స్ లయ్యాయి. మనంలో అక్కినేని నేను పుట్టాను..పాట వినిపించింది. ఒక లైలా కోసంలో మరోసారి అక్కినేని పాట రీమిక్స్ అయ్యింది.
ఇప్పుడు అఖిల్ సినిమాకు ఏం చేయాలని యోచిస్తున్నారట. సినిమాకు ఓ స్పెషల్ సాంగ్ ఎలాగూ అవసరం కాబట్టి, మాంచి పాత హిట్ ను తీసుకుని, రీమిక్స్ చేయాలని చూస్తున్నారట. నాగ్ ఎవర్ గ్రీన్ హిట్..హలో బ్రదర్స్ లో 'కన్నెపిట్టరో'పాటయితే, ఒకరికి మించిన నెంబర్లతో అమ్మాయిలను అఖిల్ పక్కన చూపించవచ్చు అన్న అయిడియా ఒకటి ప్రస్తుతం డిస్కషన్ లో వుందట.
పాపం, ఈ సినిమాను రీమేక్ చేయాలని దర్శకుడు శ్రీనివాసరెడ్డిని చానాళ్లు అన్నపూర్ణ చుట్టు తిప్పారు..ఇంతకీ అదేమయిందో?