‘టెంపర్‌’ పీక్స్‌లో ఉందట!

ఎన్టీఆర్‌ ఎంత గొప్ప డాన్సర్‌ అనేది ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవి తర్వాత అంతటి డాన్సర్‌ అని కితాబులు అందుకున్నాడు. తన తర్వాత వచ్చిన అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ కూడా డాన్సుల్లో…

ఎన్టీఆర్‌ ఎంత గొప్ప డాన్సర్‌ అనేది ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవి తర్వాత అంతటి డాన్సర్‌ అని కితాబులు అందుకున్నాడు. తన తర్వాత వచ్చిన అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ కూడా డాన్సుల్లో తమదైన ముద్ర వేసారు. ఇంకా చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఎన్టీఆర్‌ కంటే వీళ్లిద్దరే బెటర్‌ డాన్సులు చేస్తున్నారు. 

అదుర్స్‌ షూటింగ్‌ టైమ్‌లో యాక్సిడెంట్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌ స్లో అయిపోయాడు. అతడి డాన్సుల్లో సిగ్నేచర్‌ స్టెప్స్‌ కనుమరుగయ్యాయి. ఏదో డాన్స్‌ చేసాడంటే చేసాడు అనిపించుకునేటట్టు కాళ్లు చేతులు వేగంగా ఆడిస్తున్నాడంతే. ఎన్టీఆర్‌ డాన్సులు సరిగా చేయని కారణంగా అతని సినిమాలు కొన్ని ఫాన్స్‌ని కూడా నిరాశపరిచాయి. 

ఈ లోటు తెలుసుకున్న పూరి జగన్నాథ్‌ ‘టెంపర్‌’లో ఆ కొరత లేకుండా చూసుకున్నాడట. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ప్రతి పాటలోను మంచి స్టెప్స్‌ వేసాడట. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ముందు వచ్చే ‘టెంపర్‌’ టైటిల్‌ సాంగ్‌లో రెచ్చిపోయాడంట. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ సాంగ్‌గా చెప్పుకునే ‘నాచోరే నాచోరే’ పాటని మించిపోయి ఇందులో డాన్స్‌లు ఉంటాయని సమాచారం. సో.. ఈ సినిమాతో ఎవరికి ఎలా ఉన్నా ఎన్టీఆర్‌ ఫాన్స్‌కి మాత్రం పండగన్నమాట.