ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎర్రమట్టిదిబ్బల్ని కొల్లగొట్టడంపై జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడాన్ని ప్రశ్నించడం ఆయన ఉద్దేశం. గతంలో ఎర్రమట్టి దిబ్బల్ని పవన్‌కల్యాణ్ సందర్శించడాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో పర్యావరణశాఖ మంత్రి కూడా అయిన పవన్‌కల్యాణ్ తన పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి పోస్టుపై తప్పక స్పందించే అవకాశాలున్నాయి. రాజకీయం అంతా నటనే. బొలిశెట్టితో పవన్‌కల్యాణే ఒక పోస్టు పెట్టించి, ఆ తర్వాత తానే స్పందించినట్టుగా వుండాలనేది కూడా పవన్ వ్యూహమై వుండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో దేన్నీ కొట్టి పారేయలేం.
ఎర్రమట్టి దిబ్బల్ని కూటమిలోకి ఒక పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారనే సమాచారాన్ని పవన్‌కల్యాణ్ చెవిలో జనసేన నేతలు వేసినట్టు సమాచారం. దీంతో దీన్ని ఇష్యూగా క్రియేట్ చేస్తే తప్ప వర్కౌట్ కాదని పవన్‌కల్యాణ్ భావనగా పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రమట్టి దిబ్బల్ని దోచుకోవడంపై పవన్‌కల్యాణ్ సీరియస్ అయ్యినట్టు ఇవాళ బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారనే సమాచారం కంటే ముందే పవన్ స్పందిస్తారని అంటున్నారు.
ఈ విషయంలో కూడా సీఎం, డిప్యూటీ సీఎంలలో ఎవరు పైచేయి సాధిస్తారనేది కూడా ముఖ్యమే. సాధారణంగా చంద్రబాబునాయుడు ఇతరులకు పాజిటివ్ అయ్యే చాన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి ఎర్రమట్టి దిబ్బల్ని అక్రమంగా తరలించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యిందనే సమాచారం వస్తుంది. ముందుగా ఎవరు స్పందిస్తారనేదే ముఖ్యం.