జ‌గ‌న్‌ది అమాయ‌క‌త్వ‌మా? అజ్ఞాన‌మా?

ఎవ‌రెన్ని నీతులు చెప్పినా, విన్నంత వ‌ర‌కే. బొత్స‌ను గెలిపించుకోవాలంటే జ‌గ‌న్ అనుస‌రించాల్సిన మార్గాన్ని అన్వేషించాలి.

యుద్ధం అంటేనే నీతిలేనిది. ఇందులో ధ‌ర్మం, అధ‌ర్మానికి చోటు వుండ‌దు. పాండ‌వులు, కౌర‌వుల మ‌ధ్య సాగిన యుద్ధంలో కూడా విజ‌యం కోసం ఇరుప‌క్షాలు స‌య‌మానుకూలంగా అధ‌ర్మానికి పాల్ప‌డ్డాయి. ఇందులో ఎక్కువ‌, త‌క్కువ అనేదొక్క‌టే తేడా. అయితే అంతిమంగా విజేత‌లు రాసిందే చ‌రిత్ర‌. ఇదంతా చెప్పుకోవ‌డం ఎందుకంటే… మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ‌ర్మ యుద్ధం గురించి మాట్లాడ్డం వ‌ల్లే.

ఉమ్మ‌డి విశాఖ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌కు షెడ్యూల్ వెలువ‌డింది. త‌మ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను వైఎస్ జ‌గ‌న్ బ‌రిలో నిలిపారు. స్థానిక సంస్థ‌ల్లో మెజార్టీ వైసీపీకి వుంది. కానీ అధికారంలో కూట‌మి వుండ‌డంతో ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో వైసీపీలో ఆందోళ‌న మొద‌లైంది. ఈ ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాల‌ని వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో పాడేరు, అర‌కు నియోజ‌క‌వ‌ర్గాల ఎంపీటీసీ, జెడ్పీటీసీల‌తో తాడేప‌ల్లిలో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. జ‌గ‌న్ నీతులు చెప్పారు. విలువలు, విశ్వ‌స‌నీయత వైసీపీ నైజం అన్నారు. ప్ర‌లోభాల‌కు లొంగొద్ద‌ని జ‌గ‌న్ కోరారు. చంద్ర‌బాబు అధ‌ర్మ యుద్ధానికి తెర‌లేపార‌ని విమ‌ర్శించారు. ఈ యుద్ధంలో మ‌న‌మే గెల‌వాల‌ని ఆయ‌న అన్నారు. ఒక‌వేళ తానే సీఎంగా వుండి, మెజార్టీ లేక‌పోతే పోటీ పెట్టేవారం కాద‌ని ఆయ‌న అన్నారు.

ఈ మాట‌లు వింటే జ‌గ‌న్ అజ్ఞానా? అమాయ‌కుడా? అనే అనుమానం క‌లగ‌కుండా వుండ‌దు. జ‌గ‌న్ హ‌యాంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఏ రీతిలో జ‌రిగాయో బ‌హుశా ఆయ‌న‌కు తెలియ‌లేద‌ని అనుకోవాలేమో! రాష్ట్ర వ్యాప్తంగా చాలా వ‌ర‌కూ నామినేష‌న్లు కూడా వేయించ‌ని ప‌రిస్థితి. ఎక్క‌డ చూసినా ఏక‌గ్రీవాలే. ఇప్పుడేమో జ‌గ‌న్ ధ‌ర్మం, అధ‌ర్మం అంటూ ప్ర‌వ‌చ‌నాలు చెబుతున్నారు.

రాజ‌కీయాల్లో లేని వాటి గురించి జ‌గ‌న్ ఎక్కువ‌గా మాట్లాడుతుంటారు. అధికారంలో ఎవ‌రున్నా, ప‌వ‌ర్‌ను దుర్వినియోగం చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. ఇందులో ఎవ‌రికీ ఎవ‌రూ తీసిపోరు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఏం చేయాలో జ‌గ‌న్ ఆలోచించాలి. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌, ప్ర‌లోభాలు, ధ‌ర్మం, అధ‌ర్మం గురించి మాట్లాడ‌క‌పోవ‌డం మంచిది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కొత్త ఒర‌వ‌డిని ప్ర‌వేశ పెట్టింది తామే అని జ‌గ‌న్ మ‌రిచిపోకూడ‌దు.

చేసుకున్న వాళ్ల‌కు చేసుకున్నంత మ‌హ‌దేవ అని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ త‌ర‌చూ… విత్తును బ‌ట్టే ఫ‌లాలు వుంటాయ‌ని చెబుతున్నారు. గ‌తంలో త‌మ పాల‌న‌లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విత్తును బ‌ట్టే నేటి ఫ‌లాలు అని జ‌గ‌న్ గ్ర‌హించాలి. అంతిమంగా అధికారం లేనిదే ఉండ‌లేని ప‌రిస్థితి. ఇందుకు స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు అతీతులు కారు. ఎవ‌రెన్ని నీతులు చెప్పినా, విన్నంత వ‌ర‌కే. బొత్స‌ను గెలిపించుకోవాలంటే జ‌గ‌న్ అనుస‌రించాల్సిన మార్గాన్ని అన్వేషించాలి.

59 Replies to “జ‌గ‌న్‌ది అమాయ‌క‌త్వ‌మా? అజ్ఞాన‌మా?”

  1. జగన్ చక్రవర్తి హయాంలో అన్ని ఏకగ్రీవాలే

    … అసలు ఎన్నికలు జరిగితే కదా…

  2. జగన్ చక్రవర్తి హయాంలో అన్ని ఏకగ్రీవాలే

    … అసలు ఎన్నికలు జరిగితే కదా…

  3. అసలు ఇతని విలువలు విశ్వాస నీయత చూస్తుంటే ఒక్కో సారి భయం వేస్తుంది. వివేకం సార్ గుర్తుకు వస్తుంటారు ప్రెసిడెంట్ మే డే ల్. బ్రాండ్. ఎర్ర చందనం ఇసుక ఇలా ఎవ్వరో గుర్తుకు వస్తాయి . ఒక్కసారి మళ్ళీ ఆ గాంధీ ఏ ఇలా పుట్టేసేదేమో అనిపిస్తుంది

  4. అతన్ని అమాయకుడు అనుకుంటే మనకన్నా అమాయకులు ఎవరు ఉండరు !!

  5. Ammo amayakuda ? Dual personality fellow if you observe while insulting CBN or criticizing CBN, he talks with his face full of grudge and when coming out into public or walking somewhere his body language is entirely different(as innocent person) pisukunta, navvukunta ammaykuda la natistadu. Saddist vedava ,narcissisticfellow

  6. జగన్ రెడ్డి స్వయంగా బాబాయ్ ని నరికి నరికి చంపాడు ఈ దుర్మార్గుడు విలువలు, విశ్వ‌స‌నీయత గురుంచి మాట్లాడుతున్నాడు

    జగన్ రెడ్డి అంత నీచుడు ఎవ్వరు లేరు అని చెల్లి షర్మిల , తల్లి వి!జ!య!మ్మ ఎన్నో సార్లు చెప్పారు

  7. Dr సుధార్ ని వేధించి చంపటం తొనె మీ విలువలు తెలిశాయి.

    వివెకా హత్యతొనె మీ విశ్వసనీయత కూడా జనానికి అర్ధం అయ్యింది.

    తొబుట్టువుకి తన ఆస్తి కూడ ఇవ్వకుండా గెంటెసినప్పుడె, కౌరవులు ఎవరొ అర్ధం అయ్యింది

    ఇంకా విలువలు, విశ్వసనీయత!, పాండవులు, కౌరవులు అని సోది చైపితె ఎల?

    ఎది అయినా గుండె మీద చెయివెసుకొని తముడుకొకుండా అబద్దాలు చెప్పటం ఆ కుటుంబంలొ అయ్యా కొడుకులకి వెన్నతొ పెట్తిన విద్యనె!

  8. స్టానిక సవస్తలలో ఎందుకు అన్ని సీట్లు వచ్చి ఎన్ని సీట్లు వచ్చాయి అని కొట్టిన సుత్తి కొట్టకుండా కొట్టారు M B S ప్రసాద్ ..
    ఇప్పుడు ఏమంటారో అడుగు GA
  9. thandri dhahana samskaaralu kooda kaaka mundhu 147 mandhi mla santhakalu pettinchukunna vaadiki viluvalaa? sontha babayini champinchi aa hathyani rajakeeyam chesi cm kurchee ekki, ekkina tharwatha gaaliki vadhilesina vaadiki viluvalaa? thodabuttina chellelli thana social media sainyam dhvaara, chellelli puttukani prasninchina vaadiki viluvalaa?

  10. తన అయిదేళ్ల పాలన లో ఎన్నెన్ని అరాచకాలు, అవినీతి చేసాడో ఒక్క జగన్ రెడ్డి ఒక్కడికే తెలుసు..

    అందుకే.. ఈ రోజు ప్రజల్లోకి రావడానికి వణికి పోతున్నాడు.. హడలిపోతున్నాడు ..

    ఒక్కడి కోసం వందల మంది సెక్యూరిటీ కావాలని .. ప్రజలే తిరస్కరించిన వీడిని .. ఆ ప్రజల డబ్బుతో .. ఆ ప్రజల నుండి కాపాడమని కోర్టులను అడుక్కొంటున్నాడు..

    కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక మాజీ సీఎం .. అతనెప్పుడూ వందల మంది సెక్యూరిటీ అడగలేదు..

    అసెంబ్లీ కి కూడా వెళ్లలేని దుస్థితి లో జనాలు ఛీ కొట్టారు..

    ఇప్పటికీ సంక్షేమం చేశానని చెప్పుకొంటాడు.. సంక్షేమం చేసాడు కాబట్టే జనాలు ఓడించారు అనే కనీస జ్ఞానం లేదు..

    జగన్ రెడ్డి పార్టీ జనాలను రోడ్డులో అడ్డం గా నరికేస్తున్నా.. జనాలు అయ్యో పాపం అనడం లేదంటే.. దానికి కారణం జగన్ రెడ్డి లాంటి నీచుడికి తగిన శాస్తి జరుగుతోందని అదే జనాలు సంతోషపడటమే..

  11. మద్యపాన నీషేధం చేసాడా ? సీపీఎస్ రద్దు చేసాడా? పోలవరం పూర్తి చేశాడా? ప్రతి బిడ్డకు అమ్మఒడి ఇచ్చాడా? ఇలా చెప్పుకుంటూ పోతే …. విలివలు విశ్వసనీయతా ? ఆ మాటలు మాట్లాడడానికి సి గ్గు ఉండాలి?

  12. వస్తాడు ..

    షిక్కటి చిరు నవ్వుతూ పలకరిస్తాడు

    రూపాయి జేబులో నుండి తీసి ఇవ్వడు

    మళ్ళీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కి దొబ్బెస్తాడు

    వీడికి Paytm గొర్రెలు భజన..ఏమి లాత్కోరు కార్యకర్తలు రా

  13. inkoka vishayam undadhu …raadhu .. ave matalu 10 years ga cheptunnadu…arigi poyina tape recorder laaga..

    inkoka topic meeda maatlada ledu ..anna ki subject nil ..

    aa context lo .. em maatladalo kooda teledam ledu ..

  14. బాబు పాలనా ఇలా

    మండలానికి ఇద్దరిని లేపండి( చంపండీ ) .. టిడిపి ఎమ్మెల్యే

Comments are closed.