ఆగస్ట్ 15 సినిమాలు ఆశించిన స్థాయిలో ఓపెన్ అవ్వలేదు. పోటాపోటీగా వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు రెండూ భారీ ఓపెనింగ్స్ దక్కించుకోలేకపోయాయి. ప్రచారం గట్టిగానే చేసినప్పటికీ ఎందుకో థియేటర్లలో ఆక్యుపెన్సీ కనిపించలేదు.
ఇక మొదటి రోజు వసూళ్ల విషయానికొస్తే డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 12.45 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు పోస్టర్ కూడా వదిలారు.
అటు మిస్టర్ బచ్చన్ సినిమాకు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ పీఆర్ నుంచి అందిన సమాచారం మేరకు.. 8 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే బచ్చన్ మీద డబుల్ ఇస్మార్ట్ దే పైచేయి.
బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాలపై మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. ఈరోజు బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. దీంతో సోమవారం నాటికి ఏ సినిమా నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ రెండు సినిమాలతో పాటు తంగలాన్, ఆయ్ సినిమాలు కూడా వచ్చాయి. గట్టిగా ప్రచారం చేసినప్పటికీ తంగలాన్ సినిమాకు తెలుగులో రెస్పాన్స్ పెద్దగా రాలేదు. అటు ఆయ్ సినిమా చెప్పినట్టుగానే నవ్వులు పంచుతోంది. అయితే స్టార్ ఎట్రాక్షన్ లేకపోవడంతో, దీని థియేట్రికల్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది అప్పుడే చెప్పలేం.
Vc available 9380537747
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు
థియేటర్ మీద ఓటిటి దే పైచేయి
Rendu average movies