ఈ రోజు నువ్వు రాఖీ క‌ట్ట‌లేక పోవ‌చ్చు… కానీ!

రాఖీ పండుగొస్తే… అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల అనుబంధాల్ని గుర్తు చేసుకోవ‌డం స‌హ‌జం. రాఖీ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సోద‌రుల‌కు రాఖీ క‌ట్టి, త‌మ అభిమానాన్ని సోద‌రీమ‌ణులు చాటుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి…

రాఖీ పండుగొస్తే… అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల అనుబంధాల్ని గుర్తు చేసుకోవ‌డం స‌హ‌జం. రాఖీ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సోద‌రుల‌కు రాఖీ క‌ట్టి, త‌మ అభిమానాన్ని సోద‌రీమ‌ణులు చాటుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ త‌న చెల్లెల్లి గుర్తు చేసుకోవ‌డం విశేషం. ఆమెకు అండ‌గా వుంటాన‌ని ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌క‌టించారు. రాఖీ నాడు కేటీఆర్ ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టారు.

‘ఈ రోజు నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నీకు కష్టమొచ్చినా నేను అండగా ఉంటా’ అని కేటీఆర్ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు లవ్‌ సింబల్‌ను జత ప‌రిచారు. అలాగే గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫొటోను ఆయ‌న‌ షేర్ చేయండ ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత జైలుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె తీహార్ జైల్లో గ‌డుపుతున్నారు. ప‌లు ద‌ఫాలు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. ఇంకా ఎంత కాలం బెయిల్ ద‌క్క‌దో తెలియ‌ని ప‌రిస్థితి. అప్పుడ‌ప్పుడు కుటుంబ స‌భ్యులు కవిత‌ను ప‌రామ‌ర్శించి వ‌స్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం ఇంత వ‌ర‌కూ కూతుర్ని చూడ‌డానికి వెళ్ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

26 Replies to “ఈ రోజు నువ్వు రాఖీ క‌ట్ట‌లేక పోవ‌చ్చు… కానీ!”

  1. ఆమె రాఖీలు కడుతుందో, లేక రాఖీలతో బేడీలు వేస్తుందో అర్ధం కానల్టుగా ఉంది ఆ photo

  2. డబ్బు దస్కం ఉన్నవాళ్ళకె భావావేశాలు , పేదవాడికి ఆకలి తప్ప ఏ ఆవేశం ఉండదు. అదే ఈ స్వామ్యానికీ , బడా సామీలకి శ్రీరామ “రక్షా”.

  3. అ!రే!య్ బేవకూఫ్ గా చేసిన కబ్జాలు ,ధరణి భూ దందాలు , ఫోన్ tapping లలో లొంగిపోయి తీహార్ కి వెళ్లి అవకాశం మిస్ చేసుకున్నావ్ , అయినా పర్లేదు వచ్చే సంవత్సరం కుటుంబం అంతా కలిసి బతుకమ్మ ఆడురి

  4. అంతేలే GA …మన షెల్లమ్మా సెంటిమెంట్ మాత్రం నీకు కనిపించదు ….అన్యాయం GA…..

  5. ఎంటన్న …అక్క ఎమైనా freedom fight చెసి తిహర్ కు వెల్లిందా …సారా యాపరం చెసింది అన్న

Comments are closed.